అత‌డి చెవిలో 26 బొద్దింక‌లు కాపురం పెట్టేశాయి!

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

మ‌నిషి దేహం బ‌య‌టి వ‌స్తువు ఎలాంటిదైనా భ‌రించ‌లేదు. అది ముల్లు కావొచ్చు, గుండు పిన్ను కావొచ్చు. ఒక‌టే బాధ‌, నొప్పితో తాళ‌లేకపోతాం.

అంత సుకుమార‌మైన ఈ శ‌రీరంలో ఒక కీట‌కం కాపురం పెడుతుందంటే ఎలా ఉంటుందో ఊహించ‌గ‌ల‌రా? విన‌డానికే వెగ‌టు పుట్టేలా ఉంది క‌దూ! ఐతే కొంద‌రి శ‌రీరాల్లో కీట‌కాలు బ‌య‌ల్ప‌డిన కేసులు ఎన్నో న‌మోద‌య్యాయి.

cockroaches in ear

ఇటీవ‌ల చైనాలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక డాక్ట‌ర్ల బృందం ఒక మ‌నిషి చెవిలో 26 బ‌తికున్న బొద్దింక‌ల‌ను క‌నుగొన్నారు...

చెవి నొప్పి అంటూ వెళితే...

చెవి నొప్పి అంటూ వెళితే...

పేరు చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌ని వ్య‌క్తి కొంత కాలంగా చెవి నొప్పి తో బాధ‌ప‌డుతున్నాడు. వ‌న్ ఫైన్ డే డాక్ట‌ర్‌ను క‌లిసేందుకు వెళ్లాడు. చెవిలో ఒకటే పోటు. దీంతో శబ్దాలు కూడా సరిగ్గా వినిపించేవి కాదు.

ప‌రీక్ష చేసి చూసి...

ప‌రీక్ష చేసి చూసి...

డాక్ట‌ర్ ప‌రీక్ష చేసి చూసిన‌ప్పుడు ఏదో త‌మ వైపు చూస్తున్న‌ట్టుగా అనిపించింది. చెవిలో మొత్తానికి ఏదో కీట‌కం ఉంద‌ని భావించి లోతుగా ప‌రీక్షించారు. ఆశ్చ‌ర్యపోవ‌డం డాక్ట‌ర్ల వంతైంది. అక్క‌డ బ‌తికున్న బొద్దింక‌ల కుటుంబం రాజ్య‌మేలుతుంది.

వెంట‌నే ఆప‌రేష‌న్‌కు..

వెంట‌నే ఆప‌రేష‌న్‌కు..

వెంట‌నే అత‌డికి అన‌స్థీషియా ఇచ్చి డాక్ట‌ర్లు ఒక్కొక్క బొద్దింక‌ను చెవిలోంచి తీయ‌డం మొద‌లుపెట్టారు. స‌ర్జ‌రీ ముగిశాక మొత్తం 26 బ‌య‌ట‌ప‌డ్డాయి. యాక్‌! త‌ల్చుకుంటే వెగ‌టుగా ఉంది క‌దూ! బాధాక‌ర‌మైన విష‌యం ఏమిటంటే అన్నీ బ‌తికే ఉండ‌డం కాదు బాగా యాక్టివ్‌గా ఉన్నాయి.

ఒక ఆడ బొద్దింకే చేసింది

ఒక ఆడ బొద్దింకే చేసింది

ఆ త‌ర్వాత డాక్ట‌ర్లు ఏం నిర్ధార‌ణ‌కు వ‌చ్చారంటే.. 0.3 అంగుళాల పొడ‌వున్న ఒక ఆడ బొద్దింక మ‌నిషి చెవిలోకి దూరింది. అక్క‌డ గుడ్లు పెట్టింది. అక్క‌డ వెచ్చ‌గా ఉండ‌డంతో గుడ్లు పొదిగి పిల్ల‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.

40 గుడ్లు పెట్టేసింది

40 గుడ్లు పెట్టేసింది

కొన్ని స్ట‌డీస్ ఆధారంగా ఒక ఆడ బొద్దింక ఒక గూటిలాంటిదాన్లో ఏకంగా 40 గుడ్ల‌ను పెట్టేయ‌గ‌ల‌దు. అవ‌న్నీ పెద్ద‌య్యేందుకు 3 లేదా 4 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. అత‌డు చాలా అదృష్ట‌వంతుడు తొంద‌ర‌గా స‌మ‌స్య‌ను గుర్తించ‌గ‌లిగాడు.

స‌రైన స‌మ‌యానికి రాక‌పోయి ఉంటే..

స‌రైన స‌మ‌యానికి రాక‌పోయి ఉంటే..

స‌రైన స‌మ‌యానికి రోగి గ‌నుక ఆసుప‌త్రికి రాన‌ట్ట‌యితే అత‌డి చెవి పూర్తిగా నాశ‌న‌మైపోయి ఉండేద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

ఇలాంటి విచిత్ర‌క‌ర‌మైన సంఘ‌ట‌న గురించి మీ అభిప్రాయ‌మేమిటో కింద కామెంట్ సెక్ష‌న్ లో పేర్కొన‌గ‌ల‌రు.

English summary

When 26 Cockroaches Were Found In A Man's Ear!

A man complained about ear pain and when doctors examined his ear, they got a shock of their lives when they saw something staring back at them! On closer examination, it was revealed that the man had 26 cockroaches dwelling in his ear!
Story first published: Thursday, December 14, 2017, 15:00 [IST]