Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
OFFICIAL: బెంగళూరులో ఇద్దరికి సోకింది HMPV వైరస్సే.. వారి పరిస్థితి ఎలా ఉందంటే?
ఈరోజు ఉదయం బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు HMPV వైరస్ సోకినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ చిన్నారులకు సోకింది.. చైనాలో విస్తృతంగా సోకుతున్న HMPV వైరస్సే అని ICMR ధృవీకరించింది. ఆ చిన్నారులకు అదే వైరస్ సోకిందని వెల్లడించింది. రొటీన్ సర్వీలియన్స్‌లో వారిద్దరిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజోన్స్‌ను గుర్తించామని వెల్లడించింది. ఇప్పటికే ఈ వైరస్ కేసులు చైనాతో పాటు పలు దేశాల్లో కూడా నివేదించబడ్డాయని, మన దేశంలో కూడా రెండు కేసులను గుర్తించామని తెలిపింది.
ఆ ఇద్దరు చిన్నారులు ఇప్పటి వరకు ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదని, వారికి ఆ వైరస్ సోకడం అనేది గమనార్హం అని వెల్లడించింది. వారిద్దరూ ప్రస్తుతం బాప్టిస్టు ఆసుపత్రిలో పొందుతున్నారని, వారికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ప్రస్తుత డేటా ప్రకారం మన దేశంలో ఈ HMPV వైరస్ కేసుల పెరుగుదల విస్తృతంగా లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఈ రెండు కేసులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది. కేసులు పెరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలి. ప్రతి 20 సెకండ్లకు ఒకసారి చేతులను శుభ్రం చేసుకోవాలి. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు గుడ్డ అడ్డం పెట్టుకొని తుమ్మాలి. అలాగే వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితే బయటికి రావొద్దు. ఇంట్లోనే ఉండి ఇతరులకు అంటకుండా చూసుకోవాలి.
లక్షణాలు ఎలా ఉంటాయంటే
ఈ వ్యాధి సోకిన వారికి కరోనా లక్షణాలే ఎక్కువగా ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. గొంతునొప్పి వంటి సమస్యలు కూడా ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తుంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే.. బ్రాంకైటిస్, నిమోనియాకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ సోకిం 3 నుంచి ఆరు రోజుల లోగా ఈ వైరస్ లక్షణాలు బయటపడతాయి. చిన్నారులకు, వృద్ధులకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు ఈ వైరస్ ఎక్కువగా సోకుతుంది.



Click it and Unblock the Notifications