Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
స్పైడర్ మ్యాన్ అయిన బస్ కండక్టర్.. రైలును చేతులతో తోలిన ప్యాసెంజర్లు.. వైరల్ వీడియోలు..!
బస్ ప్రమాదాలు చాలా భయానకంగా వుంటాయ్. ప్రభుత్వ ఆర్టీసీ సురక్షితమని ప్రభుత్వం చెబుతున్నా ఎప్పుడు ఏ సమస్య పొంచి వుంటుందో మనం చెప్పలేము. ఇలాంటి ఒక ఘటనే కేరళలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేరళలోని ఓ బస్సులో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో ఓ ప్రయాణికుడు బస్సు డోరు దగ్గర నిల్చొని వున్నారు. ఆసమయంలో పక్కనే వున్న కండక్టర్ అందరికీ టికెట్లు అందిస్తున్నాడు. బస్సు వెళ్తుండగానే డోర్‌వద్దనున్న వ్యక్తి ఒక్కసారిగా కిందపడిపోయ్ డోర్ బయట పడిపోతుండగా అప్పుడే అప్రమత్తమైన కండక్టర్ ఆ వ్యక్తి చేయిని పట్టుకొని పైకి లాగాడు. దీంతో ఆ ప్రయాణికుడి ప్రాణాలను కండక్టర్ కాపాడినట్లైంది.
కండక్టర్ చాకచక్యాన్ని చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. కండక్టర్‌ను ఆకాశానికెత్తుతున్నారు. కండక్టర్‌కు 25వ సెన్స్ పనిచేసిందని అందుకే కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించాడని మరో యూజర్ ట్వీట్ చేశాడు. అయితే ప్రయాణికుడు కిందపడిపోతుండగా కండక్టర్ తనపనిలో తాను వుంటూనే కనీసం ప్రాయణికుడు చూడకుండా వెంటనే చేతులు చాచి అతన్ని కిందపడిపోకుండా పట్టుకోవడం పై అందరూ షాక్‌కు గురయ్యారు.
కేరళ కండక్టర్ చాకచక్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. వీడియో అప్‌లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే 16 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కొందరు కండక్టర్‌ను సూపర్ మ్యాన్‌తో, స్పైడర్‌మ్యాన్‌తో పోలుస్తున్నారు.
చేతులోతో రైలును తోలిన ప్యాసెంజర్లు
ఎవ్వరైనా కారును చేతులతో తోలుతారు, ఆటోను తోలుతారు కానీ రైలును తోలడం మీరెప్పుడైనా చూశారా. బిహార్‌లోని లాఖిసరై వద్దనున్న కీయుల్ జంక్షన్‌లో ఈ దృష్యం చోటుచేసుకుంది. అయితే ఇదంతా ఎందుకు జరిగిందంటే పట్నా నుంచి బిహార్‌కు ట్రైన్ వెళ్తోంది. అయితే మార్గ మధ్యలోనే ఈ ట్రైన్‌కరు మంటలను అంటుకున్నాయ్. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై ఆ భోగీల నంచి కిందకు దిగిపోయారు. దిగి, ఆ ట్రైన్‌కు అటాచ్ అయివున్న మిగతా భోగీలను పక్కకు నెట్టుకుంటూ వచ్చారు.
దాదాపు చిన్నా పెద్దా అందరూ ఈ రైలు భోగీలకు మంటలు అంటుకోకుండా వుండడానికి చేతులతో నెట్టుకుంటూ కొద్ది దూరం వరకు వెళ్లారు. కియుల్ స్టేషన్‌లో జరిగిన ఈ దృష్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
అయితే రెండు భోగీల మధ్యలో వుండే కప్లింగ్ విడిపోయిందని దీని వల్ల మంటలు వున్న భోగీలతో ఈ భోగీలు విడిపోయాయని ప్రయాణికులు చెప్పారు. ఈ దుర్ఘటనలో ఎవ్వరి ప్రాణాలకు ఎలాంటి హానీ జరగలేదు. కానీ రైలును కారును నెట్టుకొచ్చినట్లు నెట్టుకురావడం నెటిజెన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.



Click it and Unblock the Notifications