For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలవారీ రాశి ఫలాలు: మిధున రాశి – జూన్ 2018

|

జూన్ నెలలో మిధున రాశి వారి జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ నెలలో మీ కుటుంబంలో మీ పని పట్ల గుర్తింపు లభిస్తుంది. మీకు అత్యధిక ప్రాధాన్యతని ఇస్తారు. గ్రహాల కదలికలు కూడా మీ ఉద్యోగ, వ్యాపారాల నందు మీ మార్గంలో అవసరమైన మార్పులు చేయడానికి సహాయం చేసేలా ఉంటాయి. మీ చుట్టూ చురుకైన మరియు గమ్మత్తైన పరిస్థితులను మారడం గమనిస్తారు. మీ స్నేహపూర్వకతత్వం, ఇతరుల పని పట్ల సహకారం వంటి లక్షణాల ద్వారా అందరి ఆదరాభిమానాలు మీసొంతమవుతాయి.

మీకు సామాజిక విషయాల నందు నైపుణ్యాలు పెరుగుతాయి. ప్రభావవంతమైన వ్యక్తుల గురించి తెలుసుకోవడం మరియు నూతన పరిచయాలను పొందడం వంటివి ఈ నెలలో మీకు కాస్త ఊరటగా ఉంటుంది. చుట్టూతా ఎక్కువ మంది ప్రజలు ఉండడం ద్వారా కలిగే లాభాల గురించి మీకు తెలుసు, కావున ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇతరులతో సంభాషణల అవకాశాన్ని దుర్వినియోగం చేయరు. కానీ ఆలోచనల పరంపర ఎక్కువగా ఉన్నందున మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశo ఉంది. ఏకాంతం కొరకు ఏదైనా ప్రదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తుంటారు.

నెల మొదటి కొన్ని రోజులు చాలా తీవ్రమైన మరియు ఒత్తిడితో కూడుకుని ఉంటుంది, 21వ తేదీ మీదట మీ వ్యక్తిగత జీవితం క్రమంగా ఒత్తిడి నుండి దూరమవుతుంది. మరియు మీ భాగస్వామితో సంతోషంగా మీ భావాలను పంచుకోగలరు కూడా.

మిధున రాశి వారి ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్దికాభివృద్ది, ప్రేమ మొదలైన అంశాల నందు ఈ జూన్ మాసం ఎలా ఉండబోనుందో క్రింది విభాగాలలో తెలుసుకోండి.

ఆరోగ్యం :

ఆరోగ్యం :

మీ జన్మ కుండలిలో ఉన్న శని మీకు ఉత్తమ ఫలితాలను ఇవ్వనున్నాడు. తద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గుముఖం పట్టించడంలో సహాయపడుతుంది. మీరు ఏడాది పొడవునా మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించగలరు. వాస్తవానికి, మీరు దీర్ఘకాలంగా బాధపడుతున్న కొన్ని ఆరోగ్య సమస్యల నుండి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కూడా ఉపశమనం పొందవచ్చు. అయితే, మీలో ఉండే ఏమరుపాటు ధోరణి ఆరోగ్య సమస్యలను తిరిగి ఆహ్వానించినట్లవుతుంది. కావున జాగరూతులై వ్యవహరించవలసి ఉంటుంది.

ఈ నెలలో వచ్చే గ్రహణం మీ రాశి పట్ల కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. కొన్ని లైంగిక సమస్యలను అనుభవించవచ్చు. ఒక్కోసారి తీవ్రసమస్యలకు పరిణమించవచ్చు. కావున జాగ్రత్త తప్పని సరి.

చలి మరియు దగ్గు వంటి నిరంతర లక్షణాలు సీజన్ మార్పుల కారణంగా వచ్చే అవకాశాలుగా ఉన్నాయి. స్వల్ప సమస్యలను వదిలించుకోవటానికి ఇంటి చిట్కాలను ఆశ్రయించడం మంచిది. అయితే, ఉపశమనం లభించని ఎడల నిపుణుని సంప్రదించడమే మేలు.

ఉద్యోగం :

ఉద్యోగం :

మీ కెరీర్లో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఇది అనుకూలమైన సమయం అయినప్పటికీ, మీ మార్గంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. మీ ప్రణాళికా బద్దమైన దైనందిక కార్యక్రమాల కారణంగా, విశ్రాంతి కోసం కొంత సమయం కేటాయించగలుగుతారు. కానీ మీ కార్యక్రమాలలో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. పని యందు మీ శ్రద్ద, మరియు ఉన్నతమైన ఆలోచనా ధోరణి, క్రమశిక్షణ, పట్టుదల వంటి అంశాలు ఈ నెలలో మీకు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వనున్నాయి. ఒక పని చేసేటప్పుడు పరధ్యానాన్ని దూరంగా ఉంచండి. మీ ప్రతికూల ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి పని మీద ద్యాసను కేంద్రీకృతం చేయవలసి ఉంటుంది. లేనిచో మీ పరధ్యానం మీకు సమస్యలను తెచ్చిపెట్టగలదు.

