For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్ర గురించి నమ్మలేని ఆసక్తికర నిజాలు

By Swathi
|

అందరికీ నిద్ర విషయంలో ఒకేలా ఉండదు. కొందరు గాఢంగా నిద్రపోతారు. మరికొందరు అరకొర నిద్రతో ఇబ్బందిపడుతుంటారు. కొందరికి ఏం చేసినా.. నిద్రపోయేటప్పుడు మెలకువ రాదు. కానీ.. కొందరిలో చీమ చిటుక్కుమన్నా.. లేచి కూర్చుంటారు. మరికొందరికి భయం వల్ల నిద్రలో తరచుగా ఆటంకం ఎదుర్కొంటూ ఉంటారు. చాలామంది నిద్ర పోవడానికి చాలా ఇష్టపడతారు. రాత్రంతా నిద్రపోయినా.. పగలు కూడా పడుకునే అలవాటు ఉంటుంది. అయితే నిద్రకి మనం మన జీవితంకాలంలో ఎంత సమయం కేటాయిస్తున్నాం ? నిద్రచెబుతున్న ఆసక్తికర విషయాలేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం..

బాగా నిద్రపోవాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే

Interesting Facts about Sleep

*మనుషులు జీవితకాలంలో మూడో వంతు భాగం నిద్రపోవడానికి కటాయిస్తాయి. అంటే.. 25 సంవత్సరాలు నిద్రలోనే గడుపుతారని అర్థం.

*అప్పుడే పుట్టిన పిల్లల వల్ల తల్లిదండ్రులు 6 నెలల సమయం నిద్ర కోల్పోతారట. పిల్లలకు 2 ఏళ్లు వచ్చే వరకు వాళ్లు మిస్సయ్యే నిద్ర సమయం 6 నెలలు.

*ఎక్కువ సమయం నిద్రపోకుండా రికార్డ్ క్రియేట్ చేసిన సమయం 11 రోజులు. షాకింగ్ గా ఉందా ? నిజమే.. 11రోజుల పాటు నిద్రపోకుండా ఉండటం రికార్డే కదా.

Interesting Facts about Sleep

*ఒక్కో రాత్రి 7గంటల కంటే తక్కువ సమయం నిద్రపోవడం వల్ల మీ జీవిత కాలంపై ప్రభావం చూపుతుంది. అంటే ఆయుష్షు రానురాను తగ్గుతుంది.

*సరిపడా నిద్రపోకపోతే.. 0.9 కేజీ బరువు పెరగడానికి కారణమవుతుంది.

నిద్రలేమితో బాధపడుతన్నారని తెలిపే ఆశ్చర్యకరమైన లక్షణాలు

Interesting Facts about Sleep

*నిద్రపోయేటప్పుడు తుమ్మడం చాలా కష్టం.
*నత్త ఎంతకాలం నిద్రపోతుందో తెలుసా ? నత్తకు మూడు ఏళ్లు నిద్రపోగలదు.
*అనేకమంది ఆహారం లేకుండా 2 నెలలు బతకగలరు. కానీ.. నిద్రపోకుండా.. కేవలం 11 రోజులు మాత్రమే బతకగలరు.
*మనుషులు అమావాస్య సమయంలో మంచి నిద్ర పొందుతారు. అదే పౌర్ణమి సమయంలో.. సరైన నిద్ర పొందలేరని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
*పిల్లులు ( క్యాట్స్ ) వాటి జీవితకాలంలో 70 శాతం నిద్రకే కేటాయిస్తాయి.
*గుర్రాలు నిలబడే నిద్రపోగలవు.
*టీవీ చూస్తున్నప్పటి కంటే.. నిద్రపోయే సమయంలో ఎక్కువ క్యాలరీలు కరిగించగలరని అధ్యయనాలు చెబుతున్నాయి.

English summary

Interesting Facts about Sleep

Interesting Facts about Sleep. National Sleep Foundation has created a list of facts about sleep. But we're not restricting this information to our 25 closest friends. Share it with everyone you know!
Story first published: Thursday, January 14, 2016, 11:53 [IST]
Desktop Bottom Promotion