For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు 100% సరిగ్గా లేరని అనిపించనప్పుడు గుర్తుంచుకోవలసిన 16 విషయాలు

|

కొన్నిసార్లు కొన్ని చిన్న విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒకరోజు మీరు బాగా సంతోషంగా ఉన్నారు అనుకుందాం. కానీ మరుసటి రోజు మీరు పూర్తిగా నిరాశలో కూరుకుపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. కొందరైతే ఎక్కువగా నవ్వినరోజు ఏదో ఒక సమస్య తలెత్తుతుంది అన్న భావనకుకూడా లోనవుతుంటారు.

అటువంటి సందర్భాలలో, కొన్ని అనాలోచిత నిర్ణయాలను కూడా తీసుకునే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు ఉన్న జాబ్ వదులుకోవడం, వేరే దేశాలకు కొంతకాలం వెళ్ళిపోవాలని భావించడం వంటివి. ఒక్కోసారి మీ నిర్ణయాలు సరైనవిగా ఉంటే, ఎక్కువసార్లు అవి మీ జీవితాన్నే పూర్తిగా సందిగ్దంలోకి తీసుకుని వెళ్ళేవిగా ఉంటాయి.

సమస్య ఏమిటంటే, ప్రతి మనిషీ ఒక కంఫర్ట్ జోన్ సృష్టించుకుని, అదే అసలైన జీవితమని భావిస్తూ ఉంటాడు. క్రమంగా, ఏదైనా చిన్న సమస్య ఎదురైనా, వాటితో పోటీపడలేక కఠినమైన నిర్ణయాలని తీసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు, ప్రేమించే వ్యక్తులు, సంతోషకరమైన జీవితం ఉండాలని ఆలోచిస్తున్న సమయంలో, నెల చివరన కట్టవలసిన బిల్లులు, వచ్చే జీతాలు కళ్ళముందు మెదులుతూ ఉంటాయి.

ఒక సంతోషకరమైన విషయమేమిటంటే సమస్యలు ఎదురైనప్పుడు, వాటిని నిర్వహించడానికి మనిషి మానసికంగా సన్నద్ధమై ఉండే క్రమంలో భాగంగా, కొన్ని విషయాలను మనసులో ఉంచడం ద్వారా, చిన్న చిన్న సమస్యలకు డిప్రెషన్ ఆందోళన అన్న మాటలకు తావులేకుండా తెలివిగా వ్యవహరించగలుగుతాడు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

1. మీ చుట్టుపక్కల వాతావరణంలో కొద్దిపాటి మార్పులు అవసరం

1. మీ చుట్టుపక్కల వాతావరణంలో కొద్దిపాటి మార్పులు అవసరం

చెడు ప్రవర్తనలు, చెడు దారిన ప్రలోభపెట్టే అంశాలు తరచుగా పర్యావరణంతో అనుబంధంగా ముడిపడి ఉంటాయి. “నేను డిప్రెషన్ గురైనప్పుడు, నా బెడ్ రూమ్ కూడా దెయ్యాలు సంచరించే గుహలా కనిపిస్తుంది. నన్ను నేను దాని నుండి తప్పించలేకపోతున్నాను. క్రమంగా జీవితం మీద ఒక ఆశ కూడా ఉండడం లేదు. ఇది మీకు చిన్న విషయంలా కనిపిస్తుంది, కాని అనుభవించే నాకు మాత్రమే ఆ బాధ అర్ధమవుతుంది“. ఇలా డిప్రెషన్ గురైన వాళ్ళ మనసు పరిపరివిధాలుగా ఆలోచిస్తుంటుంది. కానీ, అటువంటి సమయంలో ఏదైనా పార్కుకు వెళ్లడం, లేదా వాకింగ్ వెళ్ళడం, మీకిష్టమైన వారితో సమయం కేటాయించడం, ఇష్టమైన కార్యకలాపాలమీద దృష్టి సారించడం వంటివి చేయడం ద్వారా మీ మనసును సావధానపరచుకోవచ్చు.

