2018లో రాహువు మిమ్మల్ని ఈ విధంగా వేధించనున్నాడు

Written By:
Subscribe to Boldsky

అందరం 2018లోకి ప్రవేశించం. కొత్తకొత్త ఆశలతో జీవితం సాగించాలని చాలామంది అనుకుని ఉంటారు. అయితే మీ రాశి ప్రకారం మీ జీవితంలోకి 2018లో రాహువు ప్రవేశించనున్నాడు. రాహువు మీకు కొన్ని రకాలుగా ఆటంకాలు కలిగించినా.. ఒక్కోసారి మీకు అదృష్టాలను కూడా తీసుకొస్తాడు. రాహువు ఒక్కోరాశిలో ఒక్కో స్థానంలో ఉంటాడు. మరి 2018లో మీ రాశిలో రాహువు ఏ స్థానంలో ఉంటాడు. మీకు కలిగించే నష్టాలు ఏమిటి? లాభాలు ఏమిటో తెలుసుకోండి.

మేషం (21 మార్చి 20 ఏప్రిల్)

మేషం (21 మార్చి 20 ఏప్రిల్)

ఈ రాశికి వారిపై 2018 రాహువు కాస్త ప్రభావం చూపుతాడు. ఈ రాశిలో రాహువు నాల్గో స్థానంలో ఉంటాడు. అయితే వీరికి కుటుంబపరంగా కాస్త ఇబ్బందులు ఏర్పడుతాయి. తోబుట్టువులతో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని కారణాల వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులకు ఒక్కసారి దూరం కావడం వల్ల మీలో ఒత్తిడి పెరుగుతుంది. మీరు కాస్త ఆందోళనకు గురువుతారు. ఈ విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.

వృషభం (21 ఏప్రిల్ -21 మే)

వృషభం (21 ఏప్రిల్ -21 మే)

ఈ రాశిలో రాహువు మూడో స్థానంలో ఉంటాడు. ఈ రాశికి వారికి రాహువు వల్ల కొన్ని లాభాలే చేకూరుతాయి. వీరు ఎలాంటి కష్టపరిస్థితుల్లో ఉన్నా రాహువు వీరిలో ధైర్యాన్ని నింపుతాడు. అలాగే ఆరోగ్యంగా ఉండేలా చూస్తాడు. అంతేకాకుండా వీరి రంగంలో విజయవంతంగా ముందుకెళ్తారు. వీరి చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ కన్నా ఇంకా మంచి ఉద్యోగం త్వరంలోనే పొందే అవకాశం ఉంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి.

మిథునం (22 మే 19 జూన్)

మిథునం (22 మే 19 జూన్)

రాహువు రెండో స్థానంలో ఉంటాడు. 2018లో వీరికి ఎంత మంచి జరుగుతుందో అంతేరీతిలో చెడు కూడా జరిగే అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితులనైనా మీరు తట్టుకుని నిలబడే శక్తి కలిగి ఉండాలి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు కూడా వస్తాయి. వీటన్నింటిని తట్టుకునే శక్తిని మీరు కలిగి ఉండాలి. చిన్నచిన్న సమస్యలకు కుంగిపోకుండా 2018లో ముందుకెళ్లండి.

కర్కాటకరాశి (జూన్ 20-22 జూలై 20)

కర్కాటకరాశి (జూన్ 20-22 జూలై 20)

ఈ రాశిలో రాహువు లగ్నంలో ఉంటాడు. మొదటి స్థానంలో ఉంటాడు. 2018లో మీ జీవితంలో రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు రాహువు మీకు అనుకూలంగా కూడా మారుతాడు. మీరు చేయబోయే పనులు విజయవంతం చేస్తాడు. కొన్ని విషయాల్లో మీరు విజయపథంలో దూసుకెళ్తారు. ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్తారు. మీరు ఊహించని ఎన్నో పరిణామాలు మీరు త్వరలోనే చూడనున్నారు. అలాగే 2018లో మీరు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు.

సింహరాశి (23 జూలై -21 ఆగస్టు)

సింహరాశి (23 జూలై -21 ఆగస్టు)

ఈ రాశిలో రాహువు 12 వ స్థానంలో ఉండాడు. వీరు ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. మంచి ఆదాయాలు వస్తాయి. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. వీరు తమ లక్ష్యాలను సాధించడానికి అహర్నిశలు కష్టపడతారు. పట్టుదలతో పని చేసే గుణం వీరికి ఉంటుంది. రాహువు వీరి పనులు విజయవంతం అయ్యేలా చేస్తాడు. రాహువు అనుగ్రహం వల్ల వీరు విజయపథంలో దూసుకెళ్తారు.