సరైన వ్యక్తులతో జరిపే చర్చలు, మీ సామాజిక సంబంధాలను మెరుగుపరచడమే కాకుండా, మీ కెరీర్ ఉన్నతంగా దూసుకుపోయేలా సహాయపడగలదు. మీరు ఎక్కడికి వెళ్లినా, ముఖ్యమైన వ్యక్తుల దృష్టి మీ మీదే ఉంటుందని తెలుసుకోండి. అంతలా మీ వ్యక్తిత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది.

వ్యాపార సంస్థల నిర్వహణ కోసం, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇక్కడ ఓర్పు, సహనం కీలకమైన అంశాలుగా ఉంటాయని మరవకండి. వ్యాపార భాగస్వామ్యాలు మీకు అనుకూలంగా ఉండవు. ఎన్నో ప్రతికూల పరిస్థితులకు కారణభూతమవుతారు. మీ తెలివే ఇక్కడ పరిష్కారం, సమస్యల్లో పూర్తిగా ఇరుక్కుంటున్నాo అన్న అనుమానం వస్తే , భాగస్వామ్యాల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు లాభాలు సంపాదించడానికి సహాయపడే అవకాశాలకై ముందుచూపు కలిగి ఉండడం అన్నిటా అవసరం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని మెలగండి.

ఆర్ధికం:

ఆర్ధికం:

చంద్రుని ప్రభావం మీ ఆర్ధికవ్యవస్థలో అనుకూలతను తీసుకుని రాగలదు కాబట్టి ఈ నెల నగదు ప్రవాహానికి అనుకూలoగా ఉంటుంది. పెట్టుబడులకు అధిక రాబడిని తీసుకుని రాగలదు. నెలలోని ప్రధమార్ధం రాబడి అనుకూలంగా ఉంటుంది, కొత్త మూలాల నుండి ఆదాయం రావడం సానుకూలంగా కనిపిస్తుంది. శ్రమతో కూడిన పని ఖచ్చితంగా మీకు ప్రతిభను సంపాదిoచి పెడ్తుంది. అయితే, అన్నివేళలా మీకు అనుకూలంగా ఉండాలని లేదు. మీ మార్గంలో ఆర్థిక పరమైన విషయాలనందు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది మరియు మానసిక స్థైర్యం, తెలివైన అడుగులు అవసరం. తెలివిగా భవిష్యత్తులో మిగులు డబ్బును ఏర్పరచుకోవడానికి మార్గాలను ఆలోచించండి.

అయినప్పటికి, ఇప్పటికిప్పుడు తాజా పెట్టుబడుల పట్ల ప్రణాళికలను వాయిదా వేయడం మంచిది. పూర్తిగా మీకు సమయం అనుకూలంగా ఉంది అని భావించిన ఎడల పెట్టుబడులపై దృష్టి సారించండి. పని ప్రయోజనాలకై చేయు ప్రయాణాలు అనుకూల ఫలితాన్ని తీసుకుని రాగలవు.

సంబంధం:

సంబంధం:

జూన్ మద్య సమయం వరకు మీ జీవిత భాగస్వామితో వాదనలు సాగుతుంటాయి. ఇది వివిధ స్వభావాలు లేదా అభిప్రాయాల కారణంగా కావచ్చు. మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుటకు మీరు మీ ప్రయత్నాలను ముమ్మరం చేయవలసి ఉంటుంది.మానసిక పరిపక్వతతతో మెలగడం మూలంగా క్లిష్ట పరిస్థితులను సైతం సామరస్యంగా ముగింపుకు తీసుకుని రాగలరు.

ఇక మీ ప్రేమ జీవితం మీ చురుకుతనం కారణంగా ఆసక్తికరంగా సాగుతుంది. మీరు ఇదివరకే ప్రేమలో ఉన్నట్లయితే, మీ భాగస్వామితో మీరు సంతోషంగా గడపగలిగే సమయంగా ఈ జూన్ నెల ఉంది. ప్రేమ గురించిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే మాత్రం జాగరూతులై వ్యవహరించడం మేలు. మీకు అన్నిటా అనుకూలంగా ఉన్నా కూడా, తెలివితో వ్యవహరించవలసి ఉంటుంది.

మీ అదృష్ట రంగులు మరియు నంబర్లు :

మీ అదృష్ట రంగులు మరియు నంబర్లు :

ఈ జూన్ మాసం నందు మీ అదృష్ట రంగులుగా ఎరుపు మరియు నీలం ఉన్నాయి. మరియు మీ అదృష్ట నంబర్లు గా 4 మరియు 9 ఉన్నాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. రాశి చక్రాల గురించి మరిన్ని వివరాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శిస్తూ ఉండండి. మీరు ఈ రాశికి చెందిన వారైతే, మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Gemini Monthly Horoscope For June 2018

You will be high on social skills, getting to know influential people and making new acquaintances. You very well know the benefits of having people around so will not miss any opportunity to interact socially. Peace and tranquillity will run away from you as you will have many things on your plate needing your attention. Travelling to new grounds to find solitude will indeed be very rewarding.
Story first published: Friday, June 1, 2018, 11:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more