Latest Updates
-
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు? -
Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి -
వేగంగా బరువు తగ్గించే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. డయాబెటిస్‌ని ఈజీగా కంట్రోల్ చేసే కీర సలాడ్.! -
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.!
బంగారం కూడా దీని ముందు పనికిరాదు..ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ ఇదే!
ఉదయం నిద్రలేవగానే వేడివేడిగా ఒక కప్పు చాయ్ పడితే కానీ మనలో చాలామందికి రోజు మొదలవ్వదు. మన దృష్టిలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కావచ్చు. కానీ, ఒక కప్పు టీ సామ్రాజ్యాల చరిత్రను తిరగరాసిందని, ఒక సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని మీకు తెలుసా? ప్రపంచంలో బంగారం కన్నా ఎన్నో రెట్లు ఖరీదైన టీ ఒకటి ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాని పేరే డా హాంగ్ పావో(Da Hong Pao). చైనాలోని ఫుజియాన్ ప్రావిన్ స్‌లో ఉన్న వుయి పర్వతాల రాతి కొండలలో అత్యంత అరుదుగా పండే ఈ టీ, భూమిపైనే అత్యంత ఖరీదైనది.

దీని ధర వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే
ఒక కప్పు అసలైన డా హాంగ్ పావో టీ తాగాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. 2002లో జరిగిన ఒక వేలంలో కేవలం 20 గ్రాముల డా హాంగ్ పావో టీ పొడి సుమారు 25.45 లక్షల రూపాయలకు (180,000 యువాన్లు) అమ్ముడైంది. అంటే ఒక్క గ్రాము టీ పొడి ధర దాదాపు 1.27 లక్షల రూపాయలు అన్నమాట. అరుదైన ఈ టీ ఆకులను సేకరించడానికి కుబేరులు ప్రత్యేకంగా బ్రోకర్లను నియమించుకుంటారు. స్థానికులు దీనిని చూడటానికి బిచ్చగాడిలా ఉన్నా, చక్రవర్తి ధరను, బుద్ధుని హృదయాన్ని కలిగిన టీ అని ఎంతో గొప్పగా వర్ణిస్తారు.
చైనీస్ భాషలో డా హాంగ్ పావో అంటే పెద్ద ఎర్రటి వస్త్రం అని అర్థం. ఈ విచిత్రమైన పేరు వెనుక ఒక పురాణ గాథ ఉంది. ఒకప్పుడు ఒక చైనా చక్రవర్తి ప్రాణాంతక అనారోగ్యానికి గురయ్యాడట. ఈ తేయాకులతో చేసిన పానీయం తాగిన తర్వాత ఆయన అద్భుతంగా కోలుకున్నాడు. ఆనందంతో, కృతజ్ఞతా సూచకంగా ఆయన ఆ పర్వతాలపై ఉన్న తేయాకు పొదల చుట్టూ ఎర్రటి పట్టు వస్త్రాలను కప్పమని ఆదేశించాడట. అప్పటినుండి ఆ పేరే స్థిరపడిపోయింది. వుయి పర్వతాలలోని నిటారైన సున్నపురాయి పగుళ్లలో ఈ మొక్కలు పెరుగుతాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు, రాళ్లలోని ఖనిజాలు ఈ మొక్కలకు చేరి, ఆ టీకి అసాధారణమైన గాఢమైన రుచిని, సువాసనను అందిస్తాయి.

చైనాకు మాత్రమే పరిమితం కాలేదు
1849లో బ్రిటన్ కు టీ పట్ల ఉన్న మోజు విపరీతంగా పెరిగిపోయి, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాబర్ట్ ఫార్చ్యూన్ అనే వృక్షశాస్త్రవేత్తను రహస్యంగా చైనాకు పంపింది. చైనీయుడిలా మారువేషం వేసుకున్న ఫార్చ్యూన్, బౌద్ధ సన్యాసులతో స్నేహం చేసి, అత్యంత రహస్యమైన టీ విత్తనాలను, సాగు పద్ధతులను దొంగిలించి భారతదేశానికి చేర్చాడు. ఈ దొంగిలించబడిన మొక్కల నుండే నేటి ఆధునిక భారతీయ తేయాకు పరిశ్రమ ఉద్భవించింది అని అంటుంటారు.
డా హాంగ్ పావో యొక్క అసలైన మాతృ వృక్షాలు క్రీ.శ. 827 నాటి పురాతన టియాన్‌క్సిన్ యోంగ్లే ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. కాలక్రమంలో ఈ మొక్కల బాధ్యతను చైనా ప్రభుత్వం తీసుకుంది. ఈ అరుదైన మొక్కలకు సాయుధ బలగాలతో అహర్నిశలు కాపలా ఏర్పాటు చేశారంటే వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. నేడు మార్కెట్లో, టీ దుకాణాల్లో వందల డాలర్లకు దొరికే డా హాంగ్ పావో టీ ఏదీ అసలైనది కాదని.. అవన్నీ అసలు మొక్కల నుండి క్లోనింగ్ చేయబడిన రెండవ లేదా మూడవ తరం మొక్కల ఆకులు మాత్రమేనని చెబుతారు.
వుయిషాన్ కొండచరియల్లో ఉన్న అసలైన మాతృ మొక్కలకు ఇప్పుడు దాదాపు 350 ఏళ్లు. వయసు పైబడటంతో వాటి కొమ్మలు ఎండిపోయి పెళుసుగా మారాయి. వాటిని రక్షించుకునేందుకు 2005లో చైనా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ మొక్కల నుండి ఆకులను కోయడాన్ని శాశ్వతంగా నిషేధించింది. ప్రతి సంవత్సరం మే 1న ఆ పురాతన పొదల ముందు ఎర్ర తివాచీలు పరిచి, సాంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాలు చేస్తారు కానీ ఒక్క ఆకును కూడా తాకరు. దీనర్థం ప్రస్తుతం ప్రపంచంలోని కొందరు సంపన్నుల సేకరణలో భద్రంగా ఉన్న కొన్ని గ్రాముల ఆకులే అసలైన డా హాంగ్ పావో.



Click it and Unblock the Notifications
