పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఎలా వ్యవహరించాడో తెలిసి అందరూ షాక్!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

లైంగిక వేధింపులు ఈ మధ్య కాలంలో ఎక్కువయిపోయాయి, మరీ మితిమీరి పోతున్నాయి. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని వికృత రూపం దాలుస్తున్నాయి. చాలసందర్భాల్లో, లైంగిక వేధింపులకు పాల్పడేవారు, లైంగిక వేధింపులను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతక్ష ప్రసారం చేస్తున్నారు. లేదా వాళ్ళు చేసిన వికృత చేష్టలను ఫోటులు లేదా వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు.

సామాజిక మాధ్యమాలు విస్తృతమైపోవడంతో ఒక విషయం క్షణాల్లో లక్షలమందికి చేరిపోతోంది. ఇలా అంతర్జాలంలో పెట్టడం వల్ల లైంగిక దాడి భాదితులకు విపరీతమైన నష్టం కలుగుతోంది.

అశ్లీల చిత్రాలను చూడటం ఇప్పుడే ఆపేయండి, ఎందుకంటే?

అలాంటి వికృత సంఘటన ఒకటి భారతదేశంలో చోటు చేసుకుంది. అది కూడా ఒక ఉపాధ్యాయుడు, తాను చదువు చెప్పే విద్యార్థులతో వ్యవహరించిన తీరు చాల అసభ్యకరంగా, మాటలతో చెప్పలేని విధంగా తన స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు.

ఆ ఉపాద్యాయుడు, తన విద్యార్థులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే,

ఎక్కడ జరిగిందంటే :

ఎక్కడ జరిగిందంటే :

అది అస్సాం రాష్ట్రంలోని కట్లీచెర్ర అనే చిన్న ఊరు ఉంది. అక్కడ ఒక మోడల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు, తాను చదువు చెబుతున్న విద్యార్థినిలతో కలిసి ఒక ఫోటో షూట్ నిర్వహించాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలన్నింటినీ సామాజిక మాధ్యమాల్లో పెట్టేసాడు.

ఆ ఫోటోలు ఎందుకు వైరల్ గా మారాయంటే :

ఆ ఫోటోలు ఎందుకు వైరల్ గా మారాయంటే :

ఆ ఫోటోలలో ఈ ఉపాధ్యాయుడు, ఆ అమ్మాయిలను కౌగిలించుకొని, ముద్దులు పెట్టుకుంటూ ఇలా ఎన్నో వికృత చేష్టలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇవి క్షణాల్లో అంతర్జాలంలో దావనంలా వ్యాపించి ఎంతో మందికి చేరిపోయాయి. వీటిని చుసిన ఎంతో మంది, అభం శుభం తెలియని ఆ అమ్మాయిలతో ఆ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ ఫోటోలపై , అందుకు కారణమైన ఉపాధ్యాయుడి పై ఎంతో మంది పిర్యాదు కూడా చేశారు.

ఈ యోగా గురువు మహా ఘటికుడు, రోజుకు 5 సార్లు సంభోగిస్తాడు!

ఇది మొదటి సారి కాదు :

ఇది మొదటి సారి కాదు :

ఈ ఉపాధ్యాయుడు ఇలా తప్పు చేయడం ఇది మొదటి సారి కాదు, ఇంతక ముందు కూడా ఒక మహిళతో చాలా అసభ్యకరంగా వ్యవహరించాడు. అతడికి బుద్ది రావాలని అప్పుడు కొంత మంది అతన్ని చితకొట్టారు. దాంతో పాటు అతను చేసిన పనికి శిక్షగా ఒక వేలును కూడా తీసి వేశారు. అయినా కూడా ఈ నీచుడిలో మార్పు రాకపోవడం గమనార్హం.

అసలు సమాజం ఎటు పోతుంది :

అసలు సమాజం ఎటు పోతుంది :

ఇలాంటి వికృత చేష్టలకు ఆ ఉపాధ్యాయుడు తరుచూ పాల్పడటంతో ఆ పాఠశాల యాజమాన్యం పై ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అసలు ఆ ఉపాధ్యాయుడికి, తన గతం గురించి తెలుసు కోకుండా ఎలా ఉద్యోగం ఇచ్చారు ? ఇంత జరుగుతున్నా, అతని పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? అంటూ ప్రశ్నించారు.

ఉపాధ్యాయులంటే, రేపటి భవిష్యత్తుకు పునాదులైన పిల్లలను తీర్చిదిద్దే వాడే కానీ, వాళ్ల భవిష్యత్తుతో చెలగాటం ఆడేవాడు కాదు. ఇలాంటి ఉపాధ్యాయుల్ని చూస్తుంటే, తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని, రేపొద్దున్న సమాజం ఎటుపోతుందో అని ఆందోళన వ్యక్తం చేసారు తల్లిదండ్రులు.

ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి :

ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి :

చాలా మంది ఆ ఉపాధ్యాయుడితో పాటు ,ఆ పాఠశాలను కూడా తీవ్రంగా తప్పుపడుతూ విమర్శిస్తున్నారు, తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వీళ్ళ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎదురు చూస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని ఈక్రింది కామెంట్ బాక్స్ లో రాయండి.

English summary

Teacher Takes Intimate Pictures With Student & Posts Them Online!

These images will make your blood boil for sure.
Subscribe Newsletter