బల్గేరియా దేశంలో కన్నె పిల్లల మార్కెట్ ఉంది..పెళ్లికూతుర్లను డబ్బుకు అమ్మేస్తారు!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మనస్సుకు నచ్చిన వాడిని ప్రేమించి, అతనిని పెళ్లి చేసుకొని కలకాలం అతనితో హాయిగా జీవించాలని ప్రతి అమ్మాయి కలలు కంటుంది. కానీ బల్గేరియా దేశంలో ని ఆ ప్రాంతం లో అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తూ, వారి కలలను సంప్రదాయం పేరుతో కల్లలు చేసి, వారి తల రాతల్ని మార్చి, వాళ్ళ భవిష్యత్తుని శాసిస్తున్న భయంకరమైన ఆచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. దాని గురించి తెలుసుకొని యావత్ ప్రపంచం షాక్ కు గురైయింది.

బల్గేరియా దేశం లోని ఒక ప్రాంతం లో యుక్త వయస్సుకు వచ్చిన ఆడపిల్లల్ని వేలం పాట ద్వారా విక్రయిస్తారు. ఆచారం, సంప్రదాయాల పేరుతో కొన్ని సంవత్సరాల నుండి అమ్మాయిలను అంగడి బొమ్మలుగా మార్చి , సంతలో పశువుల్లా అమ్మేస్తున్నారు. ఈ సంప్రదాయాల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

bride market

ఆడపిల్లలు రజస్వల అయినా వెంటనే వాళ్ళను బడికి పంపడం ఆపేస్తారు. ఇక అప్పటి నుండి వాళ్ళ జీవితం వాళ్ళ కోసం బ్రతకడానికి కాదు, వేరొకరి ఆనందం కోసమే బ్రతకాలి అన్నట్లు తయారవుతుంది. ఎవరో ఒకరికి అమ్మేయాలి అనే ఉద్దేశంతో పాఠశాలకు పంపకుండా భర్త తో ఎలా వ్యవహరించాలో నేర్పిస్తారు వారి తల్లి తండ్రులు. తూర్పు యూరప్ కు చెందిన ఒక తెగ వారు ఈ ఆచారాన్ని పట్టుదలతో ఆచరిస్తూ అమ్మాయిల జీవితాల్ని నాశనం చేస్తున్నారు.

bride market

అందమైన అమ్మయిల కోసం సంవత్సరానికి 4 సార్లు వేలం పాట నిర్వహిస్తారు..

యుక్తవయస్సుకు వచ్చిన అమ్మాయిలను సంతలో అమ్మకానికి పెడతారు. ఆ సంతను అక్కడ బ్రైడల్ మార్కెట్ (పెళ్లికూతుర్ల మార్కెట్) అని అంటారు. ఆ మార్కెట్ కు ఎక్కడెక్కడి నుండో పురుషులు వచ్చి , తమకు నచ్చిన అమ్మాయిలను డబులు ఇచ్చి కొనుక్కొని తమతో తీసుకెళ్ళిపోతారు. మంచి ఖరీదైన దుస్తులను అమ్మాయిలకు వేసి, అందంగా అలంకరిస్తారు. పెళ్లి కూతుర్లులాగా ముస్తాబు చేస్తారు. అలా అందంగా అలంకరిస్తే మంచి ధరకు అమ్మాయిని కొనుక్కొని, తమకు బాగా డబ్బులు ఇస్తారని అమ్మకం దార్లు (తల్లి తండ్రులు) భావిస్తారు.

bride market

అందమైన అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువ..

అందమైన అమ్మాయిలు, తెల్లగా ఉండి , నీలి రంగు కళ్ళు ఉన్న వారికి గిరాకీ ఎక్కువ. మధ్య వర్తులు కూడా ఈ అమ్మకం లో కీలక పాత్ర పోషించి భారీగా డబ్బుని సంపాదిస్తున్నారని చెబుతున్నారు . ఇలా అక్కడ అందమైన అమ్మయిలను సంవత్సారనికి నాలుగు సార్లు వేలం పాట ద్వారా అమ్మేస్తారు.

ఇంత భయంకరమైన ఆచారాలు ఎక్కడా చూసి ఉండరు? అమ్మాయి పుష్పవతి అయితే చావబాదుతారు!

bride market

అమ్మాయిలు వేరొక వ్యక్తిని ప్రేమించామని చెప్పినా...

అమ్మాయిలు తమకు నచ్చిన వ్యక్తులను, ప్రేమించిన పురుషులను పెళ్లాడే స్వాతంత్రం ఇక్కడ లేదు. ఎంత సేపు ఆడపిల్లలను అమ్మేయాలనే తాపత్రయమే అక్కడి తల్లితండ్రులకు ఎక్కువ. ఒక వేళ ఎవరైనా ప్రేమించమని చెప్పినా, అతను మాకు నచ్చలేదని , ప్రేమించి పెళ్లి చేసుకోవడం మన పద్ధతి కాదని చెప్పేస్తారంట.

bride market

దీనిని అందరు వ్యతిరేకిస్తున్నా..ఆగటం లేదు...

అమ్మాయిలకు కూడా కొన్ని కలలు ఉంటాయి, ఆశలు, ఆశయాలు, ఇలా ఎన్నో వాళ్ళ జీవితం లో కూడా ఉంటాయి. కానీ వింత ఆచారం పేరుతో అమ్మయిల జీవితాలను చిదిమేస్తున్న ఈ సంప్రదాయం పై చాలా మంది మండి పడుతున్నారు. ఇలా యుక్తవయస్సుకు వచ్చిన ఆడ పిల్లల్ని అమ్మడం, కొనడం, వేలం పాట పాడటం చట్ట రిత్యా నేరం, ఇది మానవ హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందని ఎంత మొత్తుకున్నా, మా ఆచారం ముఖ్యం అని మొండి పట్టుదలతో ఉన్న ఆ తెగ వారి పై కఠిన చెర్యలు తీసుకొని , ఆడపిల్లల జీవితాలను కాపాడాలని చాలా మంది అక్కడి ప్రభుత్వాలకు సూచిస్తున్నారు.

పిచ్చికి పరాకాష్ట: తన వేసిన మర్డర్ ప్లాన్ తో ప్రియుడికి షాక్ ఇచ్చిన ప్రియురాలు

All Images Source

English summary

A Bulgarian Virgin Market Where Brides Are Sold

Young girls pose for selfies, slap on lipstick and dance around a bedroom strewn with clothing. These young teens could be from almost any city in the worl
Story first published: Wednesday, August 2, 2017, 13:00 [IST]
Subscribe Newsletter