దీపావళి సందర్భంగా చేసే చేతబడి గురించి నమ్మలేని నిజాలు!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

దీపావళి రోజు చాలా సంఘటనలు చోటుచేసుకుంటాయి. సంవత్సరంలో ఒకసారి వచ్చే ఈ పండగ పర్వదినాన ప్రజలందరూ తమకు ఇష్టమైన వాళ్లకు బహుమతులు ఇస్తుంటారు మరియు ఆనందంతో పటాసులు పేలుస్తుంటారు. అంతేకాకుండా ఈ పర్వదినం రోజున ప్రజలందరూ తమ కుటుంబసభ్యులతో కలిసి వేడుక జరుపుకుంటారు. వీటన్నిటి మధ్య కొన్ని ఆచారాలు మరియు అలవాట్లు చుట్టూ పక్కల జరుగుతుంటాయి. కానీ, చాలామంది ప్రజలు వీటి గురించి తెలిసినా పట్టించుకోరు. దీపావళి సందర్భంగా చాలా చోట్ల చేతబడి అనేది ఎంతో కాలంగా జరుగుతుంది. వాటి వెనుక ఉన్న నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

చేతబడులు చేయడంలో ఇండియా ఫస్టా...?

చాలా మంది ప్రజలకు ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం గురించి తెలియదు, సరైన అవగాహనా కూడా లేదు. ఈ చేతబడి ఎందుకు ఈ సమయంలోనే చేస్తారు అనే విషయాల గురించి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం....

క్రూరమైన జంతువుల కోసం గిరాకీ పెరుగుతుంది:

క్రూరమైన జంతువుల కోసం గిరాకీ పెరుగుతుంది:

దీపావళి దగ్గరపడుతున్న కొద్దీ గుడ్లగూబ, విషపూరితమైన సర్పాలు మరియు ప్రత్యేకంగా ఇరవై గోర్లు కలిగిన తాబేళ్లకు విపరీతంగా గిరాకీ పెరుగుతుంది. ఈ జంతువులన్నింటిని ఉపయోగించి ప్రజలు మంత్ర తంత్రాల సహాయంతో ఏవేవో పూజలు చేసేస్తుంటారు మరియు ఆచారాలు పాటిస్తుంటారు. ఈ జంతువులను ఉపయోగించి ఎవరైతే ఆచార వ్యవహారాలను పాటిస్తుంటారో వారికి భవిష్యత్తు ఎంతో బాగుంటుందని చాలామంది నమ్మకం.

అటవీ శాఖ ఈ సమయంలో విపరీతమైన అధిక హెచ్చరికలను జారీచేస్తుంది :

అటవీ శాఖ ఈ సమయంలో విపరీతమైన అధిక హెచ్చరికలను జారీచేస్తుంది :

చాలామంది ప్రజలకు ఇటువంటి ఆచారం ఒకటి ఉందని లేదా కొంతమంది ప్రజలు వీటిని ఆచరిస్తున్నారనే విషయం కూడా తెలీదు. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అటవీ శాఖ అధికారులు తీవ్రమైన హెచ్చరికలను జారీ చేస్తుంటారు. అడవిలో ఉండే కాపలాదారులు మరియు అటవీ శాఖకు సంబంధించిన అధికారులు జంతువుల ప్రాణాలు సంరక్షించడానికి ఈ సమయం లో ఎక్కువగా ప్రాధాన్యతలను ఇస్తుంటారు. అందుకు అనుగుణంగా ఎన్నో చర్యలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా స్మగ్లర్ ( రహస్య వ్యాపారి ) లను పట్టుకోవడానికి అధికారులు ఎన్నో వ్యూహాలను రచిస్తుంటారు.

అధికారులు ఏమి చెబుతున్నారంటే :

అధికారులు ఏమి చెబుతున్నారంటే :

అంతరించిపోతున్న జంతువులను సంరక్షించడానికి ఏర్పడిన జంతు సంరక్ష సంస్థ అయిన ఎర్త్ కంజర్వేషన్ టీమ్ చైర్మన్ డాక్టర్ అభిషేక్ సింగ్ ఏమని చెబుతున్నారంటే, దీపావళి సమీపిస్తున్న కొద్దీ కొన్ని రకాల జంతువులకు విపరీతమైన గిరాకీ పెరుగుతుంది. అందుకు కారణం వాటిని కొన్ని మంత్ర తంత్రాల్లో భాగంగా వినియోగిస్తున్నారు. " అంతే కాకుండా ముఖ్యంగా గుడ్లగూబలను దీపావళి రాత్రి బలి ఇవ్వాలని కొందరు, మరికొంత మంది దీపావళి రోజున గుడ్లగూబను చాలా మందికి చూపించడం వల్ల డబ్బు చాలా త్వరగా వస్తుందని భావిస్తారు. " అని అతడు చెప్పుకొచ్చాడు.

చేతబడి అంటే ఏమిటి ? ఇది నిజంగా ఉందా ?

గుడ్లగూబలకు విపరీతమైన గిరాకీ ఉంది :

గుడ్లగూబలకు విపరీతమైన గిరాకీ ఉంది :

ఏ గుడ్లగూబలు అయితే 2.5 కిలోల కంటే ఎక్కువగా తూగుతాయో, దేని కళ్ళు అయితే ఎరుపుగా ఉంటాయో, దేని యొక్క చెవులు కొద్దిగా గద్దకు ఉన్నట్లు ఉంటాయో లేదా చెక్క రంగులో ఏ గుడ్లగూబ ఉంటుందో ఇలా విభిన్న రకాల గుడ్లగూబలకు విపరీతమైన గిరాకి ఉంటుంది. ఇలాంటి వాటిని కొనుక్కోవడానికి కొంతమంది డబ్బు ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనకాడరు. కొన్ని సందర్భాల్లో ప్రజలు అధికారులను మాకు గుడ్లగూబలను ఏదైనా జాతీయ ఉద్యానవనం నుండి తీసుకురమ్మని అడుగుతుంటారు. అంతేకాకుండా, రెండు రోజుల తర్వాత వాటికి ఎటువంటి నష్టం కలిగించకుండా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తామని కూడా చెబుతుంటారు. ఏ వ్యక్తులైతే పేరు ఎక్కువగా సంపాదించాలని భావిస్తుంటారో అటువంటి వారి నుండే ఇటువంటి విన్నపాలు అధికంగా అందుతూ ఉంటాయి.

ఇలాంటి వెర్రి విషయాలను విన్న మీకు ఏమనిపిస్తుంది ?

ఇలాంటి వెర్రి విషయాలను విన్న మీకు ఏమనిపిస్తుంది ?

ఈ పవిత్రమైన సమయంలో ఇలాంటి ఆచారవ్యవహారాలు పాటించడం పై మీ అభిప్రాయం ఏమిటి ? వీటిని పూర్తిగా నిషేధించాలా ? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వార్తలు తెలుసుకోవాలంటే మా వెబ్ సైట్ ని తరచూ గమనిస్తూ ఉండండి.

English summary

Shocking Reality Of Black Magic Being Practiced During Diwali

Though most of the people are not aware of what happens, we are here to reveal about the practice of black magic that happens around this time! So read on to find out more...
Story first published: Tuesday, October 17, 2017, 11:00 [IST]
Subscribe Newsletter