For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశి ప్రకారం మీకు ఏ టారో కార్డు సరిపోతుంది మరియు దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి!?

By R Vishnu Vardhan Reddy
|

మొత్తం టారో కార్డుల సంఖ్య 78 . వీటిలోని కొన్ని కార్డులు జోతిష్యశాస్త్రం ప్రకారం పన్నెండు రాశులకు సంబంధించిన శక్తుల గురించి తెలియజేస్తాయి. టారో మరియు రాశులకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ, ఎదో విషయం ఈ రెండింటిని దగ్గరకు చేస్తుంది !

ఇప్పుడు మనం టారో కార్డులకు మరియు అందుకు సంబంధించిన రాశులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే విషయమై కొద్దిగా విపులంగా తెలుసుకుందాం.

టారో కార్డు కి మరియు రాశులకు మధ్య ఉన్న సంబంధం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇలా చేయటం ద్వారా మీ యొక్క వ్యక్తిత్వం గురించి మరింత లోతుగా అర్ధం చేసుకోవచ్చు. ఈ అపూర్వమైన సంబంధం గురించి అర్ధం చేసుకోవడం ద్వారా మీ జీవితంలో ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటి గురించి మరింత లోతుగా అర్ధం చేసుకొని అందుకు అనుగుణంగా మీ జీవిత గమనాన్ని మార్చుకోవచ్చు.

ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం...

మేషం :

మేషం :

మేషరాశి వారికి " ది ఎంపరర్ ( చక్రవర్తి ) " అనే కార్డు ఉత్తమంగా సరిపోతుంది. ఈ కార్డు నాయకత్వ లక్షణాలను తెలియజేస్తుంది. ఇందువల్ల జీవితం ఎంతో సఫలమవుతుంది. ఈ కార్డు ని మీరు చదువుతున్న సమయంలో అది తలక్రిందులుగా గనుక ఉంటే, మీ ఆలోచనలను, శరీరాన్ని మరియు ఆత్మను చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా కాలానుగుణంగా మీరు సాధించబోయే లక్ష్యాల గురించి మరియు మీ యొక్క శక్తిసామర్ధ్యాల గురించి ఇది తెలియజేస్తుంది.

వృషభం :

వృషభం :

" హియెరోఫాంట్ ( మఠాధిపతి ) " అనే కార్డు వృషభరాశి యొక్క శక్తుల గురించి తెలియజేస్తుంది. ఆధ్యాత్మికంగా ఒక విద్యార్థి గురువు క్రింద మారడానికి ఈ కార్డు ప్రాతినిధ్యం వహిస్తుంది. మీరు ఎంచుకున్న విషయంలో ప్రతిదీ నేర్చుకొనేలా చేయడంలో ఇది ఎంతో కీలక పాత్రపోషిస్తుంది. మీరు అభ్యసిస్తున్న చదువు మరియు ఎంచుకున్న రంగంలో అన్ని వైపులా వృద్ధి చెందటం ఆవశ్యకం అని సలహా ఇస్తున్నారు. ఇలా చేయటం వల్ల మీరు అందులో నిపుణులు మాత్రమే అవ్వరు వాటికితోడుగా ప్రతిసారి మీకు ఎదో కొత్త విషయాన్ని చెబుతుంది.

మిథునం :

మిథునం :

" ది లవర్స్ కార్డు (ప్రేమికుల కార్డు ) " ఈ కార్డు నిజమైన మిథున రాశి వారికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ముఖ్యంగా మిథునరాశి వారు వారి యొక్క ప్రేమజీవితంలో వారికి వ్యక్తిగతం గా ఎదురయ్యే సమస్యలను అధికమించడంలో ఈ కార్డు కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగా స్థిరత్వం సాధించడానికి మిథునరాశి వారు ఎక్కువగా కష్టపడుతుంటారు. ఈ కార్డు సహాయం ద్వారా వారు చేసే ప్రతి పనిలో సమతుల్యత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో వైపు దీర్ఘకాల విషయాలను దృష్టిలో ఉంచుకొని ఏ నిర్ణయమైనా తీసుకోవడం మంచిది.

కర్కాటకం :

కర్కాటకం :

కర్కాటకరాశి వారికి " చారియట్ కార్డు ( రథం ) " ప్రాతినిధ్యం వహిస్తుంది. కర్కాటకం రాశివారు సంరక్షణకు ఎక్కువగా పరితపిస్తుంటారు. వారి జీవితంలో ఎదురయ్యే మార్పుల వల్ల వచ్చి వెళ్లే భావోద్వేగాలను నియంత్రించడంలో ఈ కార్డు ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. ఆ మార్పులన్నీ కాలక్రమంలో సర్దుమణుగుతాయి. కర్కాటకం రాశివారు మానసిక సామర్ధ్యాలను వినియోగించడంలో సిద్దహస్తులు. ఇందుచేత వారు జీవితంలో వారి యొక్క శక్తులన్నీ కేంద్రీకరించగలుగుతారు.

సింహం :

సింహం :

"ది స్ట్రెంగ్త్ కార్డు ( శక్తివంతమైన కార్డు ) సింహ రాశివారికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ కార్డు సింహరాశి వారి యొక్క శారీరిక శక్తిని తెలియజేస్తుంది. కానీ, సమయానుగుణంగా వారి యొక్క వ్యక్తిగత శక్తికి పరీక్షలు పెడుతూనే ఉంటుంది అనే విషయాన్ని ఈ చిహ్నం తెలియజేస్తుందని సలహా ఇస్తున్నారు.

