రోగి క‌డుపులో 263 నాణేలు, బ్లేడులు, మేకులు: ఆశ్చ‌ర్యంలో డాక్ట‌ర్లు!

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

ఇంట‌ర్నెట్ ఎన్నో వింత‌లు, విశేషాలకు నిల‌యం. ఎన్నో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు, ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యాలు, భ‌యంక‌ర‌మైన, జుగుప్సాక‌ర విశేషాల‌కు పుట్టిల్లు. ప్ర‌తి రోజు ఏదో ఒక గ‌మ్మ‌త్తైన విష‌యాన్ని ఇంట‌ర్నెట్ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

క్రితం సారి 48 ఏళ్ల వ్య‌క్తి క‌డుపులో 639 మేకుల‌ను డాక్ట‌ర్లు క‌నుగొన్నారు. ఆయ‌న‌కు క‌ల‌క‌త్తా మెడిక‌ల్ హాస్పిట‌ల్‌లో చికిత్స చేశారు. ఆయ‌న‌కు స్కిజోఫ్రీనియా ఉంద‌ని వైద్యులు క‌నిపెట్టారు.

Man who ate coins

ఇంచుమించు అలాంటి కేసునే అమ్రిత్‌స‌ర్‌లో క‌నుక్కున్నారు. ఒక వ్య‌క్తి క‌డుపు నుంచి ఏకంగా 40 క‌త్తుల‌ను వెలికితీశారు. ఆయ‌న‌కు అక్క‌డున్న ఓ కార్పొరేట్ ఆసుప‌త్రిలో చికిత్స చేశారు. ఇప్పుడాయ‌న ప‌రిస్థితి బాగానే ఉంది.

మ‌రొక కేసు డాక్ట‌ర్ల‌ను, ఇంట‌ర్నెట్ ప్రపంచాన్ని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేసింది. ఒక వ్య‌క్తి నాణేల‌ను, సూదుల‌ను, బ్లేడ్‌ల‌ను, గాజు ముక్క‌ల‌ను రోజు మింగేవాడు. ఆ క‌థాక‌మామీషేమిటో తెలుసుకుందాం రండి.....

263 నాణేలు వెలికితీశారు

263 నాణేలు వెలికితీశారు

ఇటీవ‌ల వ‌చ్చిన వార్త‌ల ప్ర‌కారం 32ఏళ్ల వ‌య‌సున్న ఒక మ‌నిషి క‌డుపులో నుంచి 263 నాణేల‌ను, షేవింగ్ బ్లేడ్ల‌ను, సూదుల‌ను స‌ర్జ‌రీ చేసి మ‌రీ తీయాల్సి వ‌చ్చింది.

రోగి ఎవ‌రంటే...

రోగి ఎవ‌రంటే...

మ‌ధ్య ప్ర‌దేశ్‌లో సాత్నా జిల్లాలో సోహ్‌వాల్ అనే గ్రామంలో మ‌హ‌మూద్ మ‌క్సూద్ అనే వ్య‌క్తి స్థానిక సంజ‌య్ గాంధీ ఆసుప‌త్రిలో తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో చేరాడు. ఆయ‌న‌కు మూడు గంట‌ల‌పాటు శ‌స్త్ర‌చికిత్స నిర్వ‌హించారు.

క‌డుపునొప్పికి కార‌ణం

క‌డుపునొప్పికి కార‌ణం

న‌వంబ‌ర్ 18న ఆయ‌న‌కు తీవ్ర‌మైన క‌డుపునొప్పి రావ‌డంతో ఆసుపత్రి సిబ్బందికి అనుమాన‌మొచ్చి ఎక్స్ రే తీశారు. అది చూసిన డాక్ట‌ర్లు నివ్వెర‌పోయారు. క‌డుపులో లోహ‌పు నాణేలతో పాటు ఇత‌ర వ‌స్తువులు ఉన్నాయి. ఇదే క‌డుపునొప్పికి కార‌ణంగా తేల్చారు.

అక్క‌డికెలా వెళ్లాయి?

అక్క‌డికెలా వెళ్లాయి?

ఒక డాక్ట‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఆ వ్య‌క్తి ర‌హ‌స్యంగా ఈ వ‌స్తువుల‌ను మింగేవాడ‌ట‌. అదీ కాకుండా అత‌డి మాన‌సిక స్థితి ఏమీ బాగాలేద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. అదృష్ట‌వ‌శాత్తు అన్ని వ‌స్తువులు తిన్నా అత‌డి క‌డుపు లోప‌లి భాగాల‌కు ఏమీ కాలేద‌ట‌. ఇవి ఎప్పుడూ తిన‌న‌ని డాక్ట‌ర్ల‌కు ప్ర‌మాణం చేశాడు.

చికిత్స ఇలా చేశారు..

చికిత్స ఇలా చేశారు..

మ‌హ‌మూద్ క‌డుపులోంచి వ‌స్తువుల‌ను తీసేందుకు 6 నిష్ణాతులైన వైద్యులు శ్ర‌మ‌ప‌డ్డారు. దాదాపు 5కేజీల వ‌స్తువులు వారు తీశారు. 4 పెద్ద సూదులు, ఒక చెయిన్‌, 263 నాణేలు, 10 నుంచి 12 షేవింగ్ బ్లేడ్లు, కొన్ని గాజు ముక్క‌ల‌ను వారు క‌డుపులోంచి తీశారు. ఇలాంటి కేసును చూడ‌టం త‌మ కెరీర్‌లోనే తొలిసార‌ని డాక్ట‌ర్లు అన్నారు. ఆప‌రేష‌న్‌ను స‌రైన స‌మ‌యంలో చేశామ‌ని ఒక డాక్ట‌ర్ అన్నాడు. అప్ప‌టికే కొన్ని మేకులు లోప‌లి భాగాన్ని కుచ్చుకొని ర‌క్తం స్ర‌వించిందని చెప్పాడు.

రోగి ప‌రిస్థితేమిటి

రోగి ప‌రిస్థితేమిటి

ప్ర‌స్తుతానికి రోగి ప‌రిస్థితి బాగుంది, డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడు. సాత్నాలో అత‌డికి ఇదివ‌ర‌కే చికిత్స జ‌రిగింద‌ని రోగితో సంబంధం ఉన్నావారు చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి ఆయ‌న రేవా అనే ప‌ట్ట‌ణంలో చికిత్స పొందుతున్నాడు. అత‌డు 6నెల‌ల నుంచి ఇలాంటి వ‌స్తువుల‌ను మింగుతున్నాడ‌ని తేలింది.

విచిత్ర‌మైన అల‌వాటు అత‌డిది

విచిత్ర‌మైన అల‌వాటు అత‌డిది

రోగి తిండి అల‌వాటుపై అత‌డి కుటుంబ‌స‌భ్యుల‌ను అడ‌గ‌గా డిప్రెష‌న్‌కు గురికాక ముందు లోహ‌పు వ‌స్తువుల‌ను తినే వాడ‌ని చెప్పారు. అదీ కాక అత‌డు ఎప్పుడు ఇలా తినేవాడ‌ని త‌మ‌కు చెప్ప‌లేద‌ని అన్నారు. అత‌డు డ్రైవ‌ర్‌గా పనిచేసేవాడ‌ని కస్ట‌మ‌ర్లు ఇచ్చిన నాణేల‌ను మింగేవాడ‌ని కొంద‌రంటున్నారు.

English summary

Indian Man Who Ate Blades, Chains And Coins

Here is a case that is shocking the internet, which is of a man who kept swallowing coins, needles, blades and some pieces of glasses on a daily basis. This case has left the doctors and the surgeons totally shocked!