2. మీకు సంతోషాన్నిచ్చే విషయాలను అనుసరించడం పట్ల సిగ్గుపడకండి

2. మీకు సంతోషాన్నిచ్చే విషయాలను అనుసరించడం పట్ల సిగ్గుపడకండి

మీరు ఇష్టపడే విషయాలతోనే మిమ్మల్ని మీరు చూసుకోండి, వాటిలోనే మీ సంతోషాన్ని వెతుక్కోండి. అలాగని వ్యసనాల జోలికి వెళ్ళకండి. వ్యసనాలు, సమస్యకు పరిష్కారం కాకపోగా మీలోని ఆందోళనా స్థాయిలు పెరిగేందుకు కారణంగా మారుతాయి. మీరు కాస్త ఆందోళన, లేదా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక కప్పు టీ కూడా మీకు కాస్త ఊరటనివ్వవచ్చు: సిమ్స్ ఆడటం, పుస్తకాలు చదవడం లేడా పుస్తకాల రాక్ సర్దడం, ఆర్ట్ గ్యాలరీల లేదా సినిమాకి వెళ్లడం వంటి వాటిని పాటించడం, ఇష్టపడే నలుగురితో సమయం కేటాయించడం వంటివి పాటించడం ముఖ్యం మరియు మీకు అనుకూలజీవనం జరగనప్పుడు ఇటువంటివి మీకు స్వాంతన చేకూరుస్తాయి.

3. అపజయాలకు కూడా మిమ్మల్ని మీరు సిద్దం చేసుకోండి

3. అపజయాలకు కూడా మిమ్మల్ని మీరు సిద్దం చేసుకోండి

సాధారణంగా ప్రజలు ఏదన్నా పని తలపెట్టినప్పుడు, అందులో విజయాలను మాత్రమే కోరుకుంటూ ఉంటారు. కానీ, విజయాలు అహాన్ని పెంచితే, అపజయాలు పాఠాలను నేర్పిస్తాయి. కావున, ఏదన్నా కార్యం తలపెట్టినప్పుడు, అపజయాలకు కూడా మిమ్ములను మీరు సిద్దపరచుకోవాలి. క్రమంగా మీరు చేసిన లోపాలను విశదీకరించే అవకాశం లభిస్తుంది. ఇది మనసుకి ఆందోళనా, డిప్రెషన్ల నుండి విముక్తి కలిగించే విషయాలలో ఒకటి. మనం తరచుగా కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకుంటూ ఉంటాము, కానీ జయాపజయాలు జీవితంలో సాధారణమే అన్నఆలోచనతో ముందుకు నడవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, క్రొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు, అక్కడ పరిస్థితులు మీ ఇంటి వాతావరణానికి అనుకూలంగా ఉండే అవకాశమే లేదు. క్రమంగా కొంత అసంతృప్తి, మానసిక అననుకూలతలు, అసౌకర్యం సహజం. కానీ, ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవని మాత్రం గుర్తుంచుకోండి.

4. పరిగెత్తి పాలు తాగడం కన్నా, నిలబడి నీళ్ళు తాగడం మేలు

4. పరిగెత్తి పాలు తాగడం కన్నా, నిలబడి నీళ్ళు తాగడం మేలు

జీవితం వేగవంతమైనది, మరియు మీరు ఆందోళన, ఒత్తిడికి లోనైనప్పుడు, దాని గురించి ఆలోచించడానికి కూడా ఎక్కువ సమయం ఉండదు. సమావేశాలు, డేట్, జిమ్ సెషన్, స్నేహితుల పుట్టినరోజు ఇలా ఒకదానితర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి.

మీరు పూర్తిగా క్రాష్ అయ్యే క్షణం వరకు వేచి ఉండకుండా, ఆ జీవన గమనవేగాన్ని తగ్గించండి. లేకపోతే, మీ చింతలు ఒక పెద్ద విపత్తుకు దారితీస్తాయి. మీకు నచ్చని అంశాలపరంగా సున్నితంగా తిరస్కరించడం కూడా నేర్చుకోండి.

5. ఏ విషయాన్ని కూడా చిన్నవిషయమే అనుకోకండి, చిన్న విషయమైనా ఫలితాలను సాధించండి

5. ఏ విషయాన్ని కూడా చిన్నవిషయమే అనుకోకండి, చిన్న విషయమైనా ఫలితాలను సాధించండి

మీరు విఫలమైనట్లు భావిస్తున్నప్పుడు, మీరు చేసే పని చిన్నదిఅయినా పెద్దదిగానే కనిపిస్తుంది. అదే మానసిక దృడసంకల్పంతో మిమ్ములను మీరు సిద్దం చేసుకున్నప్పుడు, పెద్దపనైనా చిన్నదిగానే కనిపిస్తుంది. ఒక్కోసారి పెద్ద అంశాల మీద దృష్టిసారించడం కన్నా, దాని పర్యావసాన అంశాలుగా ఉన్న చిన్నవాటి మీద దృష్టిసారించండి. సరైన పునాది లేకుండా ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఏం లాభం చెప్పండి. అంతేకాకుండా ఎప్పుడూ పెద్ద విషయాల గురించి ఆలోచనలు చేసేకన్నా, సంతృప్తికరమైన ఫలితాలను ఇచ్చే చిన్న విషయాల గురించి ఆలోచించడం కూడా ముఖ్యమే: ఉదాహరణకు మొక్కలకు నీరుపట్టడం, కొత్త బెడ్‌షీట్లను కొనడం, మీకు అనువుగా ఇల్లు సర్దడం, ఇంటీరియర్ కార్యాచరణలు, శ్రేయోభిలాషులకు మెసేజ్ లేదా ఈమైల్స్ పెట్టడం మొదలైనవి.

