కేరళ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు

By R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

దేవుని ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది కేరళ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఉండే ప్రకృతి సౌందర్యాలు, మనోహరమైన దృశ్యాలు చూపరులను ఆకర్షిస్తాయి, మనస్సును కట్టిపడేస్తాయి. ఎంతో మంచి ప్రకృతి సుందరమైన వాతావరణం కలిగిన రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. నోరురూరించే రుచులు, ఉల్లాసపరిచే వాతావరణం, ఎదో తెలియని ఆకర్షణ, ఇవన్నీ కేరళ రాష్ట్ర సొంతం.

ఈ రాష్ట్రాన్ని మరియు అక్కడ ఉన్న వాతావరణాన్ని ప్రజలు ఎంతగా ఇష్టపడతారు అనే విషయాన్ని తెలియజేయడానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటంటే, ఒక అధ్యయనం ప్రకారం చాలామంది ప్రజలు చివరిలో మరణించడానికి కేరళ ఉత్తమమైన ప్రదేశంగా భావిస్తున్నారట. వీటికి తోడు కొత్తగా పెళ్ళైన జంటలు హనీమూన్ చేసుకోవడానికి కేరళకు ఎక్కువగా వస్తూ ఉంటారు. అందుకు కేరళ రాష్ట్రం ఎంతో ప్రసిద్ధి గాంచింది.

ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన 10 ప్రదేశాలు..

కేరళ రాష్ట్రంలో ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి మరియు విస్తుపోయేలా చేసే విషయాలు ఉన్నాయి. వీటికి తోడు మరెన్నో అద్భుతాలు కూడా ఎప్పుడు పచ్చగా ఉండే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు గనుక మలయాళీలు అయితే ఇప్పుడు మీరు చదవబోయే వ్యాసాన్ని ఎంతగానో ఇష్టపడతారు. మీరు గనుక అలా కాకపోతే ఇది చదివినప్పటి నుండి కేరళను ప్రేమించడం ప్రారంభిస్తారు. కేరళ రాష్ట్ర విశేషాలు, విశిష్టతలు మరియు గొప్పదనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. అత్యధికంగా రబ్బరు ని ఉత్పత్తి చేస్తుంది :

1. అత్యధికంగా రబ్బరు ని ఉత్పత్తి చేస్తుంది :

కేరళలో దాదాపు 5.45 లక్షల ఎకరాలలో సాగు చేయడానికి వీలుగా ఉండే భూమి ఉంది. దేశంలోనే అత్యధికంగా రబ్బరుని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానాన్ని సంపాదించింది. దేశంలో ఉత్పత్తి అయ్యే రబ్బరులో 90% కేరళ రాష్ట్రం నుండే వస్తుంది. కేరళ తర్వాత తమిళనాడులో అత్యధికంగా రబ్బరు ఉత్పత్తి జరగడం తో ఆ రాష్ట్రం రెండవ స్థానం లో ఉంది.

2. అత్యధికంగా కొబ్బరికాయలను ఉత్పత్తి చేసే రాష్ట్రం :

2. అత్యధికంగా కొబ్బరికాయలను ఉత్పత్తి చేసే రాష్ట్రం :

దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు కేరళ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అత్యధికంగా కొబ్బరి కాయల ఉత్పత్తి చేస్తాయి. మరి ఇందులో వింతేముంది అనుకుంటున్నారా ? పైన చెప్పబడిన రాష్ట్రాలన్నింటిలో కెల్లా కేరళ రాష్ట్రం లోనే అత్యధికంగా కొబ్బరి కాయలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. కేరళ రాష్ట్రం నుండే 90% కు పై కొబ్బరి కాయలు ఉత్పత్తి అవుతాయి. దేశంలోనే అత్యధికంగా కొబ్బరి కాయలు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా పేరుని సంపాదించింది కేరళ.

