Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కరోనా రిటర్స్..గతం కన్నా భయంకరంగా ఉంటదా?..బాబా వంగా అంచనా ఇదే
మళ్లీ కరోనా పంజా విప్పింది. చాపకింద నీరులా దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1010కి పైగానే ఉండగా..మరణాలు కూడా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మళ్లీ జనం మాస్కులు పెట్టుకోవడం,సామాజిక దూరం పాటించడం తిరిగి మొదలుపెట్టారు. అయితే ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని..జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ కొందరిలో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.
ఇదిలా ఉంటే కరోనా గురించి బాగా వంగా అంచనాలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగ అనే అంధ మహిళ..భవిష్యత్తులో జరగబోయే వాటిని అంచనాలు వేశారు. ప్రిన్సెస్ డయానా మరణం, కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక విషయాల గురించి ఆమె చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. అందుకే బాబా వంగా అంచాలను చాలామంది విశ్వసిస్తుంటారు.

జపాన్ దేశానికి చెందిన నావలిస్ట్ రియో టట్సుకి అనే మహిళను జపాన్ బాబా వంగాగా పిలుస్తుంటారు. ఈ జపాన్ బాబా వంగా వేసిన అంచనాలు కూడా కొన్ని నిజమయ్యాయి. కరోనా వైరస్ గురించి జపాన్ బాబా వంగ చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 1999లో జాపాన్ బాబా వంగా "ది ఫ్యూచర్ యాస్ ఐ సీ ఇట్(The Future as I See It)"అనే టైటిల్ తో ఓ బుక్ రాసింది. ఇందులో ఆమె భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి అంచనా వేశారు.
జపాన్ బాబా వంగా ఆ బుక్ లో చెప్పిన ప్రకారం.. 2020లో గుర్తుతెలియని వైరస్ ఒకటి వస్తుంది..ఏప్రిల్ తర్వాత కనుమరుగవుతుంది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత 2030లో ఈ వైరస్ తీవ్ర రూపంతో వస్తుందంటూ కరోనా మహమ్మారి గురించి చెప్పారు. కరోనా విధ్వంసకరమైన రీతిలోనే మళ్లీ వస్తుందని, చాలా మంది చనిపోతారని జపాన్ బాబా వంగా అంచనా చెప్పింది.
జపాన్ బాబా వంగాలు అంచనాలు ఇప్పుడు అందరిలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. మళ్లీ లాక్ డౌన్ వస్తుందా అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications