Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఇకపై ఈ విధమైన రీల్స్ చేస్తే జైలుకే.. జాగ్రత్త మీరు కూడా..!
సోషల్ మీడియా వినియోగం చాలా పెరిగిపోయింది. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే చాలా మంది ప్రమాదకరమైన రీల్స్ చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టుకొని ఉంటారు. మరీ ముఖ్యంగా రైళ్లతో రీల్స్ చేయడం, రైళ్ల స్టేషన్ల దగ్గర, రైళ్ల పట్టాలపై నిలబడి రీల్స్ చేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వారిపై ప్రభుతం కఠిన చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? ఏ విధమైన శిక్షలను అమలు చేయనుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైల్వే బోర్డు ఏం చెప్పిందంటే?
దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్ల దగ్గర నిలబడి రీల్స్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇలా చేయడం వల్ల తమ వ్యక్తిగత ప్రాణాలను పణంగా పెట్టడంతో పాటు ఇతర ప్రయాణికులకు అలసౌకర్యంగా మారుతుంది. ఇలాంటి ఘటనలు దేశంలో మరీ ఎక్కువ అవుతుండడంతో కేంద్ర రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రైళ్ల దగ్గర నిలబడి రీల్స్ చేయడం.. పట్టాలపై కూర్చొని రీల్స్ చేయడం, రైల్వే స్టేషన్ల వద్ద రీల్స్ చేస్తే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. అలాగే వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.

కేసులతో పాటు..
రైళ్ల దగ్గర నిలబడి రీల్స్ చేయడం వల్ల తమ వ్యక్తిగత ప్రాణాలను ప్రమాదంలో పెట్టడంతో పాటు రైళ్లలో ప్రయాణిస్తున్న వందలాది మంది ప్రజలను కూడా ప్రమాదంలో నెడుతున్నారు. అందుకే రైల్వే బోర్డు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులను ఆదేశించింది. దీంతో పాటు అలాంటి రీల్స్ చేసే వారికి భారీగా ఫైన్ వేయాలని తెలిపింది. కఠినమైన శిక్షలను అమలు చేయాలని వారు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా శిక్షలతో పాటు శిక్షణ కూడా విధించాలని సూచించింది. అలాగే అలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసే వ్యక్తులను రైల్వేలో నిషేధించాలనే ప్రతిపాదనను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఎలాంటి ప్రమాదాలు వస్తున్నాయి?
సోషల్ మీడియా పిచ్చితో ప్రజలు నిజంగానే పిచ్చిపట్లు ప్రవర్తిస్తున్నారు. రైళ్ల పట్టాలపై వస్తువులు పెట్టడం, నడుస్తున్న రైలులో ఇతర వాహనాలను నడపడం, రైళ్లపై రాళ్లు, బాంబులు వేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు వందలాది మంది ప్రజలను ప్రామాదంలో నెడుతున్నట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పై విధమైన కఠిన నిర్ణయాలు తీసుకుంది.
ఇవి మాత్రం చేయకూడదు..
నిత్యం లక్షలాది మంది ఇండియన్ రైల్వేస్‌లో తమ ప్రయాణాన్ని సాగిస్తుంటారు. తమ వ్యాపార, వ్యక్తిగత పనుల కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తుంటారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అయితే కొందరు చేసే కొన్ని పిచ్చి పిచ్చి పనుల వల్ల వారి ప్రాణం పోవడంతో పాటు.. వారి కుటుంబంలో చీకట్లు కమ్ముకునే అవకాశం ఉంది. మనం ఎన్నో రైలు ప్రమాదాలు చూసే ఉంటాం. అందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయింది కూడా చూశాం. అలాంటి విషాదాలకు మీరు కారణం కాకూడదు. ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదు.



Click it and Unblock the Notifications