6. నిశ్శబ్దంగా ఉండకండి

6. నిశ్శబ్దంగా ఉండకండి

మీరు కఠినమైన జీవితాన్ని గడుపుతున్న అనుభూతికి లోనైతే, ఈ విషయం గురించి మీ శ్రేయోభిలాషికి తెలియజేయడం ముఖ్యం. మీరు ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం లేదు. మనిషికి చెప్పుకోడానికి మనిషి దొరకనప్పుడే ఈ డిప్రెషన్ ఆందోళనా స్థాయిలు పెరుగుతాయి అని సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా, డిప్రెషన్ సమయంలో మనల్ని ఇష్టపడే వ్యక్తులను కూడా మనం విస్మరిస్తుంటాం. అది ఎన్నటికీ సరికాదు, వారు చెప్పేది కూడా మనమంచికే అని గ్రహించండి.

సరళమైన సంభాషణలు జీవితాన్ని మార్చగలవు, బంధువులు, హౌస్‌మేట్, స్నేహితుడు లేదా సహోద్యోగి ఇలా ఎవరైనాసరే, మీరు విశ్వసించే వారితో మీ సమస్య గురించి వివరించండి. ఇంకా మీరు వాటి నుండి బయటపడకపోతే, హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా ప్రొఫెషనల్ నుండి సలహా తీసుకోండి.

7. మీరు డిప్రెషన్లో ఉన్నారని బాధపడకండి, ఏ క్షణంలోనైనా మీ మనసుని మార్చవచ్చునని గుర్తుంచుకోండి

7. మీరు డిప్రెషన్లో ఉన్నారని బాధపడకండి, ఏ క్షణంలోనైనా మీ మనసుని మార్చవచ్చునని గుర్తుంచుకోండి

వారంలోని మొదటి రోజు, లేదా నూతన సంవత్సరం లేదా మీ క్రొత్త ఇంట్లో కొన్ని నెలల్లోనే ప్రారంభమయ్యే పెద్ద క్షణాల కోసం మనం వేచిఉండాల్సిన అవసరం ఉంటుందని మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది. విషయం ఏమిటంటే, మీరు అలా సమయం సందర్భం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు, మీలో మారాలని కసి ఉంటే, ఈ క్షణమే మారవచ్చు. మీరు మీ స్వంత షెడ్యూల్‌లో పనిచేస్తారు కానీ, మీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు కదా. మీరు ఈ క్షణంలో మార్పుని కోరుకుంటే, ఈ క్షణమే ప్రయత్నించండి. మీనమేషాలు లెక్కిస్తూపొతే, చివరికి లెక్కలే మిగులుతాయి. ఏదన్నా వ్యసనానికి బానిసగా మారారా? ఈ క్షణమే మానేయ్యండి. డిప్రెషన్లో ఉన్నారా? ఈ క్షణమే మార్గాలను అన్వేషించండి. మిమ్ములను మీరు సిద్దం చేసుకోండి.

8. కానీ మీరు ఇలా మాత్రం చేయకూడదు

8. కానీ మీరు ఇలా మాత్రం చేయకూడదు

వాస్తవానికి, మీరు మారాల్సిన అవసరం లేదు. మీరు క్రొత్త బ్రాండ్ కి మారడం ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరచుకొనలసిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు వ్యక్తిగా అంగీకరించండి. మీరు కొన్నిసార్లు విచారంగా ఉన్నా, ఆ సందర్భాన్ని కూడా అంగీకరించండి. మీ శరీరం, మీ మనస్సు మరియు మీరు శ్రద్ధ వహించే ప్రతి విషయాన్ని జీవితంలో సాధారణమేనని అంగీకరించండి. మీరు ఆ పరిస్థితి నుండి బయటపడడానికి, మీరు హైపర్-ఆర్గనైజ్డ్ ఓవర్‌ అచీవర్ అవ్వాల్సిన పని లేదు. డేటింగ్ లో మరింత హుందాగా ఉండేందుకు, బాడీకాన్ దుస్తులకు కూడా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఏదిఏమైనా మిమ్ములను మీరు కోల్పోకండి.

