For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నెలవారీ రాశిఫలాలు : కర్కాటకం – జూన్ 2018

  |

  ఈ జూన్ నెలలో కర్కాటక రాశి వారికి అనుకూల, ప్రతికూల పరిస్థితుల మేళవింపుగా ఉండనుంది. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నెలలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటనలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలో కొన్ని అసాధారణ మార్పులను కూడా తీసుకుని వచ్చే అవకాశo ఉంది. పని వద్ద ఉత్పన్నమయ్యే చిన్న సమస్యలు ఏవైనా సమయం గడిచే కొలదీ సమర్థవంతంగా పరిష్కారమవుతాయి. మీరు ఎక్కువ ప్రయత్నాలు చేయవలసిన అవసరం కూడా లేదు, కానీ ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా పొందగలిగే అదృష్టవంతులై ఉంటారు.

  ఈ నెల మీరు, మీ పని మరియు కుటుంబం రెండింటినీ సంతులనం చేస్తూ అన్నిటా ఒక అడుగు ముందుకేసి కనిపిస్తుంటారు. మీరు ఒక ప్రణాళికను సిద్దం చేసుకోవడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందగలరు. ఆర్దికంగా మీ ఎదుగుదల, మీ కుటుంబంలో సమాజంలో మంచి పేరును తీసుకుని రాగలదు. మీరు గడువులోపు పనిని పూర్తి చేయలేకపోవచ్చు, కానీ ఒక ప్రణాళికాబద్దమైన జీవితం మాత్రం మీ పనులను చక్కదిద్దగలదని మరువకండి . వాయిదా అనే పదాన్ని మీ డిక్షనరీ నుండి తొలగించడం ద్వారా మీకు పని యందు మంచి గుర్తింపు లభించగలదు

  కొన్ని సందర్భాల్లో, ఇతరులపై ఆధారపడే బదులు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వెళ్లి మీ స్వంత విషయాలను సాధించేలా పరిస్థితులు డిమాండ్ చేస్తాయి.

  ఆరోగ్యo, కెరీర్, ప్రేమ జీవితం, ఆర్ధిక వ్యవహారాలూ, అదృష్ట రంగులు, అదృష్ట సంఖ్యలు మొదలైన మీ జీవితంలోని ప్రధాన అంశాల వివరణాత్మక విషయాలకై ఈ వ్యాసం మీకు సహాయం చేస్తుంది.

  ఆరోగ్యo :

  ఆరోగ్యo :

  మీరు ఈ నెలలో మీ ఆరోగ్యానికై ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా నెల చివరలో. అదనపు పని ఒత్తిడి మీ కీళ్ల భారానికి కారణమవుతుంది. మీ బిజీ లైఫ్ స్టైల్ తరచుగా మీరు ఆహారం తీసుకోడానికి ప్రేరేపిస్తుంది కానీ అనారోగ్యకరమైన ఆహార ప్రణాళిక జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. వైద్యుని సంప్రదించి, పరీక్షలు చేయించి మీ ఆహార ప్రణాళికలో మార్పులు చేయడం ఉత్తమమైన పనిగా ఉంటుంది.

  కాల్షియం లోపం వంటి తీవ్రమైన సమస్యలు పరిణమించే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా జీవన శైలి, ఆహార ప్రణాళికలలో జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. మీరు పని కారణంగా ఆహారాన్ని తిరస్కరించవచ్చు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడo వలన మీకు అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. మీ ఆహార పదార్ధాలలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవలసిన అవసరం ఉంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మరియు నిలువ ఉంచిన ఆహార పదార్ధాల జోలికి పోకుండా శరీరానికి సరిపోయే ఆహారపదార్ధాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. లేనిచో మీ ఆరోగ్యం, మీ పనిని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒక ప్రణాళిక అనేది తప్పనిసరి. పనిభారo మీకు ఒత్తిడిని కలుగజేసే అవకాశాలు ఉన్నాయి. అవసరాన్ని ఉద్దేశించి సహోద్యోగుల సహాయాన్ని తీసుకోవడమే ఉత్తమమైన చర్య. మీ పరిపూర్ణ స్వభావం మిమ్మల్ని అనుమతించకపోవచ్చు, కానీ సహోద్యోగులతో సంబంధాలు మెరుగవడానికి కూడా ఈ చర్యలు సహాయపడుతాయి. ఒత్తిడి అనేదే మీ దరి చేరకుండా చూసుకోవలసిన భాద్యత మీది. మీరు రెండు పడవలలో ఒకేసారి ప్రయాణించలేరని గుర్తుంచుకోండి. యోగా తరగతులకు వెళ్ళాలి అన్న భావన మీకు ఉంటే, ఇది సరైన సమయం. వ్యాయామానికి సమయం కేటాయించండి. మరియు మానసిక ప్రశాంతత కోసం మీరు చుట్టుపక్కల వాతావరణoలో మార్పులు చేయవలసి ఉంటుంది.

