Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
20 డిగ్రీలు, 42 యూనివర్సిటీలు.. ఓ ఐఏఎస్ అధికారి అద్భుత ప్రతిభ!
మనలో చాలా డిగ్రీలు చేస్తారు. కొందరైతే ఒక్క డిగ్రీని సంపాధించడానికే కిందా మీదా పడిపోతుంటారు. మరికొందరేమో సులువుగా ఓ రెండు, మూడు డిగ్రీలను సాధించుకుంటారు. మనకు తెలిసిన వాళ్లో, స్నేహితులో.. ఎవరో ఒకరు డబుల్, త్రిబుల్ పీజీ చేసిన వాళ్లను మనం చాలానే చూసుంటాం.
కానీ ఏకంగా 20 డిగ్రీలను చదివిన వాళ్లను మాత్రం ఎక్కడా చూసి ఉండం. కనీసం విని కూడా ఉండం. కానీ మనం ఇప్పుడు చూడబోయే స్టోరీలో మాత్రం.. ఓ వ్యక్తి ఏకంగా 20 డిగ్రీలను అందుకున్నాడు. 42 యూనివర్సిటీల్లో చదువుకొని ఈ ఘనత సాధించాడు. భారతదేశపు అత్యంత అర్హత కల్గిన వ్యక్తిగా అధికారికంగా పేరు పొందాడు శ్రీకాంత్ జిచ్కర్.

మోస్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్:
శ్రీకాంత్ జిచ్కర్ పాతికేళ్ల వయసులోనే అనేక రికార్డులను క్రియేట్ చేశాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా పేరు సంపాధించుకున్నాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం... జిచ్కర్ భారతదేశంలోనే అత్యంత అర్హత కల్గిన వ్యక్తిగా బిరుదు పొందాడు. ఈ డిగ్రీలు అన్నింటిలో ఆయన ఫస్ట్ క్లాస్ లో పాసవ్వడమే కాకుండా.. బంగారు పతకాలను కూడా గెలుచుకున్నాడు.
శ్రీకాంత్ జిచ్కర్ సాధించిన డిగ్రీలు:
1. మెడికల్ డాక్టర్, MBBS, MD
2. లా LL.B.
3. ఇంటర్‌నేషనల్ లా, LL.M.
4. మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, DBM, MBA
5. బ్యాచిలర్స్ ఇన్ జర్నలిజం
6. M.A. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
7. M.A. సోషియాలజీ
8. M.A. ఎకనామిక్స్
9. M.A. సంస్కృతం
10. M.A. హిస్టరీ
11. M.A. ఇంగ్లీష్ లిటరేచర్
12. M.A. ఫిలాసఫీ
13. M.A. పొలిటికన్ సైన్స్
14. M.A. ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి మరియు పరావస్తు శాస్త్రం
15. M.A. సైకాలజీ
16. D.Litt. సంస్కృతం
17. IPS
18. IAS
ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన జిచ్కర్:
1973 నుంచి 1900 సంవత్సరాల మధ్యలో శ్రీకాంత్ జిచ్కర్ 42 పరీక్షలు రాశాడు. అయితే సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగానే.. ఐపీఎస్ కు రిజైన్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మొదటి జాతీయ ఎన్నికలలో పోటీ చేయడానికి నాలుగు నెలల తర్వాత అతను తన పదవిని విడిచిపెట్టాడు. 1980లో శ్రీకాంత్ జిచ్కర్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అత్యంత చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిగా మారాడు.
ఆ తర్వాతి కాలంలో రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా కూడా పదవులు పొందారు. 1999లో రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాని తర్వాత ఆయన దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు.
తనకు ఇష్టమైన పెయింటింగ్ వేయడం, నాటకాల్లో నటించడంతో పాటుగా మతం, ఆరోగ్యం, విద్య వంటి వాటిపై ప్రసంగాలు చేశారు. యునెస్కోలో భారతదేశానికి ప్రాతినిథ్యం కూడా వహించారు.
2004లో శ్రీకాంత్ జిచ్కర్ మృతి:
2004 జూన్ 2వ తేదీన అనుకోకుండా జిచ్కర్ ప్రమాదానికి గురయ్యారు. తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా ఓ బస్సు వారిపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ జిచ్కర్ ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 49 మాత్రమే.
చిన్న వయసులోనే చనిపోయినప్పటికీ ఆయన వైద్యుడిగా, న్యాయవాదిగా, ఐపీఎస్ గా, ఐఏఎస్ గా, రాజకీయ నాయకుడిగా తన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాడు. జిచ్కర్ తన పర్సనల్ లైబ్రరీ కోసం 52 వేల పుస్తకాలను సేకరించాడు. ఇది చూస్తేనే ఆయనకు చదువుపై, నేర్చుకోవడంపై ఎంత ప్రేముందో అర్థం అవుతుంది.



Click it and Unblock the Notifications