9. మీరు అనుకున్నంత ఒంటరిగా లేరు

9. మీరు అనుకున్నంత ఒంటరిగా లేరు

ప్రతిఒక్కరూ కలిసి ఉన్నారని భావించడం చాలా సులభం, కానీ కొన్ని కారణాల వల్ల మీరు కొన్ని విషయాలలో చిక్కుకుని, ఇతర కార్యాచరణలమీద దృష్టి సారించడానికి మీకు మార్గమంటూ ఉండదు. బదులుగా, మీకు సంబంధించిన విషయాలను బ్లాగులు లేదా సోషల్ అక్కౌంట్స్ ద్వారా, స్వేచ్చగా నలుగురితో పంచుకోడానికి ప్రయత్నించండి. అందరూ కష్టపడుతున్నారు; కానీ వారి కష్టాలను బహిర్గతం చేసుకోరు. అలాగని మిమ్మల్ని ఇతరులతో పోల్చాల్సిన అవసరం లేదు. మీకు తోచినట్లు మీ ఆలోచనల ప్రకారం స్వేచ్చగా ముందుకు నడవండి.

10. మీరు లేనిదానిపై దృష్టి పెట్టండి

10. మీరు లేనిదానిపై దృష్టి పెట్టండి

మీరు మీపరంగా స్వంత లోపాలను కలిగి ఉన్నప్పుడు, మీ వెలుపల ఉన్న వాటిపై దృష్టి పెట్టడానికి ఇది సహాయపడవచ్చు. స్నేహితుడి కోసం చక్కని విందుని సిద్దం చేయడం, సూప్ కిచెన్ వద్ద వాలంటీర్ గాను, లేదా ఏదన్నా పాఠశాలలో ఒక విద్యార్థికి ట్యూటర్ గాను పని చేయండి. వేరొకరికి సహాయపడటానికి మీరు చురుకుగా ఉండడమే కాకుండా, మీ ఒంటరితనం కూడా తగ్గుతుంది. మరియు మీ జ్ఞానాన్ని నలుగురికి పంచిన అనుభూతి కలుగుతుంది.

11. మీరు లేని వ్యక్తిగా నటించడమనేది, చెడ్డ విషయమేమీ కాదు

11. మీరు లేని వ్యక్తిగా నటించడమనేది, చెడ్డ విషయమేమీ కాదు

మనం ఎల్లప్పుడూ మనకు మనమే సాటి అని అనుకుంటూ ఉంటాము. కాని మనం చేయలేని విషయాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, వర్క్ ప్రెజెంటేషన్ సమయంలో కాన్ఫిడెన్స్ ప్రదర్శించడం. సాధారణ సమయాల్లో బెరుకుగా ఉండే వారు, అనూహ్యంగా ప్రెజెంటేషన్ పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాస్తవానికి ప్రెజెంటేషన్ ఇచ్చేది వారేనా అని ప్రజలు భావించేలా. మీరు మీ ఊహలలో నిర్మించుకున్న వ్యక్తిత్వాన్ని, ప్రదర్శించడానికి ప్రయత్నించండి. ఈ లక్షణం, మిమ్ములను నలుగురికీ కొత్తగా పరిచయం చేయడమే కాకుండా, మిమ్ములను మీరు సరికొత్తగా మార్చుకునేందుకు అద్భుతంగా సహాయపడుతుంది.

12. సృజనాత్మకంగా ఉండండి

12. సృజనాత్మకంగా ఉండండి

సృజనాత్మకత అనేది, ఆందోళనలను తగ్గించే క్రమంలో భాగంగా సమయాన్ని వెచ్చించే మంచి మార్గంలా ఉంటుంది. మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, కాగితం మరియు పెన్నులను కొనుగోలు చేసి, మీలోని కళాకారునికి సృజనాత్మకతను వెలికితీసే అవకాశమివ్వండి.. మీరు చేసే ఏ పనీ అందంగా ఉండవలసిన అవసరం లేదు మరియు మీరు ఎవరితోనూ పోలిక వేయవలసిన అవసరం లేదు. అలాగని ఒకరికి మీ కళ గురించి చెప్పాల్సిన, మరియు వారికి చూపించాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు ప్రయత్నించడం ముఖ్యం. మీరు కేవలం డ్రాయింగ్ మాత్రమే చేయాలని కాదు. మీరు కుండలు చేయడం, అల్లికలు నేర్చుకోవడం, ఓరిగామి, లేదా బ్లాగ్స్, కవితలు రాయడం వంటివి కూడా ప్రయత్నించవచ్చు. ఏది అనుసరించినా అది, మీ మనసుకు స్వాంతన చేకూర్చేదిగా ఉండాలని గుర్తుంచుకోండి.

