నేను కూడా పవన్ కల్యాణ్ టైపే... ఓపిక ఉన్నంత వరకే భరిస్తా - My Story #38

Written By:
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరి జీవితంలోకి ఏదో ఒక సంబంధం లేని సమస్య వస్తూ ఉంటుంది. ఎవరో ఒకరు మన జీవితంలో అనుకోకుండా వస్తారు. ప్రశాంతంగా ఉన్న నీటిలో ఒక్కరాయి వేస్తే ఎలా అయితే ఆ నీరు మొత్తం కదులుతుందో అలాగే మన జీవితంలోకి కూడా కొందరు వస్తారు. ఒడ్డున కూర్చొని ఆహా.. నేను ఒక్క రాయి వెయ్యగానే ఇంత పెద్ద నది కూడా ఎంతలా కదిలిపోతుందో చూడు అన్నట్లుగా ఆనందిస్తుంటారు. వాళ్లంతా మూర్ఖులు.

ఉగ్రరూపం దాల్చితే..

ఉగ్రరూపం దాల్చితే..

నువ్వు ఒక్కరాయి కాదు.. వందరాళ్లు వేసినా నది అలాగే ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ నీరు ఉగ్రరూపం దాల్చితే నువ్వు ఆ సునామీలో కొట్టుకుపోతావు. ప్రశాంతంగా ఉన్న నదిని పదేపదే పరీక్షించి ప్రాణాలపైకి తెచ్చుకోకు.

అవమానం భరించలేదు

అవమానం భరించలేదు

నాది కడప. నేను బెంగళూరులో పని చేస్తా. నేను పని చేసే రంగంలో నాకు చాలానే అనుభవం ఉంది. నేను అందులోనే ప్రత్యేకంగా చాలా కోర్సులు చేశాను. ఈ రంగంలోని చాలామంది మహానుభావులతో, అపర మేధావులతో పని చేసిన అనుభవం కూడా నాకు ఉంది. ఈ రంగంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కూడా నేను ఏ ఒక్కరోజు కూడా ఎవరితోనూ అవమానం భరించలేదు.

పదును లేని కత్తిలాగానే

పదును లేని కత్తిలాగానే

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పడు ఒకస్టార్ ని ఒక పదును లేని కత్తి ఏవిధంగా అయితే టార్గెట్ చేస్తుందో అదే విధంగా నన్ను మా ఆఫీసులో ఒకరు టార్గెట్ చేశారు. తన దగ్గర కూడా ఏ పదునూ లేదు.

ఒకే ఒక తెలుగు వ్యక్తి... మామాలు డ్రామా కాదు

ఒకే ఒక తెలుగు వ్యక్తి... మామాలు డ్రామా కాదు

ఇప్పుడు పని చేస్తున్న కంపెనీలో ఒకే ఒక తెలుగు వ్యక్తి ఉన్నారు. తనను మొదట మా బాస్ నన్ను కలవనిచ్చేవారు కాదు. ఎందుకంటే అలాంటి డ్రామా మనిషి ప్రపంచం మొత్తం వెతికినా దొరకరు. తనవల్లే చాలామంది ఆ డిపార్ట్ మెంట్ లో పని చేసే తెలుగువారు జాబ్ మానేయాల్సి వచ్చింది.

ఏ ఒక్క క్వాలిఫికేషన్ లేదు

ఏ ఒక్క క్వాలిఫికేషన్ లేదు

ఈ రంగానికి కావాల్సిన ఏ ఒక్క క్వాలిఫికేషన్, క్వాలిటీ తనలో లేదు. అయినా ఇందులోనే తను పని చేస్తున్నారు. తాను చాలా ఏళ్లుగా సంస్థలో పని చేయాలంటే తనకన్నా పని ఎక్కువ చేసేవారు సంస్థలోకి అడుగు పెట్టకుండా చూడాలి. అందుకోసం కూడా చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు.

వెన్నులో వణుకు

వెన్నులో వణుకు

ఒకవేళ ఎవరైనా అన్ని అడ్డంకులు దాటుకుని సంస్థలోకి వచ్చి తన డిపార్ట్ మెంట్ లో చేరితే తన వెన్నులో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే తను పని చేయలేరు. వచ్చిన వాడు ఎక్కడ పని చేసి తనను పని పరంగా అధిగమిస్తాడోనని భయం. ఏ పని చేతకాని తన కింద నేను పనిచేయాలనుకోవడం తన మూర్ఖత్వం.

పవర్ స్టార్ లాగానే

పవర్ స్టార్ లాగానే

నాకు ఒకరికి భజన చేయడమంటే పెద్ద చిరాకు. పవర్ స్టార్ లాగానే నేను కూడా నా దారిలో నేను వెళ్తుంటా. వెళ్తున్నాను కూడా.. కానీ నా దారిలో అడ్డంకులు సృష్టించాలని తను చాలా ప్రయత్నాలు చేశారు. నా రంగాన్ని నమ్ముకుని బతుకున్నాను. ఓపిక ఉన్నంత వరకు భరించాను. ఇక భరించను. నేను కూడా దేనికైనారెడీ.

తన నాటకాలు ఆ రోజు చూడాలి

తన నాటకాలు ఆ రోజు చూడాలి

ఆఫీసులో ప్రతి శనివారం తను చేసే వ్యాఖ్యలు వింటే ఒళ్లు మండిపోతుంది. మిగతా రోజుల్లో మా బాస్ ఉంటారు. కాబట్టి ఆ రోజుల్లో తన నాటకాలు ఆఫీసులో సాగవు. అందుకే ప్రతి శనివారం ఒక గ్యాంగ్ తో ముచ్చటిస్తుంటారు. ఆ బ్యాచ్ గురించి నేను చెడ్డగా మాట్లాడను కానీ తన గురించి మాత్రం ఎంత మాట్లాడినా ఏం తప్పు లేదు.