కన్యరాశి (22 ఆగస్టు-23 సెప్టెంబర్)

కన్యరాశి (22 ఆగస్టు-23 సెప్టెంబర్)

రాహువు 11 వ స్థానంలో ఉంటాడు. వీరు 2018లో మంచి ఆదాయాలు అర్జిస్తారు. వీరికి అన్ని విషయాల్లో బాగా కలిసొస్తుంది. వీరిని అదృష్టం వరిస్తుంది. చాలా విజయాలు చేకూరుతాయి. వీరికి చాలా రకాల అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు వెళ్తారు. రాహువు వీరికి అనుకూలంగా ఉంటాడు.

తుల (24 సెప్టెంబర్ -23 అక్టోబర్)

తుల (24 సెప్టెంబర్ -23 అక్టోబర్)

రాహువు పదో స్థానంలో ఉంటాడు. అయితే రాహువు ఈ రాశి వారిపై కాస్త ప్రభావం చూపుతాడు. ఉద్యోగంలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. అలాగే వీరు రోజూ చేసే పనుల్లో కూడా కాస్త మార్పు వస్తుంది. వీరు పని ఒత్తిడి వల్ల కనీనం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తగినంత సమయాన్ని కూడా కేటాయించలేరు. 2018లో వీరు డబ్బును బాగా ఆదా చేస్తారు. పొదుపు ఎక్కువగా చేస్తారు. డిపాజిట్లు చేస్తారు.

వృశ్చికం (24 అక్టోబర్ -21 నవంబర్)

వృశ్చికం (24 అక్టోబర్ -21 నవంబర్)

రాహువు 9 వ స్థానంలో ఉంటాడు. మీకు రాహువు కాస్త అనుకూలంగా ఉండడం వల్ల 2018లో చాలా విషయాల్లో మీరు ఆనందంగా ఉంటారు. మీరు ఏదైనా ప్రణాళిక తయారు చేసుకుని ఆ ప్రకారం ముందుకెళ్తే మీకు కచ్చితంగా విజయం వరిస్తుంది. అయితే మీ తండ్రి ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు కాస్త శ్రద్ధ వహించాలి. అలాగే మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.

ధనుస్సు (నవంబరు 22 - 22 డిసెంబరు)

ధనుస్సు (నవంబరు 22 - 22 డిసెంబరు)

రాహువు 8 వ స్థానంలో ఉంటాడు. రాహువు ఈ రాశి వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతాడు. వీరు 2018లో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని కారణాల వల్ల డబ్బును కోల్పొతారు. ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావడం వల్ల తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి.

మకరం (23 డిసెంబర్- 20 జనవరి)

మకరం (23 డిసెంబర్- 20 జనవరి)

రాహువు ఈ రాశిలో ఏడో స్థానంలో ఉంటాడు. రాహువు వీరి వైవాహిక బంధంపై కాస్త ప్రభావం చూపుతాడు. అయితే పెళ్లికాని వారు అయితే వారు కోరుకున్న అమ్మాయిని 2018లో పెళ్లి చేసుకుంటారు. అలాగే వృత్తిపరంగా కూడా వీరు బాగా రాణించనున్నారు.

కుంభం (21 జనవరి -19 ఫిబ్రవరి

కుంభం (21 జనవరి -19 ఫిబ్రవరి

రాహువు ఆరో స్థానంలో ఉంటాడు. వీరిపై రాహువు ఎక్కువగానే ప్రభావం చూపుతాడు. వీరు ఆరోగ్యపరంగా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అయితే సమస్యలను ఎదురించి పోరాడే గుణం మీలో ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా సమస్యల నుంచి బయటపడతారు. మీరు వృత్తిపరంగా కూడా బాగా రాణించనున్నారు.

మీనం (20 ఫిబ్రవరి - 20 మార్చి)

మీనం (20 ఫిబ్రవరి - 20 మార్చి)

రాహువు ఐదో స్థానంలో ఉంటాడు. రాహువు వీరికి అనుకూలంగా ఉంటాడు. వీరి చదువుపరంగా కూడా బాగా రాణించనున్నారు. అయితే మీ కుంటుంబ సభ్యులు, బంధువులు, మీ జీవితభాగస్వామితో మీరు కొన్ని విషయాల్లో ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మిమ్మల్ని వారు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే మీరు ఆర్థికంగా ఎదుగుతారు. డబ్బుపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులుండవు.

English summary

2018: How Rahu Transit Will Affect Your Zodiac Sign

2018: How Rahu Transit Will Affect Your Zodiac Sign
Story first published: Monday, January 1, 2018, 14:00 [IST]