నోట్ల ర‌ద్దుకు ఏడాది... దేశంలో చోటుచేసుకున్న భారీ మార్పులివే!

By: sujeeth kumar
Subscribe to Boldsky

దేశానికి కొత్త రూలింగ్ పార్టీ వ‌చ్చిన ప్ర‌తిసారి కొత్త ఐడియాలు, వ్యూహాల‌తో వ‌స్తుంటారు. లంచ‌గొండిత‌నాన్ని అణ‌చివేసేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే భార‌తీయులు నోట్ల ర‌ద్దును క‌ల‌లో కూడా వూహించ‌లేదు. ప్ర‌పంచంలో బ‌హుశా మ‌న దేశ‌మే కావొచ్చు ఎక్కువ‌గా నోట్లపై ఆధార‌ప‌డేది. ప్ర‌తి ఒక్క‌రూ గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. ఇదంతా డీమానిటైజేష‌న్ వ‌ల్లే!

గ‌తేడాది న‌వంబ‌ర్ 8న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ విప్ల‌వాత్మ‌క‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ఆ రోజు రాత్రి 10 గంట‌ల‌కు రూ.500, రూ.1000 నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌క‌ట‌న చేశారు. ఇక‌పై అవి చెల్ల‌వు, వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిందిగా చెప్పారు.

మనీ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..

పెద్ద నోట్ల ర‌ద్దు జ‌రిగి ఏడాది గ‌డిచింది. ఈ ఏడాది స‌మ‌యాన్ని ప్ర‌జ‌ల స్పంద‌న ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం..

దిగువ త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు...

దిగువ త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు...

రైతులు, కూర‌గాయ‌ల‌ను అమ్ముకునేవారు, చిన్న తోపుడు బ‌ళ్లున్న‌వారు ఇలా ప్ర‌తి ఒక్క‌రూ పెద్ద నోట్ల ర‌ద్దు బాధితులే. చాలా మంది వ్య‌క్తుల‌కు క‌నీసం బ్యాంకు ఖాతా కూడా లేదు.

దేశం క్యాష్‌లెస్‌గా మారింది!....

దేశం క్యాష్‌లెస్‌గా మారింది!....

పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం అప్ప‌టిక‌ప్పుడే తీసుకోవ‌డంతో ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌త్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించ‌సాగారు. బ్యాంకుల బ‌య‌ట జ‌నాలు బారులు తీరి క‌నిపించిన సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. ఇక ఏటీఎంల‌న్నీ బోసిపోయి క‌నిపించిన దాఖ‌లాలు. చాలా మంది నిస్స‌హాయంగా ఉండిపోయారు. అయినా లంచ‌గొండిత‌నాన్ని పోరాడ‌టంలో నోట్ల ర‌ద్దు ఏ మేర‌కు స‌హ‌క‌రించిందో తెలియ‌దు!

మిశ్ర‌మ స్పంద‌న‌...

మిశ్ర‌మ స్పంద‌న‌...

కొంత మంది ఈ నిర్ణ‌యాన్ని హ‌ర్షించారు. మ‌రి కొంత మందేమో సామాన్య జ‌నాలు బాగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వాన్ని దుయ్య‌బ‌ట్టారు.

ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు...

ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు...

డీమానిటైజేష‌న్ లాంటి పెద్ద నిర్ణ‌యం తీసుకునేట‌ప్పుడు ప్ర‌భుత్వం పేద ప్ర‌జ‌ల‌ను, అణ‌గారిన వ‌ర్గాలను, దిగువ శ్రేణి త‌ర‌గ‌తిని ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకోలేద‌ని ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

చోటుచేసుకున్న మార్పులు..

చోటుచేసుకున్న మార్పులు..

పాత నోట్ల‌ను బ్యాంకు ఖాతాలో మార్చుకోవ‌డ‌మో, లేదా దానికి బ‌దులు రూ.100 నోట్ల‌ను తీసుకోవ‌డ‌మో చేయాల‌ని ప్రభుత్వం సూచించింది. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం చెప్పింది త‌ప్ప ఏమీ చేయ‌లేక‌పోయారు. కొత్త నోట్ల‌ను విడుద‌ల చేశారు. కొత్త రూ.2000 నోటు, రూ.500 నోటు వ‌చ్చాయి. ఈ మ‌ధ్యే రూ.200నోటు కూడా ప్ర‌వేశ‌పెట్టారు. రూ.2వేల నోటుకు చిల్ల‌ర దొర‌క‌డం గ‌గ‌న‌మై ప్ర‌జ‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారు.

మన కరెన్సీ నోట్ల పై గాంధీజీ బొమ్మ ఉండటం వెనుక అసలు కారణం ఇదే...!

మంచి కూడా జ‌రిగింది...

మంచి కూడా జ‌రిగింది...

నోట్ల ర‌ద్దుపై ఎన్నో అప‌వాదులు. ప్ర‌పంచ మీడియా కూడా ఇది ఫెయిల్ అయ్యింద‌ని కొన్ని సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఒకంద‌కు నోట్ల ర‌ద్దు మంచిదే అయ్యింద‌ని కొంద‌రు విశ్లేష‌కులు భావిస్తున్నారు. పేద ప్ర‌జ‌లు క్యాష్ లెస్ బాట‌ను ప‌ట్టారు. సొంతంగా బ్యాంకు ఖాతాలు తెరిచారు, డిజిట‌ల్ వ్యాలెట్ల‌ను ఉప‌యోగించ‌నారంభించారు. పేటీఎమ్ లాంటి సంస్థ‌లు కూడా ప్ర‌జ‌ల‌కు డిజిట‌ల్ క్యాష్ దిశ‌గా బాగానే స‌హ‌క‌రించాయి.

మీరేమంటారు... నోట్ల ర‌ద్దు మ‌న దేశంలో స‌క్సెస్ ఆ.. ఫెయిల్యూర్ ఆ? మీ అమూల్య‌మైన అభిప్రాయాల‌ను కామెంట్ సెక్ష‌న్‌లో రాయండి.

English summary

Life After Demonitisation!

Demonetization was done for the betterment of the nation, but has it happened?
Subscribe Newsletter