ఒక్కో రాశివారికి ఒక ప్ర‌త్యేక శ‌క్తి చ‌క్రం.. అదేం తెలియ‌జేస్తుందంటే...

By: sujeeth kumar
Subscribe to Boldsky

రాశి ఫ‌లాల గురించి, వాటి వ‌ల్ల మ‌నిషి ప్ర‌వ‌ర్త‌న తెలుసుకోవ‌డం చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది క‌దూ! వ్యక్తుల ల‌క్ష‌ణాల‌ను తెల‌ప‌డంలో రాశులు చాలా వ‌ర‌కు తోడ్ప‌డ‌తాయి. ప్ర‌తి రాశికి ఒక ప్ర‌త్యేక‌మైన చ‌క్రం అంటూ ఉంటుంది.

చ‌క్ర సంస్కృత ప‌దం, దీన్ని శ‌క్తి చ‌క్రంగా అభివ‌ర్ణిస్తారు. ఈ చ‌క్రం మ‌న దేహానికి, మంచి ఆరోగ్యానికి, బ‌లానికి, తేజ‌స్సుకు సంకేతాలు.

మ‌న మ‌న‌స్సాక్షిని, మ‌న‌సును, ఆత్మ‌ను ఈ చ‌క్రాలు ప్రభావం చేయ‌గ‌ల‌వు. అందుకే ఈ రాశి చ‌క్రాల గురించి తెలుసుకోవ‌డం ఎంతో ముఖ్యం. మీ రాశి చ‌క్రం మీ గురించి ఏం చెపుతుందో తెలుసుకోండి.

శరీరానికి ఎనర్జీ ఎలా వస్తుంది ? చక్రాలకు, ఎనర్జీకి సంబంధమేంటి ?

మేషః మూడో చ‌క్రం

మేషః మూడో చ‌క్రం

సోలార్ ప్లెక్స‌స్ చ‌క్ర‌గా దీన్ని పిలుస్తారు. జ్యోతిష శాస్త్రం ప్ర‌కారం మేష‌రాశి వారికి ఈ చ‌క్రం ప్ర‌ధాన కేంద్ర బిందువుగా ప‌నిచేస్తుంది. ఈ చ‌క్రం బొడ్డుకు కాస్త పై భాగంలో ఉంటుంద‌ని చెప్తారు. ఊహ‌కు, అతీంద్రియానికి దీంతో ద‌గ్గ‌ర సంబంధం ఉంటుంది.

వృష‌భః నాలుగో చ‌క్రం

వృష‌భః నాలుగో చ‌క్రం

వృష‌భ రాశివారికి నాలుగో చ‌క్రం చాలా ముఖ్యం. మ‌న‌సు చ‌క్రంగా దీన్ని పిలుస్తారు. వృష‌భం, మ‌న‌సు రెండూ శుక్రుడుకి ప్రీతిపాత్రం. ఈ చ‌క్రం వ‌ల్ల సాటి వారిపై జాలి క‌లిగే గుణం ఏర్ప‌డుతుంది. ఈ చ‌క్రం వ‌ల్ల ఇత‌రుల‌తో ప్రేమ బంధాన్ని పెంచుకోగ‌లగుతారు. దీని వ‌ల్ల ఆర్థికంగాను ల‌బ్ది చేకూరుతుంది.

సుదర్శన చక్రం ఎలా పుట్టింది ? ఆ చక్రం విష్ణువుకే ఎందుకు ?

మిధునంః ఐదో చ‌క్రం

మిధునంః ఐదో చ‌క్రం

బుధ‌గ్ర‌హం ఆధీనంలో మిధున‌రాశివారు ఉంటారు. కాబ‌ట్టి ఈ రాశివారికి ప్ర‌ధాన శ‌క్తి ఈ చ‌క్రం నుంచే వ‌స్తుంది. ఈ చ‌క్రం క‌ల‌వారు చాలా మంది న‌మ్మ‌కాన్ని పొందుతారు. వారి ఐడియాలు, అభిప్రాయాల వ‌ల్ల చాలా మంది ఈ రాశిచ‌క్రం గ‌ల‌వారికి ఎక్కువ‌గా ప్ర‌భావితుల‌వుతారు.

క‌ర్కాట‌కంః ఆరో చ‌క్రం

క‌ర్కాట‌కంః ఆరో చ‌క్రం

క‌ర్కాట‌కం వారికి ఆరో చ‌క్రం వ‌ల్ల‌ ప్ర‌భావం ఉంటుంది. వ్య‌క్తుల ఆత్మ‌నే కేంద్రంగా చేసుకొని ఈ చ‌క్రం ప‌నిచేస్తుంది. చంద్రుడి ప్ర‌భావం ఈ రాశిచ‌క్రం వారికి ఉంటుంది. ఈ రాశిచ‌క్రంవారికి దూర‌దృష్టి బాగా ఉంటుంది.

