For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిరాకిల్: 46 ఏళ్ళుగా బిడ్డను ప్రసవించకుండా కడుపులోనే దాచుకున్న మహిళ..!

By R Vishnu Vardhan Reddy
|

జన్మనివ్వడం అనేది చాలా వేదనతో కూడుకున్న వ్యవహారం. అది సులభమైన విషయం ఏమి కాదు. ఎన్నో సందర్భాల్లో శిశువులకు జన్మనిస్తూ తమ ప్రాణాలను కూడా కోల్పోయారు చాలా మంది తల్లులు. దీంతో చాలా మంది మహిళలు గర్భం దాల్చడానికి కూడా భయపడిన సందర్భాలున్నాయి.

ఒక మహిళ తాను గర్భవతిగా ఉన్నానని గుర్తించింది. కానీ, ప్రసవించడానికి భయపడింది. దీంతో ఆసుపత్రి నుండి పారిపోయి వచ్చేసింది.

ఒకసారి గర్భం దాల్చినప్పుడు మళ్ళీ అదే సమయంలోనే గర్భం దాల్చవచ్చు అనే విషయం మీకు తెలుసా ?

ఒక అసాధారణమైన మరియు వింత యదార్ధ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం .

దీని గురించి తెలుసుకుంటున్నంత సేపు సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో మన కళ్ళ ముందు కనపడతాయి. అసలు ఇంత కాలం ఈ మహిళ ఎలా బ్రతికింది అనే అనుమానం కూడా కలుగుతుంది.

మిరాకిల్ ప్రసవం...మాయతో పుట్టిన బిడ్డ!మిరాకిల్ ప్రసవం...మాయతో పుట్టిన బిడ్డ!

అసలు బిడ్డ జన్మించకపోతే ఏమి జరుగుతుందంటే :

అసలు బిడ్డ జన్మించకపోతే ఏమి జరుగుతుందంటే :

ఎప్పుడైతే పిండం గర్భంలోనే జన్మిస్తుందో అప్పుడు అది దానంతట అదే బయటకు రాదు. గర్భంలోపల పిండం అలానే ఉండిపోతుంది. చూడటానికి రాళ్లతో కూడిన లేదా సున్నంతో చేసిన బొమ్మలాగా ఉంటుంది. దీనినే వైద్య పరిభాషలో లిథోపీడియోన్ అని అంటారు. ఒక వేళ పిండం గనుక శరీరం గ్రహించలేనంత పెద్దదిగా ఉంటే ఆ సమయంలో మెల్లగా మన శరీరమే గర్భంలో ఉన్న పిండాన్ని వర్గీకరిస్తుంది. ఆ గర్భం దాల్చే మహిళ తీసుకొనే ఆహరం నుండి క్యాల్షియాన్ని, రక్తం మరియు ఎముకలను ఉపయోగించి ఆ పిండం చుట్టూరా ఒక రాయిలాంటి ఆకృతి ఏర్పడుతుంది. దీనివల్ల ఆ మరణించిన పిండం యొక్క కణజాల ప్రభావం ఆ అమ్మ పై పడదు. ఇందువల్ల ఆ బిడ్డ ఎప్పటికి సాధారణ పద్దతిలో జన్మించదు.

గర్భం దాల్చే సమయానికి ఆమె వయస్సు 26 సంవత్సరాలు :

గర్భం దాల్చే సమయానికి ఆమె వయస్సు 26 సంవత్సరాలు :

ఆమె పేరు జహ్రా అబౌతాలిబ్. ఈమె వయస్సు అప్పుడు 26 సంవత్సరాలు. పురిటి నొప్పులతో 48 గంటలు భాధపడింది. ఈ సంఘటన 1955 లో చోటుచేసుకునింది.అప్పటికి వైద్య శాస్త్రం ఇంకా పెద్దగా అభివృద్ధి చెందలేదు.

ఆమె చాలా ఎక్కువగా భయపడిపోయింది :

ఆమె చాలా ఎక్కువగా భయపడిపోయింది :

ఆమె ఆసుపత్రి లో ఉన్న ప్రసవ గది ని చూసి విపరీతంగా భయపడి పోయింది. ఎందుకంటే ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయింది. ఈ సంఘటనను ఆమె కళ్లారా చూసింది. దీని తరువాత వైద్యులు ఎంత చెప్పినా వినకుండా ఆసుపత్రి నుండి వెళ్లిపోవాలని నిశ్చయించుకునింది.

