అతిసులభంగా మోసగింపబడే రాశుల వారెవరో, ఎలా మోసపోతారో తెలుసుకుందామా?

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

అతిసులభంగా మోసగింపబడే రాశుల వారెవరో, ఎలా మోసపోతారో తెలుసుకుందామా?

ఎదుటివారిని సులువుగా నమ్మేసే వారు సులభముగా మోసపోతారు. మోసగాళ్ళకు వీరు సులువైన లక్ష్యంగా మారతారు. ప్రతి ఒక్కరు వీరిని అవకాశంగా మార్చుకుంటారు.

ఈ వ్యాసంలో మీకు మోసాగింపబడటంలో ఏ ఏ రాశులవారు ముందున్నారో, వారు మోసపోవడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం.

కొన్ని రాశులకు చెందిన వారు ఏదైనా నమ్మేస్తారు కనుక వీరిని మోసగించడం ఇతర రాశులవారికి చాలా సులభం.

ఏ ఏ రాశులవారు ఏ కారణం చేత సులువుగా మోసపోతారో, ఆ జాబితాలో మీరున్నారో లేదో ఈ క్రింద చదివి తెలుసుకోండి.

మీనరాశి (ఫిబ్రవరి19- మార్చ్ 20) :

మీనరాశి (ఫిబ్రవరి19- మార్చ్ 20) :

మోసపోయి బాధపడిన ప్రతిసారీ ఈ రాశి వారు, ఇక మీదట తమని మోసం చేసే అవకాశం ఎవరికి ఇవ్వకూడదనుకుంటారు. కానీ ఎందుకనో వీరు తమ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోక పదే పదే మోసపోతారు. వీళ్ళను మాయ చేయడం ఇతరులకు నీళ్లు తాగినంత సులువు. వీరు చాలా సున్నితమైన మనసు కలిగి ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు. వీరు ఎదుటివారిలో కేవలం మంచిని మాత్రమే చూస్తూ వారిని గుడ్డిగా నమ్ముతారు.

తుల (సెప్టెంబర్ 23-అక్టోబర్22):

తుల (సెప్టెంబర్ 23-అక్టోబర్22):

వీరు దయార్ద్ర హృదయం కలిగి ఉండి ఇతరుల పట్ల నమ్మకం కలిగివుంటారు. ఈ రాశి వారు, ఎవరైనా తమ పట్ల అవకాశం తీసుకుంటే చాలా బాధపడిపోతారు. వీరు తమ చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల గందరగోళంగా ఉంటారు. ఎవరైనా వీరిని వేళాకోళం చేసినా, వీరితో చిలిపిగా ప్రవర్తించినా, ముడుచుకుపోయి అందుకు గల కారణం తెలుసుకోవాలనుకుంటారు. వీరు అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే తాము ఎవరిచేత మోసగింపబడనంత మాత్రాన ఇతరులకు ఎదురైన అలాంటి అనుభవాలనుండి పాఠం నేర్చుకోకూడదని ఏమి లేదు.

మేషం (మార్చ్ 21- ఏప్రిల్ 19):

మేషం (మార్చ్ 21- ఏప్రిల్ 19):

వీరు ప్రేమలో ఉన్నప్పుడు సులువుగా మోసగింపబడతారు. తమ చుట్టుపక్కల వారు హెచ్చరిస్తున్నప్పటికి వీరు తమ ప్రేమను నమ్మడానికే మొగ్గుచూపుతారు. ప్రేమలో ఉన్నప్పుడు వారి అంతరాత్మకు తప్పు జరుగుతుంది అని అనిపించినా కూడా దానిని విస్మరిస్తారు. వీరు ప్రేమలో ఉన్నప్పుడు, అవతలివారు దానిని అవకాశంగా మలచుకొని సులువుగా బుట్టలో పడేయొచ్చు.

ధనుస్సు (నవంబర్22-డిసెంబర్21) :

ధనుస్సు (నవంబర్22-డిసెంబర్21) :

వీరు చాలా తెలివైనవారు మరియు కలుపుగోలుగా ఉంటారు, ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు. వారు తమ చుట్టుపక్కల వారినుండి కూడా స్నేహశీలతను అభిలాషిస్తారు.కానీ అది సరైనది కాదు. వారు ప్రయాణాలలో జాగరూకతతో వ్యవహరించాలి పైగా మన చుట్టూ ఉన్నవారందరూ మంచివారు అని నమ్మకూడదు.

కర్కాటకం (జూన్ 21-జులై 22)

కర్కాటకం (జూన్ 21-జులై 22)

జీవితంలో ఎన్నో విషయాల మూలంగా వీరు మోసాగింపబడతారు. వీరు కనుక ప్రేమలో ఉన్నప్పుడు తమ భాగస్వామితో విడిపోవటం లేదా తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంటే కనుక, ఆ సమయంలో కలిగిన ఒత్తిడి నుండి స్వాంతన పొందటానికి వారు ఇతరులను అతిగా విశ్వసించి ఆధారపడాలనుకుంటారు. ఆ సమయంలో ఉపశమనం కొరకు ఆసరా ఇచ్చినవారిని మెప్పించాలనుకుంటారు. అదే స్పందన ఎదుటివారి నుండి కూడా ఆశిస్తారు.

English summary

5 Most Gullible Zodiac Signs Which Trust Others Blindly

A horoscope is believed to be a good indicator that you are most blindly trusting than others. Many experts reveal that astrology may hold the answer as most of the zodiac signs reveal their gullible traits. There are five specific zodiac signs and they are Pisces, Libra, Aries, Sagittarius, and Cancer.
Story first published: Saturday, April 14, 2018, 7:00 [IST]