13. మానవులందరూ భిన్నమైనవారే, వారిలో మీరూ ఒకరని గుర్తుంచుకోండి

13. మానవులందరూ భిన్నమైనవారే, వారిలో మీరూ ఒకరని గుర్తుంచుకోండి

పరిపూర్ణత కోసం మీరు చేసే అధిక ప్రయత్నం మీ ఉత్పాదకతను సైతం నిలిపివేస్తుంది. దృక్పథాన్ని కోల్పోకండి. లోపాలు లేని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఉండరని గుర్తుంచుకోండి. మీరు కొద్దిగా మానసిక గందరగోళానికి గురయినా, అది శాశ్వతం కాదని నిర్ధారించుకోండి. మీరు రోబోట్ లేదా బార్బీ కాదు, స్విచ్ వేస్తే పనిచేయడానికి. మీరు అందరిలానే సాధారణమైన మనిషి. మీ జీవితం కొన్ని సమయాల్లో గందరగోళంగా ఉంటుంది. మీ సమస్యలకు, ప్రశ్నలకు మీకు మీరే సమాధానం చూపాల్సి ఉంటుంది. వేరెవరో కాదు.

14. మీరు హ్యాంగోవర్లో ఉన్నప్పుడు ప్రతిదీ నిరవధికంగా కనిపిస్తుంది

14. మీరు హ్యాంగోవర్లో ఉన్నప్పుడు ప్రతిదీ నిరవధికంగా కనిపిస్తుంది

డిప్రెషన్ లోనైనప్పుడు అనేకమంది అనాలోచితంగా, మద్యం వైపు మొగ్గు చూపుతుంటారు. ఈ అలవాటు తాత్కాలికంగా విశ్రాంతిని అందించినా దీర్ఘకాలిక మానసిక సమస్యలను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా, ఆందోళనా స్థాయిలు పెరిగి ప్రతీకార ధోరణి ఉత్పన్నమవుతుంది. ఇది తీవ్రమైన పరిస్థితులకు, భయాందోళనలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. మనం ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు, ఆల్కహాల్ను పరిగణించడం అత్యంత ప్రమాదకరమైన చర్యగా ఉంటుంది. ఆల్కహాల్ ఎప్పటికీ మీ స్నేహితుడు కాలేదని గుర్తుంచుకోండి. మీ వెన్నంటే ఉండి, మిమ్ములను సమూలంగా నాశనం చేసే శత్రువు ఆల్కహాల్.

15. మీరు ప్రతి ప్రశ్నకీ సమాధానాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదు

15. మీరు ప్రతి ప్రశ్నకీ సమాధానాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదు

ప్రస్తుతం మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియకపోయినా, మీరు పెద్ద సమస్యలను ఎలా పరిష్కరించబోతున్నారో తెలియకపోయినా సరే, ఏదోక సమయంలో ఏదోక రోజు, మీ మనసే మీకు ఒక పరిష్కారాన్ని తప్పక చూపెడుతుంది. మీకు ఎటువంటి పరిష్కారాలు వెంటనే దక్కాల్సిన అవసరం లేదు. సమయమే అన్నిటికీ దిశానిర్దేశం చేస్తుందని మరువకండి.

16. గుర్తుంచుకో: మీ మనస్సులో చాలామంది ఉన్నారు

16. గుర్తుంచుకో: మీ మనస్సులో చాలామంది ఉన్నారు

మీ మనస్సు కేవలం ఒక చిన్న పాకెట్ కాదు. మీ మనస్సు అనంతమైనది. మీరు భావోద్వేగాల సుడిగుండంలో ఇరుక్కున్నప్పుడు, ఉచ్చు తలుపుల మద్య బిగుసుకున్న అనుభూతికి లోనవడం జరుగుతుంది. క్రమంగా కష్టాల సుడిగుండాలలో చిక్కుకున్నట్లు మరియు నిస్సహాయంగా ఉన్నట్లుగా అనిపించడం పరిపాటి. కానీ అభివృద్ధిపరమైన అవకాశాలు అనేకం ఉన్నాయి. మీకు కావలసిందల్లా ఓపిక, సమయం అంతే.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

16 things to remember when you're not feeling 100% okay

Sometimes things just aren’t going so great. One day you were feeling fine and the next day you feel depressed. Things have begun to unravel, you’re sad, and you're scared you’re on the verge of some thing awful. The only way you feel like you can break out of your doomsday cycle is to make a drastic life decision like quit your job or move to the Bahamas.
Story first published: Friday, January 3, 2020, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more