Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భారత్ తరపున పారిస్ ఒలంపిక్స్ బరిలో ఎంత మంది ఉన్నారంటే..?
మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ తరఫున 117 మంది క్రీడాకారులతో కూడిన బృందం వెళ్లనుంది. ఇందులో ప్రపంచ ర్యాంకింగ్ కోటాలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మహిళా షాట్‌పుటర్ అభా కతువా పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 26 నుంచి పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. పారిస్ వేదికగా క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

విశ్వ క్రీడల్లో పతకాల వేట కోసం భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు బయలుదేరనున్నారు. ఈ జాబితాలో ప్రపంచ ర్యాంకింగ్ కోటాలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మహిళా షాట్‌పుటర్ అబ్బా కతువా పేరు లేదు. ఆమె పేరు ఎందుకు తొలగించారు అనేది తెలియాల్సి ఉంది. క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది అధికారుల బృందం కూడా పారిస్ చేరుకున్నారు. నిబంధనల ప్రకారం సహాయక సిబ్బంది సంఖ్య. 67 కు మించకూడదు. దీంతో అధికంగా ఉన్న సిబ్బంది ఖర్చు ప్రభుత్వం భరించనుంది.
విశ్వ క్రీడల కోసం భారత్ తరఫున పాల్గొనే వారిలో 29 మంది క్రీడాకారులతో అథ్లెటిక్స్ బృందం అగ్రస్థానంలో ఉంది. వారిలో 11 మంది మహిళలు, 18 మంది పురుషులు ఉన్నారు. షూటింగ్ టైమ్‌లో 21, హాకీ టీమ్ లో 19 మంది ఉన్నారు. టేబల్ టెన్నిస్ ఎనిమిది బ్యాడ్మింటన్ ఏడు రెజ్లింగ్ ఆర్చరీ, ఆరు బాక్సింగ్, గోల్ఫ్ నాలుగు, టెన్నిస్ మూడు, స్విమ్మింగ్ రెండు, సెలిన్ రెండు, ఈక్వెస్ట్రియన్, జూడో రోయింగ్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఒక్కరూ పోటీ పడుతున్నారు.
2021 లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించకున్న నీరజ్ చోప్రా మరోసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు. బ్యాడ్మింటన్ బాక్సింగ్ రెజ్లింగ్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్నట్లు క్రీడానిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఒలింపిక్స్ బృందానికి చెక్‌దే మిషన్‌గా షూటర్ గగన్ నారంగ్ వ్యవహరించనున్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత తరపున టేబల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్‌తో పాటు మహిళా స్టార్ షట్లర్ పీవీ సింధు పథక అధికారిగా ఉండనున్నారు.



Click it and Unblock the Notifications