గతంలో అబార్షన్ చేయటానికి అనుసరించిన భయంకర విధానాలు!

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

తల్లిదండ్రులవటం అంత సులభమైన పనేం కాదు. దీనికి ఇద్దరూ సమ్మతించి ముందుకి వెళ్ళడం చాలా ముఖ్యం. కొంతమంది తమకు చేతనైన రీతిలో మేటిగా ఈ బాధ్యతను తీసుకుంటే, మరికొంతమంది ఎప్పటికీ తయారుకాలేరు.

ఇది స్త్రీల అబార్షన్లకి దారితీస్తుంది,పైగా మందులు వాడటం వలన వారి ఆరోగ్యం కూడా దెబ్బతీస్తుంది. కానీ ఇదివరకు ఇలాంటి సంఘటనలప్పుడు ఏం చేసేవారో తెలిస్తే భయపడి పారిపోతారు!

గతంలో కొన్ని గర్భస్రావ పద్ధతులని ఎలా వాడేవారో తెలిస్తే బిక్కచచ్చిపోవాల్సిందే. ఈ లిస్టు చదవండి, వికారంగా భయమేస్తుంది.

యోనిలో జలగలను వదిలేవారు

యోనిలో జలగలను వదిలేవారు

గతంలో మనుషులు గర్భవతులుగా ఉన్న స్త్రీలను తమ యోనిలో జలగలను పెట్టుకోమని బలవంతం చేసేవారు. ఎందుకంటే అలా చేస్తే పిండాన్ని జలగలను నాశనం చేస్తాయని నమ్మేవారు. జలగలు పిండం వరకు వెళ్ళి వాటి నుంచి రక్తం తాగటమో లేదా నేరుగా చంపేయటమో చేస్తాయని భావించేవారు. ఎంత అసహ్యకరమైన పని!

కోటు హ్యాంగర్ ను లోపల పెట్టేవారు

కోటు హ్యాంగర్ ను లోపల పెట్టేవారు

ఇది చాలా భయంకరమైన పని,కానీ గతంలో ఇలా పదునైన వస్తువులను లోపల పెట్టి పిండాన్ని తెగ్గొట్టి గర్భస్రావం చేసేవారు. ఊహకే వళ్ళంతా తేళ్ళు కుట్టినట్లు ఉంది కదా!!

అద్భుతం! అబార్షన్ అయ్యాక కూడా ఆ బిడ్డ అన్నీ ఎదుర్కొని పుట్టి తన తల్లిని ఏళ్ళ తర్వాత కలిసాడు

ఏదైనా పదునైన వస్తువు

ఏదైనా పదునైన వస్తువు

గర్భాశయం వరకు వెళ్లగలిగే పొడుగు వస్తువేదైనా వాడి పిండాన్ని తెగ్గొట్టడానికి ప్రయత్నించేవారు. తిమింగలం ఎముక నుంచి టర్కీ ఈకలు, ఏదైనా వాడి అనవసర గర్భాన్ని తొలగించుకునే ప్రయత్నాలు చేసేవారు.

ఏళ్ళు గడిచేకొద్దీ పదునైన వస్తువులను మెరుగుపర్చారు

ఏళ్ళు గడిచేకొద్దీ పదునైన వస్తువులను మెరుగుపర్చారు

టర్కీ ఈకలను ఆపరేషన్ వస్తువులుగా వాడటం నుంచి ఈ పద్ధతులు చాలా మెరుగయ్యాయి. ఈ భయంకర పరికరాలు మూత్రాశయ కాథెటర్ లు, ఫోర్సెప్స్ మరియు స్పెక్యులంస్ గా మారాయి!!!

సబ్బునీళ్ళు!

సబ్బునీళ్ళు!

వైద్యులు చట్టవ్యతిరేకంగా అబార్షన్లు చేసేటప్పుడు వాడే చెత్త విధానాలలో ఇది కూడా ఒకటి. ఎనిమా సిరంజ్ ను సబ్బునీళ్ళతో నింపి దాన్ని యోనిలో పెడతారు. ఈ సిరంజి పిండాన్ని నాశనం చేసి అబార్షన్ కి దారితీస్తుందని భావించేవారు.

అబార్షన్ క్లినిక్స్ నుంచి ఈ వ్యక్తి బేబీలను పూడ్చిపెట్టాడు

కాక్ టెయిల్స్ లో విషమొక్కలు

కాక్ టెయిల్స్ లో విషమొక్కలు

కుటుంబ పెద్దలు స్థానిక విషమొక్కలను కాక్ టెయిల్ లో కలిపి కడుపుతో ఉన్న స్త్రీలకి తాగమని ఇచ్చేవారు. ఈ విషమొక్కలు పుట్టబోయే పిండానికి తీవ్రంగా ఉండి చంపేస్తాయని భావించేవారు.

టాంపోన్స్ లో గగుర్పొడిచే వస్తువులను పెట్టేవారు

టాంపోన్స్ లో గగుర్పొడిచే వస్తువులను పెట్టేవారు

అప్పట్లో, మనుషులు చీమల మిశ్రమం, ఒంటె జుట్టు లేదా దాని నోటిలోని నురగతో నింపిన టాంపోన్స్ ను వాడేవారు. ఈ విచిత్ర టాంపోన్స్ ను యోనిలో పెట్టుకునేవారు. దీనిలోని విషం గాఢత వలన ఈ మిశ్రమాలు తప్పక పిండాన్ని చంపేయడమే కాక, ఇన్ఫెక్షన్ కి కూడా దారితీస్తాయి.

వేడి నీళ్ళ స్నానం

వేడి నీళ్ళ స్నానం

గతకాలంలో చేసిన అస్సలు బుర్రలేని పని ఇది. వేడి వేడి మసిలే నీళ్ళతో స్నానం చేస్తే పిండం తెగిపోయి గర్భస్రావమవుతుందని నమ్మేవారు. స్త్రీ యోనిలో ఉండే మ్యూకస్ పొరలు వేడినీటివలన తెరుచుకుంటే ఆమె శరీరం తనంతట తానే సహజంగా పిండాన్ని నిరాకరిస్తుందని నమ్మేవారు.

English summary

Disturbing Abortion Practices From The Past

Most of these practices were barbaric and inhuman…
Story first published: Saturday, November 18, 2017, 18:30 [IST]