3. జీవిత కాలం :

3. జీవిత కాలం :

భారత దేశంలో సాధారణంగా ఒక వ్యక్తి సగటున జీవించే జీవిత కాలం సగటున 60 నుండి 63 సంవత్సరాలు. కానీ, కేరళ రాష్ట్రం మాత్రం ఇందుకు అతీతం. మొత్తం దేశంలో కెల్లా కేరళ రాష్ట్రంలోనే సగటు వ్యక్తి జీవిత జీవితకాలం అత్యధికంగా ఉంది. ఈ మధ్యనే జరిగిన ఒక అధ్యయనం ప్రకారం కేరళ రాష్ట్రంలో నివసించే వ్యక్తుల యొక్క సగటు జీవిత కాలం 70 నుండి 74 సంవత్సరాలు.

4. దేశంలోనే అతి పురాతన మసీదు :

4. దేశంలోనే అతి పురాతన మసీదు :

దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో చరిమన్ జుమా మసీదు ఈ రాష్ట్రం లో ఉంది. భారతదేశంలోని మొట్ట మొదటి మసీదు ఇదే అని కూడా చెబుతారు. అరబ్ ని వ్యాప్తి చేయడానికి వచ్చిన మాలిక్ దీనార్ క్రీస్తు శకం 629 లో కొడుంగళూర్ తాలూకా లోని మతాల లో దీనిని నిర్మించాడట. ఈ మసీదు దగ్గర ఎదో ఒక తెలియని మాయ ఉందని చాలామంది భావిస్తారు. ఇందువల్లనే ఈ మసీదుకు ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి మరియు చాలామందిని ఇక్కడికి వచ్చేలా ఆకర్షిస్తుంది. ఈ మసీదు లో ఒక లాంతరు ఉంది అది గత వెయ్యి సంవత్సరాలకు పైగా మండుతూ ఉందని మరియు ఎప్పటికీ ఆలా మండుతూనే ఉంటుందని చాలా మంది చెబుతున్నారు. ఇస్లాం మతం వారే కాకుండా ఇతర మతస్థులు కూడా ఇక్కడికి వస్తుంటారు. అన్ని మతాల వారు ఇక్కడికి వచ్చినప్పుడు నూనె లాంతర్లను తెచ్చి కానుకగా ఇస్తుంటారు.

అలర్ట్: ఈ టూరిస్ట్ స్పాట్స్ కి వెళ్తే.. ప్రాణాలు ఫణంగా పెట్టినట్టే..!!

5. నీటి ప్రకృతి అందాల మధ్య అనుభూతి వర్ణనాతీతం :

5. నీటి ప్రకృతి అందాల మధ్య అనుభూతి వర్ణనాతీతం :

వెనుకకు వచ్చే నీటి యొక్క అందాలను మరియు ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అత్యద్భుతంగా ఆస్వాదించాలంటే అందుకు తగ్గ ప్రదేశం భారతదేశం మొత్తంలో కేరళ మాత్రమే. ఈ అనుభూతి ఇంకెక్కడా రాదంటే అతిశయోక్తి కాదు. కేరళ రాష్ట్రం మాత్రమే మమ్మల్ని మీరు మరచిపోయే విధంగా పచ్చటి అడవిలోకి మిమ్మల్ని విహరింపచేసి రకరకాల ప్రకృతి అందాలు మరియు జీవ జాతులతో విహరింపచేస్తుంది. ఇలాంటి ఉత్తేజకరమైన, ఉల్లాసవంతమైన మరియు ఆ నీటి అందాల మధ్య విహరిస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా ప్రతి ఒక్కరు ప్రకృతిలో లీనమవుతారు, ప్రేమించడం మొదలు పెడతారు.

6. నోరూరించే వంటకాలు కేరళ సొంతం :

6. నోరూరించే వంటకాలు కేరళ సొంతం :

