Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Mahakumbh 2025: బాబాగా మారిన IIT బాంబేలో చదివిన వ్యక్తి.. కుంభమేళాలో అతని మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే!
మహా కుంభమేళా ప్రారంభమైంది. ప్రతి రోజూ కోట్లాది మంది ప్రజలు త్రివేణి సంగమం వద్ద కుంభమేళా స్నానాలు ఆచరిస్తున్నారు. కేవలం ప్రజలు మాత్రమే కాదు.. నాగ సాధవులు, బాబాలు ఇలా చాలా మంది కుంభమేళాలో పాల్గొంటున్నారు. కొందరు బాబాలో ఈ కుంభమేళా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 144 సంవత్సరాల తరువాత వస్తున్న మహా కుంభమేళా కావడంతో ఈ కుంభమేళా ప్రత్యేకమైనదిగా నిలిచింది. దీంతో చాలా మంది ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఈ కుంభమేళాలో ఓ సాధువు అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ బాబా IIT బాంబేలో డిగ్రీ పొంది బాబా మారారు. అయితే ఆయన బాబాగా మారడానికి కారణం ఏంటి? ఆయనను ఈ మార్గంలో నడిపించింది ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆ బాబా ఎవరు?
మహాకుంభా మేళాలో పాల్గొన్న ఈ IIT బాబా.. బాంబే IITలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. ఆయన అసలు పేరు అభయ్ సింగ్. ఈ బాబా పుట్టి పెరిగింది హర్యానాలో. అతనికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అంట. అలాగే అతను యానిమేషన్ కూడా చేస్తారు. అలాగే డిజైనర్ కూడా. అతనికి ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రతి ఒక్క టెక్నాలజీ గురించి తెలుసు. అతను చెబుతున్న సమాధానాలు అక్కడి ప్రజలతో పాటు అతనికి సంబంధించిన వీడియోలు చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు.
ఆధ్యాత్మికత కోసం
IIT బాంబేలో అద్భుతమైన ఇంజనీరింగ్ కోర్స్ చేసినప్పటికీ తనకు ఆధ్యాత్మికత వెళ్లాలనే కోరిక ఉండేదని, అందుకే తాను ఆధ్యాత్మికత వైపు నడుస్తూ బాబాగా మారానని తెలిపారు. బాబాగా మారిన తరువాత తనకు అసలైన జీవితం అంటే ఏంటో తెలుసుస్తుందని చెప్పారు. అలాగే తాను అసలైన జ్ఞానాన్ని ఇప్పుడే పొందుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మికతలో తనకు చాలా సుఖవంతమైన జీవనం దొరికిందని చెప్పారు.
బాబాలు అజ్ఞానులు కాదు..
చాలా మంది సన్యాసులకు, బాబాలకు ఎలాంటి టెక్నికల్ పరిజ్ఞానం లేదని చెబుతుంటారు. కానీ అది ఒక అపోహ మాత్రమే. ఎంతోమంది సాధువులు, బాబాలు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి కూడా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపి ఆ ఆధ్యాత్మికత వైపు వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ అభయ్ సింగ్ అంటే IIT బాంబే బాబా కూడా వైరల్‌గా మారారు.
కుంభమేళా ఎక్కడెక్కడ జరుగుతుందంటే
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద జరుగుతుంది.
హరిద్వార్: ఇక్కడ కుంభ, అర్థ కుంభ మేళాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఆరు లేదా 12 సంవత్సరాలకు కుంభమేళా నిర్వహిస్తుంటారు
నాసిక్: ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు
ఉజ్జయిని: 2028లో జరగనున్న కుంభమేళా ఉజ్జయినిలో జరగనుంది.



Click it and Unblock the Notifications