కన్య :

కన్య :

కన్య రాశివారికి "ది హెర్మిట్ ( సన్యాసి) కార్డు" ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ రాశివారిని బాహ్యప్రపంచం ఎంత నిర్వీర్యం చేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ రాశివారు వారి చుట్టూ ఉన్న శక్తులకు సున్నితంగా వ్యవహరిస్తారు. ఏదైనా విషయమై తెలుసుకోవడానికి ఇతరుల పై ఆధారపడుతుంటారు. అత్యుత్తమ ఫలితాలు గనుక రావాలి అని అనుకున్నట్లైతే అంతరాత్మ ఏమి చెబుతుందో అది వినాలి.

తుల :

తుల :

ఈ రాశివారికి " ది జస్టిస్ (న్యాయనిర్ణేతమైన ) కార్డు " ప్రాతినిధ్యం వహిస్తుంది. వ్యక్తులు ఎవరైతే అన్యాయంగా మరియు జీవితంలో అంత క్రమశిక్షణ లేకుండా మెలుగుతుంటారో అలాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు ఆ సమయాల్లో ఎలా వారితో వ్యవహరించాలి అనే విషయాన్ని ఇది నేర్పిస్తుంది. వారు తీసుకొనే నిర్ణయాలతో సామరస్యంగా ఎలా జీవితాన్ని సాగించాలి అనే విషయం నేర్చుకోవాలి.

వృశ్చికం :

వృశ్చికం :

ఈ రాసి రాశి వారికి " ది డెత్ ( చావు) కార్డు" ప్రాతినిధ్యం వహిస్తుంది. మరణం ఎలా సంభవిస్తుంది అనే ప్రక్రియను ఉద్దేశించి ఇది తెలియజేస్తుంది. సరికొత్త జీవితాన్ని రూపాంతరం చెందనీయటంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. వారి యొక్క గతానంత విడిచిపెట్టి మరో సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎంతగానో దోహదపడుతుంది. వారిలో ఉన్న భయాలను మరియు వారి యొక్క జీవితంలోకి వచ్చే అనవసరమైన వ్యక్తులను చూసి చూడనట్లు వదిలివేయడం మంచిది.

ధనుస్సు :

ధనుస్సు :

ఈ రాశివారికి " ది టెంపరన్స్ ( నిగ్రహ ) కార్డు " ప్రాతినిధ్యం వహిస్తుంది. ధనుస్సు రాశి వారి జీవితంలో వారికి ఎదురుకాబోయే కష్టాలను తెలియజేస్తుంది. ఏదైనా ఒక సాధారణ స్థితికి చేరుకొని మీ యొక్క తీర్పుని ఆధారంగా నిజాలను సమతుల్యతతో చూడటం మంచిది అని సలహా ఇష్టున్నారు.

మకరం :

మకరం :

ఈ రాశివారికి " ది డెవిల్ ( దెయ్యం ) కార్డు " ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ రాశివారు వారి యొక్క నీడను, వారిని వారే మరియు వారిలో ఉన్న వ్యతిరేకతను వారే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వ్యక్తులను ఏదైతే ఎదగనీయకుండా అలానే పట్టి ఉంచుతుందో, వాటి యొక్క కబంద హస్తాల నుంచి బయటకు రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అన్ని విషయాలను పెద్దవిగా చేసి పట్టించుకోకుండా, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం నేర్చుకోవాలి.

కుంభం :

కుంభం :

ఈ రాశివారికి " ది స్టార్ ( నక్షత్రం ) కార్డు" ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ కార్డు నిజానికి మరియు ఊహలకు మధ్య ఉన్న తేడాను వివరించి సమతుల్యతతో ఎలా వ్యవహరించాలో తెలియజేస్తుంది. గుంపులో ఉన్న అందరి వ్యక్తులలో వీరు ఎంత ప్రత్యేకమో అనే విషయమై గుర్తుచేస్తుంది మరియు ఎప్పుడైతే చీకట్లు వారిని కమ్ముకుంటాయో అలాంటి సమయాల్లో వెలుగుని వారంతట వారే వెలిగించుకొని తిరిగి ప్రకాశించాలి.

మీనం :

మీనం :

మీనరాశి వారికి " ది మూన్ ( చంద్ర ) కార్డు " ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది ఊహలకు, ఆదర్శ భావాలకు మరియు అచేతన స్థితికి సంబంధించినది. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడైతే చాలా ఎక్కువసేపు కలల్లో విహరిస్తూ విశ్రాంతిని తీసుకుంటుంటారో, అటువంటి సమయంలో వారికి మానసికంగా ఎదురయ్యే విషయాలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ వ్యక్తులు వారి యొక్క శరీరం నుండి వెలువడే శక్తులు ఏమైతే చెబుతాయో వాటిని శ్రద్దగా వినాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అంతేకాకుండా వారి మార్గంలో వారికి ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ముందుకు సాగాలి.

English summary

Tarot Card That Defines Your Zodiac Sign The Best

Tarot cards and Zodiac signs are not interrelated; however, there is a certain connection that strongly binds the two. Few cards represent the energies of the 12 signs in Astrology. Here are the tarot cards that best define the zodiac signs.
Story first published:Monday, November 27, 2017, 19:33 [IST]
Desktop Bottom Promotion