Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
అమెరికాలో లక్షలు పెట్టి చదివినా.. తగిన ఉద్యోగాలు లేవు..!!
ఒకప్పుడు అమెరికా పేరు చెబితేనే విదేశీ విద్యార్థులు, ఉద్యోగులకు స్వర్గధామం. విద్యాభ్యాసం పూర్తి కాగానే లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు లభించేవి. కానీ కొవిడ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోగా, ద్రవ్యోల్బణం పెరిగిన వడ్డీరేట్లు అమెరికాను ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి. తద్వారా ఉద్యోగాలు లేక భారతే కాదు. ఎన్నో దేశాలు మంది విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఇది కాదన్నట్లు స్థానికుల నుంచి వ్యతిరేకత, రాజకీయ కారణాలు లాంటి అనేక పరిస్థితులతో అమెరికా చదువులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

అమెరికా చదువులంటేనే వ్యాపారంగా మారింది. ఒకప్పుడు అమెరికాలో విద్యనభ్యసించాలంటే విద్య, నైపుణ్యం ఏంటి? అన్ని విభాగాల్లో సమర్థులైన వారిని అమెరికాకు వెళ్లేవారు. కానీ మారిన పరిస్థితులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డబ్బుల గురించి ఆలోచించకపోవడంతో అమెరికాకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. భారతీయ విద్యార్థులు ఆయా సంవత్సరాల్లో చదువుల కోసం అమెరికాకు వచ్చి ఖర్చు పెట్టిన సొమ్ము పెట్టిన ఖర్చుకు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు వస్తున్నాయి అంటే. కష్టమేనని చెప్పుకోవాలి.
అమెరికాలో ఉద్యోగం సులభం అని ఒకప్పటి నానుడి. కానీ ఇప్పుడు అది నిజం కాదు. నైపుణ్యాలు లేకపోతే ఎవరైనా ఇక్కడ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. ఇందుకు ఉదాహరణే టెక్ కంపెనీ లో భారతీయులకు దక్కని ఉద్యోగాలు టెక్ కంపెనీలే కాదు ఇంటర్న్‌షిప్‌లో కూడా మన వాళ్ళు వెనకబడుతున్నారు. దీనికి ప్రధాన కారణం నైపుణ్యాల లేమిని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో వారు చేసిన గ్రాడ్యుయేషన్కు ఇక్కడికొచ్చాక వారు తీసుకుంటున్న మాస్టర్స్ కోర్సుకు సంబంధం లేకుండా ఉంటుంది. ఉదాహరణకు భారత్ లో సివిల్ ఇంజినీరింగ్ చేసిన విద్యార్థి కూడా కంప్యూటర్ సైన్స్ కు సంబంధించిన పీజీలో చేరుతున్నాడు. తద్వారా ఏమి చేయాలో ఆ విద్యార్థికి తెలియదు. దీంతో పీజీ పూర్తి కాగానే స్టెమ్ ఓపీటీ వీసాలను తీసుకుని ముందుకెళ్తున్నాడు. అందువల్ల ఉద్యోగం సాధించడంలో వెనకబాటుకు గురవుతున్నారు.
ప్రస్తుత భారత విద్యార్థుల పరిస్థితికి అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా కారణంగా కనిపిస్తోంది. కోవిడ్ తర్వాత కంపెనీలు కాస్ట్ కటింగ్ కింద ఉద్యోగులను తొలగించాయి. అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక సమస్యలు, వివిధ రంగాల్లో ఇబ్బంది పెడుతుండటంతో ఇటు ప్రాజెక్ట్ లకు బడ్జెట్‌లో తగ్గిపోయాయి. దీంతో ఆశించిన రీతిలో ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్ట్ లు రావడం లేదు. మరో పక్క కృత్రిమమేధ అమెరికా ఐటీ కంపెనీలను ఆందోళన గురిచేస్తోంది. దీన్ని అందిపుచ్చుకోని పక్షంలో వెనకబడిపోతామన్న ఉద్దేశంతో తమ శక్తియుక్తులన్నింటిని ఏ వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నైపుణ్యం లేని ఉద్యోగులు భారంగా కంపెనీలు భావించి తొలగి స్తున్నాయి. వారి స్థానంలో ఏ నైపుణ్యం కలవారిని తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేగాన్ని మన భారతీయులు అందుకోవడంలో విఫలమవుతున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. రానున్న నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇది కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీలు కాస్తా విద్యార్థులకు ఆశాజనకంగా ఉన్నా అధికారంలోకి వచ్చాక మాత్రం ఏం చేస్తాడన్నది? అంతేగాక ప్రస్తుతం ఉన్న డెమొక్రటిక్ పార్టీ స్థానికులను ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎంపిక చేయాలని ఆయా కంపెనీలపై ఒత్తిడి కూడా పెంచుతోంది. గతేడాది అక్టోబర్ నుంచి పోలిస్తే
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అమెరికన్లకు ఎక్కువగా ఉద్యోగాలు లభించాయి. ఈ పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులకు అవకాశాలు కష్టమేనని నిపుణులు భావిస్తున్నారు. గెలిచిన తర్వాత కొత్త ప్రెసిడెంట్ తీసుకొచ్చే వీసా విధానాలపైనే భారత విద్యార్థులు వీసా అంశం ఆధారపడి ఉంది. ఉద్యోగం లేక వీసా పొడిగింపునకు డబ్బులు లేక 1000 మంది విద్యార్థులు ఏటా భారత్‌కు తిరిగొస్తున్నారు.
లక్షలు పోసి విదేశాల్లో విద్య అభ్యసిస్తున్న ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి. అమెరికా బాట పట్టడం కూడా మంచిది కాదని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో కూడా లక్షల ప్యాకేజీలను వదులుకొని అగ్రరాజ్యంలో అడుగుపెట్టినవారు చాలా మంది ఉన్నారు. వీరందరికీ అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉంది. అయినా ఎందుకు వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి. అమెరికాతో పాటు మరో దేశాన్ని ప్రత్యామ్నాయంగా భావించారని కూడా నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్వదేశంలో ఉన్న ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు.



Click it and Unblock the Notifications