ఎప్పటికి తిరిగిరాకూడదు అనే ఉద్దేశ్యంతో వెళ్ళిపోయింది :

ఎప్పటికి తిరిగిరాకూడదు అనే ఉద్దేశ్యంతో వెళ్ళిపోయింది :

ఇలా అయితే బిడ్డకు జన్మనివ్వకూడదు ప్రసవించకూడదు అని నిశ్చయించుకునింది. దీంతో హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది. ఎవ్వరు ఆపడానికి ప్రయత్నించినా ఆగలేదు. ఆ తరువాత ఆమె అసలు ప్రసవించనేలేదు.

విస్మయం కలిగించే వింత పుట్టుకలువిస్మయం కలిగించే వింత పుట్టుకలు

ఆమె ఏమి అనునకున్నది అంటే :

ఆమె ఏమి అనునకున్నది అంటే :

గర్భంలో ఉన్న శిశివు తనంతట తానుగా బయటకు రావాలని ఆమె భావించింది. కానీ అది ఇప్పటికీ జరగలేదు. ఆ శిశువు గర్భంలో ఉండగానే మరణించింది. ఆమె తన జీవితాన్ని అలానే నెట్టుకొచ్చింది. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలని కూడా దత్తతు తీసుకుంది.

46 సంవత్సరాలు గడిచిపోయాయి :

46 సంవత్సరాలు గడిచిపోయాయి :

జహ్రా తనకు పుట్టని మరియు గర్భంలోనే ఉండిపోయిన శిశువు గురించి పూర్తిగా మరిచిపోయి ఆమె జీవితాన్ని అలానే కొనసాగించింది. ఈ క్రమంలో ఆమె అమ్మమ్మ కూడా అయిపొయింది. ఈ వయస్సులో ఆమెకు కడుపులో కొద్దిగా నొప్పి రావడం మొదలైంది. ఇది గమనించిన కొడుకు ఆమెను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాడు.

వైద్యులు అయోమయంలో పడిపోయారు :

వైద్యులు అయోమయంలో పడిపోయారు :

జహ్రా ఉబ్బిపోయిన కడుపుని చూసి వైద్యులు ఆమెకు స్కానింగ్ అవసరమని సూచించారు. ఆ స్కానింగ్ రిపోర్ట్ చూసిన వైద్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వాళ్లకు కొద్దిసేపు అర్ధం కాలేదు అక్కడ ఏముంది అని. ఒక పిండం కొన్ని సంవత్సరాలుగా అలానే ఒక రాతి ఆకారం లో ఆమె కడుపులో కనపడింది.

చివరకు ఆమెకు ఎట్టకేలకు చికిత్స చేశారు :

చివరకు ఆమెకు ఎట్టకేలకు చికిత్స చేశారు :

ఆమె చికిత్స చేయించుకోవడానికి ఎప్పటిలాగానే విపరీతంగా బయపడింది. కానీ వైద్యులు ఆమెకు నచ్చజెప్పడంతో సఫలీకృతులైయ్యారు. శరీరంలో ఉన్న పిండాన్ని నాలుగు గంటల పాటు చికిత్స చేసి బయటకు తీశారు. కొద్ది సమయం గడిచిన తర్వాత ఆమె కోలుకొని మళ్ళీ మాములు స్థితికి చేరుకుంది.

చివరగా ఆమె ఆ బాధ నుండి విముక్తురాలైంది :

చివరగా ఆమె ఆ బాధ నుండి విముక్తురాలైంది :

తన గర్భంలో ఉన్న పిండాన్ని మరచిపోయాను అనే విషయాన్ని గుర్తించి, వైద్యుల సహాయంతో ఇప్పుడు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకున్నందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని జహ్రా చెప్పుకొచ్చింది. చనిపోయిన పిండానికి 46 సంవత్సరాల తర్వాత తగిన రీతిలో అంత్యక్రియలు జరిగాయి.

ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు. మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.

English summary

Doctors Forced Her To Deliver Her Unborn Child After 46 Years!

Giving birth is painful, it is not an easy task. There are so many instances where women lose their lives while giving birth and this scares many of them from entering motherhood as well.
Desktop Bottom Promotion