మీకు వివిధ రకాల దోషాలు గురించి తెలుసా?

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

జ్యోతిష్యశాస్త్రం చాలా పెద్దదైనది మరియు అందులో దోషాలు మరింత ముఖ్యపాత్రను పోషిస్తాయి.దోషం అంటే అర్థం చేసుకోడానికి, దాని విశిష్టత ఏంటో తెలుసుకోడానికి జ్యోతిష్యం ప్రాథమిక విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి.

దోషం అంటే అర్థం 'మనకి సరిపోనిది లేదా కలిసిరానిది అని.’

మాంగళీక(కుజ) దోషంలో పుడితే...కొన్ని వాస్తవాలు

జ్యోతిష్యంలో దోషాలు ముఖ్యపాత్ర ఎలా పోషిస్తాయో తెలుసుకోడానికి,ఈ వ్యాసం చదవండి. మనుషుల జన్మచక్రంలోని గ్రహస్థితులు సరైన స్థానాలలో లేనప్పుడు జరిగే సంఘటనలను దోషాల ప్రభావం అని అంటారు.

అయితే, ఇక దోషాల వివిధ రకాలు, జాతకచక్రంలో ప్రతి ఇల్లును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

కుజదోషం

కుజదోషం

వేదజ్యోతిష్యం ప్రకారం, ఈ దోషం చాలా సాధారణమైనది. 50% మందికి పైగా మందికి తమ జాతకచక్రాలలో కుజగ్రహం 1,4,7,8 మరియు 12ఇళ్ళలో ఉండటం వలన ఈ మంగళదోషం వస్తుంది. కుజదోషం గురించి పెద్దగా చేసుకునే అపార్థం ఏంటంటే భార్యాభర్తలలో ఒకరికి కుజదోషం ఉంటే మరొకరు తప్పక చనిపోతారని.

నాడీదోషం

నాడీదోషం

నాడీదోషం ఒకేనాడి ఉన్న ఇద్దరు వ్యక్తులు పెళ్ళాడితే వచ్చే దోషం. దీన్ని వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు సృష్టిస్తుందని చాలా తీవ్ర అవలక్షణంగా భావిస్తారు. నాడి అంటే ఏంటని ఆలోచిస్తున్నారా, దాని అర్థం 8 కూటములు లేదా ఇద్దరు వ్యక్తుల పెళ్ళి ఎంత బలమైనదో లెక్కించటానికి,విశ్లేషించడానికి ఉపయోగించే పదం.

పితృదోషం

పితృదోషం

ఈ దోషం ఒక కుటుంబపెద్ద గతంలో చేసిన చెడు వలన వస్తుంది. ఈ దోషం జన్మచక్రంలో 9వ ఇంట్లో కన్పిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే తండ్రికి చెందిన ఇల్లు కాబట్టి. ఆ వ్యక్తి ఈ దోషం వల్ల ముందుకి సాగలేడని కూడా అంటారు.

పెళ్లి ప్రయత్నాలు సఫలం కావాలంటే ఇలా చేసి చూడండి.!

కార్తీకజన్మ దోషం

కార్తీకజన్మ దోషం

ఈ దోషం కార్తీకమాసం, హిందూ పురాణాల ప్రకారం అక్టోబర్ సగం నుంచి,నవంబర్ సగం వరకూ ఉన్న సమయంలో వస్తుంది. సూర్యుడు ఈ సమయంలో చాలా బలహీనంగా ఉంటాడు. అందుకని కార్తీకజన్మ దోషం రూపంలో ఒక వ్యక్తిపై దాని ప్రభావం ఎలా అయినా పడవచ్చు. ఈ సమయంలో పుట్టిన వ్యక్తికి తప్పక కార్తీక జన్మదోషం ఉండితీరుతుంది.

కాలసర్ప దోషం

కాలసర్ప దోషం

దీన్ని జాతకంలో తీవ్రదోషంగా భావిస్తారు. హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది ఒక వ్యక్తి జీవితంలో అన్ని విషయాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ దోషం ఎంత ప్రభావితం చేస్తుందంటే వ్యక్తి జాతకంలో మంచిగా ఉన్న గ్రహాలు కూడా దురదృష్టంగా మార్చేస్తాయి.

English summary

Do You Know About The Different Types Of Doshas?

We bet you were not aware of all the different doshas! So check out all the different types of doshas mentioned in this article.
Subscribe Newsletter