ఆస్కార్ వచ్చి ఉండేది

ఆస్కార్ వచ్చి ఉండేది

తను సినిమాల్లో నటించి ఉంటే కచ్చితంగా ఆస్కార్ వచ్చి ఉండేది. ఎందుకంటే ఆ నటన కింద ఎవ్వరూ పనికిరారు. మా బాస్ ముందు నోట్లో వేళ్లు పెడితే కూడా కొరకరేమో అన్నట్లు నటిస్తారు. మా బాస్ రాని రోజు మాత్రం తన అసలు రూపం బయటపడుతుంది.

కాలి గోటికి సమానం

కాలి గోటికి సమానం

బూతుపురాణం మొదలవుతుంది. ప్రపంచంలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టరు. నోరు తెలిస్తే వాడు.......... నా కొడుకు తప్పా ఇంకేమి మాటలు రావు. అలాంటి తనకు నేను ఎందుకు గౌరవం ఇవ్వాలి. తను నా కోలిగ్ కావొచ్చేమోగానీ వ్యక్తిత్వంలో మాత్రం ఇలాంటి వ్యక్తి నా కాలి గోటికి సమానం.

పదును లేని కత్తిని అదే కత్తితోనే...

పదును లేని కత్తిని అదే కత్తితోనే...

వర్క్ స్టేషన్ లో అలా మాట్లాడడం మా ఆఫీస్ రూల్ ప్రకారం తప్పట. కానీ తనకు మాత్రం ఏ రూల్స్ వర్తించవు. నేను పక్కనే కూర్చొని ఉంటాను. ఇన్ డైరెక్ట్ గా తాను నన్ను ఎన్నో మాటలు మాట్లాడారు. "నేను ఎంతకన్నా తెగిస్తా.. నేను వాడికి పుల్ స్టాఫ్ పెడతా" ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడితే నాకు పవన్ కళ్యాణ్ అంత సహనం లేదు. ఈ పదును లేని కత్తిని అదే కత్తితో చంపేందామన్న కోపం వచ్చింది.

కాస్త సహనంతోనే ఉన్నా

కాస్త సహనంతోనే ఉన్నా

అయినా కాస్త సహనంతో ఉన్నా. ఇంకొన్ని రోజులు ఉండగలనేమో. తనకు సంబంధించిన ఒక మనిషి కూడా మా సంస్థలోనే పని చేస్తున్నారు. ఇంత నిర్లజ్జగా ఉన్న ఈ మనిషిని తను ఎలా భరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు గానీ... నా విషయంలో ఇంకోసారి హద్దులు మీరి ప్రవర్తిస్తే మాత్రం పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి.

పదేపదే నన్ను డిస్టర్బ్ చేస్తే భరించలేను

పదేపదే నన్ను డిస్టర్బ్ చేస్తే భరించలేను

నేను దేనికైనా రెడీ.. నా తప్పు ఉంటే ప్రూవ్ చేయండి.. నా జోలికి రాకండి. పదేపదే నన్ను డిస్టర్బ్ చేస్తే భరించలేను. ఆ పదును లేని కత్తి ఎలాగైతే ప్రెస్ మీట్ లు పెట్టి ఒకవ్యక్తికి సంబంధం లేని వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతున్నారో.. అలా తను కూడా ఆఫీసుకు సంబంధం లేకుండా నేను బయట మాట్లాడిన విషయాలు గురించి ప్రశ్నిస్తున్నారు.

పూనమ్ కౌర్ లాగా సైలెంట్ గా ఉండలేను

పూనమ్ కౌర్ లాగా సైలెంట్ గా ఉండలేను

నా వ్యక్తిగత జీవితంలోకి వస్తే నేను పూనమ్ కౌర్ లాగా సైలెంట్ గా ఉండే వ్యక్తిని కాను. పవన్ కల్యాణ్ అంత సహనాన్ని నాలో నింపుకుని ఈ పదును లేని కత్తితో మనకేంటి అని పట్టించుకోకుండా ఉండే మనిషిని కూడా కాదు.

లెక్క ఎక్కువైనా పర్వాలేదు

లెక్క ఎక్కువైనా పర్వాలేదు

నేను వేరు.. నా వ్యక్తిత్వం వేరు. ఓపిక ఉన్నంత వరకు భరించాను. మీరు ఒక్కరే కాదు.. మీకు ఇదే ఆఫీసులో వంద మంది తెలిసి ఉండొచ్చు. వాళ్లంతా మీకు సపోర్ట్ ఇవ్వొచ్చేమో. నేను ఒక్కన్నే. మీరు వందకాకుంటే రెండొందల మంది రండి. లెక్క ఎక్కువైనా పర్వాలేదు.. నేను రెడీ.. దేనికైనా రెడీ.

పదును లేని కత్తి కదా అని పట్టించుకోలేదు

పదును లేని కత్తి కదా అని పట్టించుకోలేదు

ఒక వ్యక్తిత్వం లేని పదును లేని కత్తి గురించి ఆ పవర్ స్టార్ ఎలా ఇన్నాళ్లు పట్టించుకోలేదో నేను అలాగే పట్టించుకోలేదు. కానీ నా వ్యక్తిగత విషయాల్లోకి వచ్చి దాడి చేస్తే మాత్రం కచ్చితంగా పట్టించుకుంటాను. అదెలా ఉంటుందో త్వరలోనే చూపిస్తాను. ఆ పవర్ స్టార్ కూడా ఆ పదను లేని కత్తికి కథకు పుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నాను.

English summary

I am also Pawan Kalyan but I am not no longer have patience

I am also Pawan Kalyan but I am not no longer have patience