Latest Updates
-
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.! -
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు
దిన ఫలాలు: గురువారం 28 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 28-12-2017 తారీఖు, గురువారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, శుద్ధ దశమి రాత్రి 7 గంటల 6 నిమిషాల వరకు ఉంది. అశ్విని నక్షత్రం రాత్రి 8 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాల నుండి 2 గంటల 53 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 4 గంటల 29 నిమిషాల లగాయతు 6 గంటల 2 నిమిషాల వరకు ఉంది. దుర్ముహర్తం తెల్లవారితే 5 గంటల 32 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 11 నిమిషాల వరకు ఉంది. మరలా దుర్ముహర్తం 11 గంటల 55 నిమిషాల వరకు ఉంది. మరలా దుర్ముహర్తం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల నుండి 3 గంటల 19 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 32 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 32 నిమిషాలకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
అనుకున్న పనులు పూర్తిగా నెరవేరుతాయి. విందు భోజనం లభిస్తుంది. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. తండ్రి గారి ఆశీర్వాదం పొందుతారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
అనుకున్న పనులు వాయిదా పడతాయి. సహకారం పూర్తిగా ఉంటుంది. పన్నులు కట్టవలసిన సమయం. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి: 22 మే-21 జూన్
అనుకున్న పనులు ఆటంకాల వలన వాయిదాలు ఏర్పడవలసి వస్తుంది. బంధు మిత్రుల కలయికలు ఏర్పడతాయి. ధనపరంగా అనవసర ఖర్చులు ఏర్పడతాయి. భార్య సహకారంగా మసులుకోగలదు. వృత్తి వ్యాపారాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
వ్యాపార అభివృద్ధి ప్రణాళికలు వేస్తారు. తల్లి ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. పిల్లలు అభివృద్ధి పథంలో నడుస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకున్న లాభాలను కలుగచేస్తాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
దూరపు బంధువుల వార్తలు వింటారు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సోదరుల సహకారం పొందుతారు. పిల్లల విషయంలో బాధ్యతగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్
రుణాలు చేయవలసి వుంటుంది. ధన ప్రణాళికలు వేసుకుంటారు. పని వారి సహకారం ఉంటుంది. కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృత్తి వ్యాపారాలు శుభంగా జరుగుతాయి. అధికారులు ప్రసన్నంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు లాభాన్నిస్తాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
ఆశించిన పనులు నెమ్మదిగా జరుగుతాయి. దూరపు ప్రాంత వార్తలు వింటారు. కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది. అనవసర ఖర్చులు ఏర్పడతాయి. జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
పనులు బాధ్యతతో పూర్తి చేయాలని కోరుకుంటారు. పిల్లలు అభివృద్ధి పథంలో నడుస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. ఇంటి పనులలో శ్రద్ధ వహిస్తారు. తల్లి గారి ఆనందానికై శ్రమ పడతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. అనవసర ఖర్చుల నుండి జాగ్రత్త పడవలసిన సమయం.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి
దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధు రాకపోకలు ఉంటాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. పని వారి సహకారం లభిస్తుంది.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
ధన ప్రణాళికలు వేస్తారు. పిల్లల గురించి ఆలోచిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. ఉద్యోగస్తులకు గౌరవ ప్రాప్తి లభిస్తుంది.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications