మీరెందుకు అసంతృప్తిగా ఉన్నారో మీ జన్మరాశి తెలియచేస్తుంది

Subscribe to Boldsky

మీరు ఎందుకు బాధపడుతున్నారో మీ బాధకు గల కారణం ఏమిటో మీరు ఊహించగలరా? మీ జన్మరాశితో మీ బాధకి సంబంధం ఉంటుంది. అవును, ఆస్ట్రాలజీ ప్రకారం జోడియాక్ సైన్ అనేది ఒక వ్యక్తి భావోద్వేగాలకు కారణమవుతుంది.

మీ బాధకు అలాగే మీ జోడియాక్ సైన్ కి గల అనుబంధం గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తాము.

జోడియాక్ సైన్ అనేది ఒక వ్యక్తి యొక్క సంతోషాన్ని అలాగే బాధను నిర్దేశిస్తుందని ఆస్ట్రాలజీ చెబుతోంది. ఈ వివరాలనే మీకు తెలియచేస్తున్నాము.

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 19

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 19

వ్యక్తులలో మార్పులు రావని తెలిసి కూడా వారిని చూసి మీరు తరచూ ఇరిటేషన్ కి గురవుతూ ఉంటారు. మీరెప్పటినుంచో వారు మిమ్మల్ని క్షమాపణని వేసుకోవాలని ఆశిస్తూ ఉంటారు. వారు క్షమాపణలు అడగడానికి మీ వద్దకు రారు. ఈ విషయం మిమ్మల్ని అసంతృప్తికి గురిచేస్తుంది. ఈ విషయం వలన ఒత్తిడికి గురవుతారు. ఈ బాధ నుంచి మీరు బయటపడి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

వృషభ రాశి: ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి: ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా గతంలో నివసిస్తారు. వర్తమానాన్ని గౌరవించరు. ఇప్పుడు మీ వద్దనున్న వాటిని మీరు గుర్తించి ప్రశంసించడానికి మీరు ఇష్టపడరు. ఒకప్పుడు, మీ వద్ద ఉన్నవాటి గురించి ఆలోచిస్తూ మథనపడతారు. మీరెప్పుడూ ఎవరో ఒకరి గురించి తలచుకుంటూ బాధపడుతూ ఉంటారు. అది ఆ వ్యక్తి జ్ఞాపకం అయి ఉండవచ్చు లేదా ఆ వ్యక్తిని కావచ్చు, మీరు తరచూ వారి గురించే ఆలోచిస్తూ వర్తమానంలోనున్న ఆనందాన్ని అర్థం చేసుకోరు. వర్తమానాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. తద్వారా, బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోగలుగుతారు.

మిథునరాశి: మే 21 - జూన్ 20

మిథునరాశి: మే 21 - జూన్ 20

మీ చికాకే మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది. ఏదైనా అనుకోని సంఘటన జరగాలని ఆలోచిస్తారు. తద్వారా, చికాకు పడవచ్చని మీరు భావిస్తారు. చికాకును మీరు అలవాటుగా మార్చుకున్నారు. సంతోషం ఎక్కువ కాలం నిలవదని మీ ఉద్దేశ్యం. మరోవైపు, సంతోషంగా ఉండేందుకు మీరు సిద్ధంగా ఉండరు.

కర్కాటకరాశి : జూన్ 21 - జులై 22

కర్కాటకరాశి : జూన్ 21 - జులై 22

మీరెప్పుడు మీపై కంటే ఇతరులపై ఎక్కువ దృష్టి పెడతారు. మిమ్మల్ని మీరే గుర్తించడం మరచిపోతారు. మీ స్వంత విషయాలను నిర్లక్ష్యం చేస్తారు. మీ ప్రియమైన వారి గురించి వారి అవసరాల గురించి ఆలోచిస్తూ వాటికై పనిచేస్తూ మీ ఉనికిని మరచిపోతారు. అయితే, ముందు మీ గురించి మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు గౌరవించడం నేర్చుకోవాలి. మీ కోసం మీరు సమయాన్ని కేటాయించుకోవాలి.

సింహరాశి: జులై 23 - ఆగస్టు 23

సింహరాశి: జులై 23 - ఆగస్టు 23

మీ తప్పువల్లే ప్రతీదీ సవ్యంగా జరగటం లేదని మీరు భావిస్తూ ఉంటారు. పరిస్థితులపై కంట్రోల్ ని తీసుకోవటం మీకు అలవాటై పోయింది. ఎప్పుడూ, మీ తలరాతను మీరే నిర్దేశిస్తున్నట్లు భావిస్తూ మీ వల్లే తప్పు జరిగిందని మథనపడతారు. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవలసిన అవసరం లేదన్న విషయాన్ని మీరు గుర్తించాలి. కొన్ని సార్లు కొన్ని తప్పిదాలు ప్రతి ఒక్కరి వలనా జరిగే అవకాశం ఉంటుంది. అయినా, మీరు తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి గాని పదే పదే తప్పును తలచుకుంటూ మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు.

కన్యారాశి: ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

కన్యారాశి: ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

ఎప్పుడూ మీరు అన్యాయానికి గురయినట్టు భావిస్తారు. మీరు ఎప్పుడూ అతిగా కష్టపడిపోతూ అతిగా కష్టపడినందుకు మీరు మిమ్మల్నే నిందించుకుంటారు. మరోవైపు, ప్రొడక్టివ్ గా ఉంటే మరింత సాధించవచ్చని మీరు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇలా ద్వంద్వ ధోరణిలో మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు. ఈ ధోరణిని మార్చుకుని ఎదో ఒక అభిప్రాయానికి కట్టుబడి ఉంటే మనశ్శాంతిని తిరిగి పొందవచ్చు.