కేరళ పక్కనే ఉన్న తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లాగా కాకుండా, కేరళలో అటు శాకాహారం ఇటు మాంసాహారానికి సంబంధించి ఎన్నో నోరూరించే వంటకాలు అక్కడ దొరుకుతాయి. రొయ్యలు,పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలు, పీతలు, ట్యూనా చేపలు, ఎండ్రకాయలు ఇలా ఎన్నో రకాలు అక్కడ దొరుకుతాయి. అక్కడి సంప్రదాయబద్ధమైన సాద్య ఆహరం దగ్గర నుండి సముద్రపు ఆహరం మరియు మాంసపు రుచులు ఇలా ఎన్నో రకాల ఆహారం అక్కడ దొరుకుతుంది. వివిధరకాల ఆహారాన్ని విపరీతంగా ప్రేమించేవారికి కేరళ ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు. అక్కడ దొరికే ఈ వంటకాలన్నీ కొద్దిగా కారంగా మరియు ఉప్పగా ఉండటంతో పాటు ఎంతో మంచి సువాసనలు కలిగి, మంచి రంగు మరియు మసాలాదినుసులు కూడా అందులో ఉంటాయి. దోసెలను అక్కడ చేసే ప్రత్యేకమైన సాంబారు తో తినడం చాలా అద్భుతంగా మరియు రుచిగా ఉంటుంది. నాధన్ కోజహి వారుతతు మరియు చికెన్ ఫ్రై వీటన్నింటిని అరిటాకులో పెట్టుకొని భుజిస్తే ఎంత తిన్నా తనివి తీరదు. ఇలా చేయడం అస్సలు మరిచిపోకండి.

7. తేలియాడే అతిపెద్ద సోలార్ ప్లాంట్ :

7. తేలియాడే అతిపెద్ద సోలార్ ప్లాంట్ :

భారత దేశంలోనే అతిపెద్ద విశాలమైన మరియు పొడవైన తేలియాడే సోలార్ ప్లాంట్ ను వాయనాడ్ దగ్గర బాణాసుర సాగర్ రిజర్వాయర్ పైన నిర్మించడం జరిగింది. 6 వేళ చరుపు అడుగులలో నీటి పై తేలియాడుతున్న ఈ అతిపెద్ద ప్లాంట్ ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు విద్యుత్తు ఉత్పత్తిచేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి దాదాపు 9.25 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. దీనిని పూర్తి చేయడానికి ఒకటిన్నర సంవత్సరం సమయం పట్టింది.

8. ఏనుగులను ఎంతో పవిత్రంగా భావిస్తారు :

8. ఏనుగులను ఎంతో పవిత్రంగా భావిస్తారు :

కేరళలో పురాతన కాలం నుండి సాంప్రదాయ బద్దంగా మరియు సమాజ ఆచార వ్యవహారాల్లో భాగంగా ఏనుగులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కేరళ రాష్ట్ర జంతువు ఏనుగు. అందుచేతనే కేరళ రాష్ట్ర ప్రభుత్వ గుర్తు పై మనకు ఏనుగు కనపడుతుంది. కేరళ రాష్ట్రంలో ఏనుగులను చాలా పవిత్రంగా భావిస్తారు. అంతే కాకుండా పండగ సందర్భాల్లో, దేవాలయాల్లో మరియు మరెన్నో చోట్ల ఏనుగులను ప్రత్యేకంగా పూజిస్తారు మరియు గౌరవిస్తారు.

9. అత్యధిక తాగుబోతుల రాష్ట్రం :

9. అత్యధిక తాగుబోతుల రాష్ట్రం :

మొత్తం భారత దేశంలోనే అత్యధికంగా తాగే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ మాత్రమే అని చాలామందికి తెలియదు. భారత దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలతో పోల్చిచూస్తే అత్యధికంగా మద్యాన్ని సేవించే స్థానాల్లో కేరళ మొదటి స్థానంలో నిలుస్తుంది. 2015-16 లెక్కల ప్రకారం సంవత్సరానికి ఒక్కో వ్యక్తి సగటున 8 నుండి 9 లీటర్ల మద్యాన్ని సేవించారట. అన్ని రాష్ట్రాలలో కెల్లా కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా బార్ లు ఉన్నాయి. అందరూ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే అత్యంత తాగుబోతులున్న రాష్ట్రమే అత్యధికంగా చదువుకున్న వ్యక్తులున్న రాష్ట్రంగా ఉండటం గమనార్హం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Not Just Literacy Rate, Here's A Lot More Things To Know About Kerala

    Did you know that this state is known as the land of the heaviest drinkers?
    Story first published: Friday, November 17, 2017, 8:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more