సింహః ఏడో చక్రం

సింహః ఏడో చక్రం

ఏడో చ‌క్రంతో సింహ‌రాశివారు అనుబంధ‌మై ఉంటారు. దీనిని కిరీట చ‌క్రంగా కూడా పిలుస్తారు. సూర్యుడు అధీనంలో ఈ రాశిచ‌క్రం వారు ఉంటారు. త‌ల పైన ఉండే శూన్యం చాలా శ‌క్తిమంతంగా భావిస్తారు. ఇది స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో స‌మ‌ర్థ‌వంతంగా తోడ్ప‌డుతుంద‌ని చెప్తారు.

క‌న్యః ఐదో చ‌క్రం

క‌న్యః ఐదో చ‌క్రం

దీన్ని కంఠ చ‌క్రంగాను పిలుస్తారు. క‌న్య‌రాశిలో పుట్టిన‌వారు వారి గొంతు, కంఠం లేదా స్వ‌రం బాగుంటే చాలా బెట‌ర్‌గా ఫీల‌వుతారు. క్లుప్తంగా వాస్త‌వాల‌ను తెలియ‌జెప్ప‌డంలో వీరు నేర్ప‌రులు. ప్ర‌జ‌ల్లో స‌మ‌ర్థంగా మాట్లాడ‌డంలోనే వీరి అంత‌ర్గ‌త శ‌క్తి దాగుంది.

తులః నాలుగో చ‌క్రం

తులః నాలుగో చ‌క్రం

శుక్ర గ్ర‌హం ఆధ్వ‌ర్యంలో ఈ రాశిచ‌క్రం వారు ఉంటారు. మ‌న‌సుకు సంబంధించినది ఈ చ‌క్రం. ఇత‌రుల‌తో బ‌ల‌మైన బంధాన్ని ఏర్ప‌ర్చుకునేందుకు ఈ చ‌క్రంవారు ఉప‌యోగ‌ప‌డ‌తారు. ఇత‌రుల ప‌ట్ల అమిత‌మైన ప్రేమానురాగాల‌ను క‌లిగి ఉంటారు. సృజ‌నాత్మ‌క‌మైన చ‌ర్య‌ల్లో వీరు ఎక్కువ‌గా పాల్గొంటారు.

వృశ్చికః మూడో చ‌క్రం

వృశ్చికః మూడో చ‌క్రం

సోలార్ ప్లెక్స‌స్ చ‌క్ర‌గా కూడా దీన్ని పిలుస్తారు. బొడ్డుకు పై భాగంలో ఈ చక్రం ఉంటుంది. అంగారకుడి ఆధీనంలో ఈ రాశిచ‌క్రం వారు ఉంటారు. ఇత‌ర రాశుల‌వారితో పోలిస్తే వారికి సెక్స్ కోరిక‌లు ఎక్కువ‌.

ధ‌నుస్సుః రెండో చ‌క్రం

ధ‌నుస్సుః రెండో చ‌క్రం

ఈ రాశిచ‌క్రాన్ని సాక్ర‌ల్ చ‌క్రంగా కూడా పిలుస్తారు. ఇది స‌రిగ్గా నాభిలో ఉంటుంది. గురు గ్ర‌హం ఆధీనంలో వీరు ఉంటారు. అంతులేని ఆశావాదం వీరిలో ఆవ‌హిస్తుంది. సెక్స్ కోరిక‌లు, పిల్ల‌లు క‌లగాల‌నే కోరిక‌లు ఈ చ‌క్రం వారికి ఎక్కువ‌గా ఉంటుంది.

మ‌క‌రంః మొద‌టి చ‌క్రం

మ‌క‌రంః మొద‌టి చ‌క్రం

ఇది అత్యంత దూరంగా క‌నిపించే చ‌క్రం. దీన్ని రూట్ చక్ర‌గా కూడా పిలుస్తారు. ఇది శ‌క్తి కేంద్ర బిందువుగా ప‌నిచేస్తుంది. స్థిర‌మైన చింత‌న‌తో ఉండేలా చేయ‌గ‌ల‌దు.

కుంభః మొదటి చ‌క్రం

కుంభః మొదటి చ‌క్రం

కుంభ రాశివారికి మొద‌టి చ‌క్రం చాలా ప్ర‌భావం చూపించ‌గ‌ల‌దు. సంద‌ర్భాన్ని అర్థం చేసుకోవ‌డంలోనే వీరి బ‌లం దాగుంది. దీని వ‌ల్ల వీరికి వ్య‌క్తిగ‌తంగాను బాగా లాభం చేకూరుతుంది. ఇత‌రులు మీ ఆధీనంలో ఉన్నార‌ని మీకు తెలిసిన‌ప్పుడు మీరు మ‌రింత శ‌క్తిమంతులుగా అయిపోతారు.

మీనః రెండో చ‌క్రం

మీనః రెండో చ‌క్రం

దీన్ని సాక్ర‌ల్ చ‌క్ర‌గాను పిలుస్తారు. ఇది నాభి భాగంలో ఉంటుంది. ఈ చ‌క్రం మీన రాశివారిని బాగా ప్ర‌భావం చేస్తుంది. అత్యున్న‌త‌మైన ఆశావాదాన్ని వీరిలో క‌ల‌గ‌జేయ‌గ‌ల‌దు.

English summary

Which Is Your Power Chakra According To Your Zodiac

Learn about the various chakras that will blow your mind, which are based as per your zodiac sigN
Subscribe Newsletter