తులారాశి: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులారాశి: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

మీ ప్రయాణాన్ని ఎప్పుడూ మీరు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఇతరుల విజయాల్ని పరిగణలోకి తీసుకుని మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటారు. వారంతా వేగంగా అభివృద్ధి చెందలేదని మనస్తాపం చెందుతారు. మనలో ప్రతి ఒక్కరి ప్రయాణం వేరని అర్థం చేసుకోవటంలో మీరు విఫలమవుతారు. వెనకబడిపోతున్నట్టు భావిస్తారు. దీర్ఘంగా శ్వాస తీసుకుని మీ పరిస్థితిని అలాగే మీ జీవిత గమ్యాన్ని విశ్లేషించుకోండి. ఇప్పటి వరకు మీరు సాధించిన విజయాల్ని పరిగణలోకి తీసుకుని సంతోషంగా ఉండండి.

వృశ్చికరాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

వృశ్చికరాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22

మీరు ఒకే సారి అనేకపనులను చేయవలసిన బాధ్యతలను నెత్తినపెట్టుకుంటారు. ఆ పనుల ఒత్తిడిలో మానసికంగా ఇబ్బందికి గురవుతారు. మల్టీటాస్కింగ్ చేస్తూ విశ్రాంతిని కోల్పోతారు. అంతేకాక, ఒకేసారి మీరు అనేక విషయాలపై ఆలోచిస్తూ ఉంటారు. అయినా, ఒకసారి ఒకే పనిపై ఏకాగ్రతను పెట్టడం ద్వారా పనులన్నీ సజావుగా పూర్తిచేయగలుగుతారు. మీరు సూపర్ హ్యూమన్ కాదన్న విషయాన్ని మీరు గుర్తించి తీరాలి. అప్పుడే మనశ్శాంతిని పొందగలుగుతారు.

ధనుస్సు రాశి: నవంబర్ 23 - డిసెంబర్ 22

ధనుస్సు రాశి: నవంబర్ 23 - డిసెంబర్ 22

జీవితంలో మీకేం అవసరమో మీరు నిర్ణయించుకోవటంలో విఫలమవుతారు. మిమ్మల్ని ఎప్పుడూ అసంతృప్తికి గురిచేసే అనేక సమాధానం లేని ప్రశ్నలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. మీ కంటూ ఒక ఇమేజ్ ను తెచ్చుకోలేదని ఇబందిపడుతూ ఉంటారు. మీకంటూ ప్రత్యేకమైన లక్ష్యం లేకపోయినా మీరు జీవితంలో ముందడుగు వేయవచ్చన్న విషయాన్ని మీరు గుర్తించాలి. ఒక లక్ష్యం అనేది ఏర్పడకపోయినా మీరు ముందుకు వెళ్లవచ్చని గుర్తించిన నాడు అసంతృప్తి మిమ్మల్ని వెంటాడదు.

మకరరాశి: డిసెంబర్ 23 - జనవరి 20

మకరరాశి: డిసెంబర్ 23 - జనవరి 20

మీరు ఏకాంతంగా ఉండడాన్ని ఇష్టపడుతున్నా కూడా మీరు ఎక్కువశాతం ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. గతంలో, మీరు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడి ఇతరుల నుంచి మీరు దూరంగా వచ్చినా ఇప్పుడు మీరు ఒంటరి తనంతో బాధపడుతున్నారని గ్రహిస్తారు. మరోవైపు, మీరు కూడా ఇతరులలా అందరితో కలిసిమెలిసి ఉండాలని భావిస్తున్నారు. భయంతో వెనకడుగు వేసేకంటే, మీరే అందరితో స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. తద్వారా, ఒంటరితనాన్ని పోగొట్టుకోవచ్చు.

కుంభరాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18

కుంభరాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18

మీరు మీ బాహ్యసౌందర్యానికి ఎక్కువగా విలువిస్తారు. ఎక్కువగా సోషల్ స్టాండర్డ్ పై ఫోకస్ పెడతారు. అయితే, మెటీరియల్ థింగ్స్ వలన సంతోషం ఉండదన్న విషయాన్ని మీరు గుర్తించాలి. వస్తువులలో ఆనందాన్ని వెతుక్కోలేమని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే మీ అసంతృప్తి అంత త్వరగా తగ్గిపోతుంది. మీలోనే సంతోషం దాగుందన్న విషయాన్ని మీరు తెలుసుకుంటే మీ సంతోషానికి హద్దే ఉండదు.

మీనరాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20

మీనరాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20

మీరు మీ చిన్నపట్నుంచి స్నేహితులను కోల్పోయారని తెలుసుకుంటారు. అయితే, పెద్దవారయ్యే కొద్దీ స్నేహితులు వారి వారి పనులలో బిజీగా మారతారు. అప్పుడు, మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు. తరచూ వారిని కలిసే అవకాశం మీకు లభించదు. అంతమాత్రాన, వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మీరు భావించనవసరం లేదు. అయితే, కొన్ని రిలేషన్స్ అనేవి దీర్ఘకాలం పాటు నిలవలేవన్న విషయాన్ని మాత్రం మీరు గమనించి తీరాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Check How Zodiac Signs Reveal The Reasons For You Being Unhappy

    Each zodiac sign has its own reasons for being unhappy and we reveal you the reasons that are believed by astro experts. For eg, Aries: You seem to get irritated with people who are never going to change. If you feel that an individual will never give you an apology that you have been waiting for, it leaves you stressed.
    Story first published: Saturday, April 14, 2018, 15:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more