Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
అంబానీ పెళ్లి వేడుకలను ఒక్కొక్కరూ ఎంత తీసుకున్నారో తెలుసా.. డబ్బు చుట్టే మొత్తం పెళ్లి జరిగిందా..?
ముఖేష్ అంబనీ అనంత్ అంబానీ పెళ్లిని ఎవ్వరూ ఎక్కడా చూడనంత ఘనంగా చేశారు. దేశ విధేశాల్లో వున్న ప్రముఖులకు చెక్కులు ఇచ్చీ మరీ ఆయన వేడుకకు పిలిపించారు. పైసానే పరమాత్మ అన్న విషయాన్ని అంబానీ ప్రపంచంలోని అందరికీ చూపించాడు. పెళ్లి ఖర్చులను జియో రేట్లు పెంచి తీసుకున్నారు. జియో రేట్లు 25 శాతం ఇటీవల పెరిగిన విషయం మనందరికీ తెలిసిందే. తనకు అనుకూలమైన ప్రభుత్వం వుంది కాబట్టి ట్యాక్సులు చూపించాల్సిన అవసరం కూడా లేదనుకున్నారే ఏమో, ఏకంగా 7 నెలలపాటు అనంత్ అంబానీ పెళ్లిని ఘనంగా నిర్వహించారు.
ఇక అనంత్ అంబానీ అనారోగ్యంతో బాధపడుతుండం, అతని కళ్లల్లో ఆనందం చూడాలని తండ్రి ముఖేష్ అంబానీకి తహతహలాడింది. ఇది కూడా ఎక్కువ ఖర్చుపెట్టడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 350 కోట్ల బంగారంతో చేసిన వస్త్రాలను పెళ్లిరోజు పెళ్లి కొడుకు, పెళ్లికూతురు వేసుకున్నారు.

2023 డిసెంబర్ 29న రాజస్థాన్‌లోని ఒక గుడి వద్ద శాస్త్రోత్కంగా ఎంగేజ్‌మెంట్ ను చేశారు. ఎందుకంటే ముఖేష్ అంబానీ సాంప్రదాయాలను బలంగా పాటిస్తారు, దైవభక్తి కూడా చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు. తరువాత జనవరిలో 1200ల కోట్లను ఖర్చు చేసి 600 మంది సెలబ్రెటీలను పిలిచి ఘనంగా ఎంగేజ్మెంట్‌ను నిర్వహించారు.
మార్చ్‌లోని ప్రీ వెడ్డింగ్ పార్టీలో బాలీవుడ్ స్టార్లందరూ హంగామా చేశారు. రామ్‌చరణ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు. దాదాపు 1200ల మంది టాప్ సెలబ్రెటీలను ఈ వేడుకకు పిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న 100 మంది చెఫ్‌లను పిలిపించి వంటలు చేయించారు. ఈ వేడుకకు బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్, ట్రంప్ కుటుంబం కూడా హాజరైంది.
ఈ వేడుకకు హాజరుకావడానికి ఒక్కో బాలీవుడ్ స్టార్‌కు సుమారు 5 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను ఇచ్చారని తెలుస్తోంది. ఇక హీరోయిన్లకు 25 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల వరకు ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఇక స్టార్ హోటల్లో, ప్రత్యేక విమాన సర్వీసులు ఉచితంగా చెప్పుకోవచ్చు. మూడు గంటల పాటు పాటలు పాడిన రెహెన్నాకు 78 కోట్లిచ్చారు. మొత్తం 2వేల కోట్ల వరకు ఈ ప్రీ వెడ్డింగ్‌కు ఖర్చు చేశారు. కొంత మంది పేరున్న మీడియా ప్రముఖులను కూడా ఆహ్వానించారు.
ప్రపంచంలోని ప్రముఖులు కూడా తాము వెళ్లడం ద్వారా తమకు రెమ్యునరేషన్ వస్తుందని స్టార్లు ఆ వేడుకకు హాజరయ్యారు. మే నెలలో మళ్లీ లగ్జరీ షిప్‌లో మరో వేడుకను జరుపుకున్నారు. పెళ్లికి ముందు 50 పేద జంటలకు పెళ్లి చేసి వారికి కానుకలు కూడా ఇచ్చారు. జులై 2 నుంచి వేడుకలు ఊపందుకున్నాయ్. తరువాత జియో సెంటర్లో పెళ్లి వేడుక మొదలైంది. 16వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. టాలీవుడ్ నుంచి మహేష్ రానా, రాంచరణ్, వెంకటేష్ హాజరయ్యారు, కోలీవుడ్ నుంచి నయనతార, రజినీకాంత్, సూర్య, అట్లీ, ఏఆర్ రెహ్మాన్‌తో పాటు మరికొంతమంది హాజరయ్యారు. క్రికెటర్లు దాదాపు అందరూ హజరయ్యారని చెప్పుకోవచ్చు.
రజినీ కాంత్ పెళ్లికొడుకుతో కలిసి డ్యాన్స్ చేయడం హైలైట్‌గా చెప్పుకోవచ్చు. జస్టిన్ బీబర్‌కు 80 కోట్లు ఇచ్చి రప్పించుకున్నారు. 100 విమానాలు, 120 ఫాల్కన్ జెట్లు, 1000 కార్లు, 4వేల హోటల్ గదులను బుక్ చేశారు. అతిథులకు కూడా ప్రత్యేకంగా ఒక డ్రెస్ కోడ్ ఇచ్చారు. ఈ వేడుక మొత్తం డబ్బు చుట్టే తిరిగింది. ఇక చివరగా ఈ రోజు ఆదివారం పెళ్లి ముగింపు వేడుక జరగనుంది. అంబానీ స్వంత భవనం అంటిల్లాలో ఈ వేడుకలు జరుగనున్నాయ్.



Click it and Unblock the Notifications