  ఉద్యోగం:

  ఉద్యోగం:

  మీ కెరీర్ కొన్ని మిశ్రమ ఫలితాలతో కూడినా కూడా ఆశాజనకంగా ఉత్తమంగా సాగేలా ఈ నెల ఉండబోతుంది. మీరు ఆరోగ్య సమస్యల దృష్ట్యా కొన్నిసార్లు పనియందు , ఉత్తమమైన పురోగతిని ఇవ్వలేరు. కానీ ఒక ప్రణాళికాబద్దమైన జీవనశైలి మాత్రం మీకు సహాయం చేయగలదు., మల్టీ టాస్కింగ్ ఆలోచనలకు కాస్త స్వస్తి పలుకక తప్పదు. క్రమంగా మీపని యందు ఉత్తమమైన ఫలితాలను ఇవ్వగలుగుతారు. మీ ప్రయత్నాలను గుర్తించని మీ అధికారుల గురించి చింతించకండి. కానీ, మీ పనిని వేరొకరు తమ విజయంగా తీసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇది మీకు కోపం తెప్పిస్తుంది, మరియు వాదనలకు కూడా తావిస్తుంది. ఇతరులు తేలికగా తీసుకోకపోయినా, మీరు తేలికగా తీసుకోలేరు. కాకపొతే, మీ ఆలోచనా విధానం అందరినీ సంతృప్తిపరచేలా చేస్తుంది.

  మీ ప్రతి అడుగులోనూ విజయావకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి, మీ సహోద్యోగుల వరకూ అందరూ మీకు సహాయం చేస్తారు. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీరు కొన్ని సవాళ్లను స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉంటారు.

  ఆర్ధిక వ్యవహారాలు :

  ఆర్ధిక వ్యవహారాలు :

  ఈ నెల ప్రధమార్ధంలో మీకు ఆశించిన ఆర్ధిక లాభాలు ఉండకపోవచ్చు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అవసరం దృష్ట్యా ఆర్ధిక నిపుణులను, లేదా మీ ప్రియమైన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఏది ఏమైనా ఈ నెల చివరలో మీకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇదే విధంగా సంవత్సరమంతా ఆర్ధిక లాభాలతో ఉండబోనుoది. మీరు క్రొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు అనేకం రావచ్చు. ఇవన్నీ ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ, పెట్టుబడుల ముందు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించడం ఉత్తమమైన విషయం. కంటికి కనిపించేవన్నీ మంచివి కాదు, కనపడవన్నీ చెడ్డవి కాదు అని గుర్తుంచుకోండి.

  మీరు ఒక స్థిరమైన పదవీ విరమణ జీవితాన్ని కావాలనుకుంటే మీ భవిష్యత్ ప్రణాళికకు మీరు ప్రాధాన్యతనివ్వాలి. కానీ అదే సమయంలో, ఆర్ధిక సమస్యలు లేకుండా మీ కుటుంబాన్ని నడుపవలసి ఉంటుంది. దేనికైనా ఒక ప్రణాళిక అవసరం. లేదా కుటుంబ కలహాలకు కారణమవుతారు. కావున మీకు వచ్చే రాబడిలో ఎప్పటికప్పుడు డివైడ్ అండ్ రూల్ పాలసీ అప్లై చేయండి. అనగా ఖర్చులను కేటాయిస్తూ, పొదుపు ఉండేలా చూసుకోండి. ఇది మీ ఆర్ధిక సమస్యలను దూరం చేయడమే కాకుండా, జీవితంలో సమస్యలు రాకుండా చూసుకోగలదు. మరియు ఖర్చుల లావాదేవీలలో, మంచి చెడుల వివరాలు కూడా చూసుకోవలసి ఉంటుంది. అనవసర ఖర్చులు, ఎంటర్టైన్మెంట్ కోసం అధికమైన ఖర్చులు చేయడం వంటివి మీ ప్రణాళికను తునాతునకలు చేయగలదు. కావున మానసిక దృడత్వంతో ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  ప్రేమ మరియు వివాహ జీవితం :

  ప్రేమ మరియు వివాహ జీవితం :

  ఈ నెల పెళ్లి కాని వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మానసికంగా మీరు కోరుకున్న అన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి మీకు జీవితభాగస్వామిగా వచ్చే సూచనలు ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రేమలో ఉండి ఉంటే, ఈ నెల మీకు ఎంతో సంతోషభరితంగా ఉండనుంది.

  వివాహితులైన వ్యక్తులకు, మీ కుటుంబoతో సంతోషంగా గడుపుటకు అనువైన సమయంగా ఉంది. ఎక్కడికైనా ప్రయాణాలకు, లేదా హాలిడే ట్రిప్స్ కోసం అనువుగా ఉంది. ఇది మీ కుటుంబంతో ఉన్న బంధాన్ని మెరుగుపరచడంలో మీకు సహాయం చేయగలదు, అంతేకాకుండా మీకు మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది.

  అదృష్ట రంగులు మరియు సంఖ్యలు:

  అదృష్ట రంగులు మరియు సంఖ్యలు:

  ఈ నెలలో కర్కాటక రాశి వారికి సూచిoచదగిన రంగులుగా తెలుపు మరియు మృదువైన పాస్టల్ షేడ్ రంగులు ఉన్నాయి. మరియు అదృష్ట సంఖ్యలుగా 4, 1, 12, 16 ఉన్నాయి.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి రాశి చక్రాలు, మరియు అనేకములైన ఆద్యాత్మిక వివరాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

  English summary

  Cancer Monthly Horoscope for June 2018

  The Month of June may be mixed for all the cancerians as you will be surrounded by both positive and negative energies. There will be some important events happening in the month. While some will be forgettable, others will be anticipated from a long time and will bring about positive changes in your life. Any minor issues arising at work will be efficiently solved as time passes.
  Story first published: Friday, June 1, 2018, 12:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more