ఆ తెగకు చెందిన మహిళలు పెళ్లికి ముందే శృంగారంలో స్వేచ్ఛగా పాల్గొనవచ్చు!

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

భయం అనేది లేకుండా ఒక స్త్రీ స్వేచ్ఛగా బయటకు వెల్ల వచ్చు అనే విషయాన్ని చివరిగా మీరు ఎప్పుడు విన్నారు? చరిత్ర లో ఎలా జరిగింది అని మనం ఎప్పుడైనా ఎక్కడైనా విని ఉండొచ్చు కానీ ఇప్పుడున్న ప్రస్తుత భయంకర సమాజం లో, ఈ భయానక ప్రపంచం లో దేనికి పెద్ద గా రక్షణ లేదు.

కానీ, ఒక తెగకు చెందిన మహిళలకు ఎంతో స్వతంత్రం ఉంది. వాళ్ళు ఏమి చేయాలనుకుంటే అది చేయగలిగే స్వేచ్ఛ వాళ్లకు ఉందని మీకు తెలుసా? వారు స్వేచ్ఛగా శృంగారంలో పాల్గొనవచ్చు, వద్దనుకుంటే వాళ్ళ భర్తలకు విడాకులు కూడా ఇవ్వొచ్చు. అతడి యొక్క ఆస్తులను స్త్రీ లే అంటిపెట్టుకొని ఉండొచ్చు. ఇవన్నీ వినడానికి నమ్మశక్యంగా లేవు కదా ?

మహిళలు శృంగారం లో వారానికి ఒక్కసారైనా పాల్గొనాలి. ఎందుకో తెలుసా...?

అసలు నిజం ఏమిటంటే, ఇలాంటి తెగ ఒకటి ఈ ప్రపంచంలో ఉంది. పైన చెప్పబడిన ఆచారాలను కొన్ని సంవత్సరాలుగా పాటిస్తుంది. ఆ తెగ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ తెగను ఏమంటారంటే :

ఈ తెగను ఏమంటారంటే :

పైన చెప్పబడిన మహిళలు ' తుఅరేజ్ ' తెగకు చెందిన వారు. ఈ పాక్షిక సంచార ప్రజలు 20 లక్షలకు పైగా ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా సహారా ఎడారి ప్రాంతంతో పాటు, తూర్పు ఆఫ్రికా దేశాలైనా మాలి, నైజర్, లిబియా, అల్జీరియా మరియు చాద్ ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తుంటారు.

ఇవన్నీ ఇస్లాం సమాజానికి చెందినవి :

ఇవన్నీ ఇస్లాం సమాజానికి చెందినవి :

ఇస్లాం సమాజం గురించి ఆలోచించగానే, సాధారణంగా మనకు మొదట గుర్తుకు వచ్చేది పూర్తిగా బుర్కా తో కప్పబడిన మహిళలు. కానీ వాళ్లకు భిన్నంగా ' తుఅరేజ్ ' తెగకు చెందిన మహిళలు బహిరంగ ప్రదేశాల్లో పూర్తిగా కప్పబడిన దుస్తులు అస్సలు ధరించరు, ఎందుకంటే పురుషులు " వారి యొక్క అందమైన ముఖాలను చూద్దామని భావిస్తారు ." అంటే దాని అర్ధం, ఆ తెగలో అబ్బాయిలకు ఎంత స్వేచ్ఛ ఉంటుందో, అమ్మాయిలకు కూడా చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు అంతే స్వేచ్ఛ ఉంటుంది.

పురుషులు ఇక్కడ వాళ్ళ ముఖాలను దాచుకుంటారు :

పురుషులు ఇక్కడ వాళ్ళ ముఖాలను దాచుకుంటారు :

ఈ తెగకు చెందిన పురుషులు వాళ్ళ ముఖాలను దాచుకుంటారు. వీళ్ళను " బ్లూ మెన్ అఫ్ సహారా " అని అంటారు. అందుకు కారణం వీళ్ళు వారి యొక్క ముఖాలను, శరీరాన్ని నీలం రంగుతో కూడిన బట్టలను ఉపయోగించి కప్పుకుంటారు. అంతే కాకుండా, నీలం రంగు తలపాగాను చుట్టుకుంటారు. ఈ రంగు ని అక్కడ పురుషులు వాళ్ళ దుస్తుల పైకి ఎక్కువగా వాడటం వల్ల చర్మం కూడా కొద్దిగా నీలం రంగులోకి మారి ఉంటుంది.

శృంగారం గురించి నమ్మశక్యం కాని కొన్ని వాస్తవాలు

స్త్రీలు ఎంత మంది శృంగార భాగస్వాములనైనా కలిగి ఉండవచ్చు :

స్త్రీలు ఎంత మంది శృంగార భాగస్వాములనైనా కలిగి ఉండవచ్చు :

ఇక్కడి స్త్రీలు ఎక్కువ మంది శృంగార భాగస్వాములను కలిగి ఉండటానికి అనుమతి ఉంది. పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధాలను ఈ తెగవారు కొనసాగించవచ్చు. విడాకుల తర్వాత కూడా స్త్రీల యొక్క ఆధీనం లోనే ఆస్తి మొత్తం ఉంటుంది, అంతే కాకుండా పిల్లలు కూడా స్త్రీల యొక్క సంరక్షణలోనే పెరగాలి, ఇల్లు కూడా వీళ్ళకే రాసి ఇచ్చేయాలి.

ఇలా చేయడానికి ఖచ్చితంగా కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి :

ఇలా చేయడానికి ఖచ్చితంగా కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి :

పెళ్ళికి ముందే స్త్రీ లు శృంగారంలో పాల్గొనటానికి అనుమతి ఉంది, ఎక్కువ మంది శృంగార భాగస్వాములను కలిగి ఉండొచ్చు. కానీ, వాళ్ళ యొక్క సమాజాన్ని సంరక్షించుకొని పాలించేందుకు కొన్ని నిబంధనలతో పాటు, వ్యక్తిగత నియమాలను కూడా రూపొందించుకున్నారు ఈ తెగ వారు. వాటికి అనుగుణంగా ఖచ్చితంగా నడుచుకోవాల్సి ఉంది. వాటి ప్రకారం పురుషుడు, స్త్రీ యొక్క ఇంటికి సూర్యాస్తమయం తర్వాత వెళ్లి, సూర్యుడు ఉదయించేలోపు వచ్చేయాలి.

ఇలాంటి ఒక తెగ ఉందని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కొంత మంది మాత్రం ఈ తెగలో స్త్రీలు ఇంత స్వేచ్ఛను అనుభవిస్తుంటే, మిగతా ప్రపంచం లోని స్త్రీలు తమ హక్కుల కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారని నిట్టూరుస్తున్నారు.

English summary

A Tribe Where Women Are Free To Have Sex Before Wedding

Tuareg women can have more than one sexual partner outside their marriage.