అర్జునుడిపై మోజుపడితే అభిమన్యుడికి పెళ్లాం కావాల్సి వచ్చింది

Written By:
Subscribe to Boldsky

ఉత్తర.... ఈమె విరాటరాజు కుమార్తె. ఉత్తరుడు ఈమె సహోదరుడు. ఉత్తర అభిమన్యుడి తండ్రి అర్జునుడిని ఇష్టపడుతుంది. అతన్ని చాలా ప్రేమిస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్ల వల్ల ఉత్తర అభిమన్యుడిని పెళ్లి చేసుకుంటుంది.

శశిరేఖతో కాదు ఉత్తరతోనే

శశిరేఖతో కాదు ఉత్తరతోనే

అలాగే శశిరేఖను అభిమన్యుడు పెళ్లి చేసుకున్నాడని మనం సినిమాల్లో చూశాం. కానీ అదంతా కల్పన మాత్రమే. అందులో శశి బలరాముని కుమార్తె అని ఆమె అభిమన్యుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడని, వీళ్ళిద్దరి పెళ్ళికి ఘటోత్కచుడు సహకరించాడని మనం చూపించారు. కాని, ఈ కథ చలనచిత్రం కోసం సినీకవులు కల్పించిన ఒక కాల్పనిక గాథ మాత్రమేనట.

వీరి కుమారుడి కాలం నుంచే కలియుగం

వీరి కుమారుడి కాలం నుంచే కలియుగం

వేదవ్యాసకృత మహాభారతంలో, అభిమన్యుడు విరాటరాజు కుమార్తె అయిన ఉత్తరను వివిహము చేసుకున్నట్టుగా వేదవ్యాసుడు రచించారు. అభిమన్యుడికి, ఉత్తరకు కలిగిన సంతానమే పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తు మహారాజు రాజ్యపాలనతోనే కలియుగం మొదలైయింది.

అర్జునుడితో ఉత్తర ప్రేమలో..

అర్జునుడితో ఉత్తర ప్రేమలో..

శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రకీ మేనబావ అర్జునుడికీ పుట్టిన అభిమన్యుడిలో చాలా సుగుణాలున్నాయి. అయితే అర్జునుడు విరాటుడి కొలువులో ఉన్నప్పుడు ఆయన కూతురు ఉత్తరకు నాట్యం నేర్పుతాడు. దీంతో ఆమె అర్జునుడితో ప్రేమలో పడుతుంది. పెళ్లి చేసుకుంటా అంటుంది. కానీ అర్జునుడు అందుకు ఒప్పుకోడు. ఆమె మాత్రం అర్జునుడిని చాలా ప్రేమించి ఉంటుంది.

విరాటుడు పరవశించిపోతాడు

విరాటుడు పరవశించిపోతాడు

శత్రుసేనలపై అర్జునుడు విరుచుకుపడిన తీరును చూసి విరాటుడు పరవశించిపోతాడు. అర్జునిని గట్టిగా కౌగలించుకుంటాడు. అజ్ఞాతవాసం పూర్తయ్యాక విరాటుడికి అసలు విషయం చెబుతారు పాండవులు. మీరు నా వద్ద ఉండడం నా పూర్వజన్మ సుకృతం అని అంటాడు విరాటుడు.

ఉత్తరకుమారిని పిలిపించండి

ఉత్తరకుమారిని పిలిపించండి

ఇంత కాలం నివురు కప్పిన నిప్పులా ఉన్న వీరిని మనం కూడా అవమానించి అనరాని మాటలన్నాం.. వీరిని క్షమాపణ అడగడం మన ధర్మం.. ఈ సంపద ఈ సామ్రాజ్యం వీరిదే కనుక వీరికి ఏదైనా కానుక ఇవ్వాలి ఉత్తరకుమారిని పిలిపించండి అని తండ్రితో అంటాడు ఉత్తరకుమారుడు.

ఉత్తరను అర్జునుని కిచ్చి

ఉత్తరను అర్జునుని కిచ్చి

ఉత్తరకుమారుని పలుకులు విన్న విరాటుడు ఉత్తరను తీసుకురమ్మని సేవకులను ఆజ్ఞాపిస్తాడు. ఉత్తరకు ఎదురు వెళ్ళి విరాటుడు ఆమెను చేయి పట్టి ధర్మరాజు వద్దకు తీసుకు వచ్చి ధర్మరాజుతో... ధర్మరాజా.. అజ్ఞానంతో నీ పట్ల చేసిన అపరాధాలు మన్నించడం అంటాడు. మేము మీతో బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్నాం. మా కుమార్తె ఉత్తరను అర్జునుని కిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాం అంటాడు.

ఉత్తరకు గురువును

ఉత్తరకు గురువును

ఇదంతా గమనిస్తున్న అర్జునుడు ధర్మరాజు వైపు చూసి అతని చూపులలో అర్ధం గ్రహించి విరాటునితో ... విరాటరాజా .. నేను ఉత్తరకు గురువును గురువు తండ్రితో సమానం అంటాడు. అయితే ఉత్తరకు కూడా అర్జునుడు అంటే చాలా ఇష్టం. కానీ అర్జునుడు ఉత్తరను కోడలిగా స్వీకరిస్తాను అంటాడు. నా కుమారుడు అభిమన్యుడికిచ్చి వివాహం చెయ్యండి అంటాడు.

అయితే అలాగే చేస్తాం

అయితే అలాగే చేస్తాం

అభిమన్యుడు మంచి విద్యావంతుడు, బాహుబలం కలిగిన వీరుడు, ఉదారుడు, శౌర్యపరాక్రమం కలిగిన వాడు, గుణవంతుడు, పెద్దలమన్నలను పొందిన వాడు అని అర్జునుడు చెబుతాడు. ఆ మాటలకు విరాటుడు సంతోషించి .. సరే అర్జునా ! నీతో వియ్యమందడం కంటే కావలసినదేముంది అంటాడు.

ఉత్తరాభిమన్యుల వివాహం

ఉత్తరాభిమన్యుల వివాహం

ఉత్తరకుమారికి అభిమన్యుడితో పెళ్లి కుదిరుతుంది. విరాటుని ఆజ్ఞపై ప్రజలంతా పాండవులకు కానుకలు సమర్పిస్తారు. విరాటుడు సమకూర్చిన సౌకర్యాలతో పాండవులు సుఖంగా ఉంటారు. ఉత్తర, అభిమన్యుడి పెళ్లికి దృపద మహారాజు, కాశీరాజు శైబ్యుడు తమతమ భార్యా పుత్రులతో పాటు అనేక దేశాలనుండి రాజులు ఉత్తరాభిమన్యుల వివాహానికి హాజరవుతారు.

అభిమన్యుని మరణసమయంలో ఉత్తర గర్భవతి

అభిమన్యుని మరణసమయంలో ఉత్తర గర్భవతి

వివాహానంతరము అభిమన్యుడు, అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో ద్రోణుడుచే రచించబడిన పద్మవ్యూహములో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శిస్తాడు. అన్యాయంగా చుట్టుముట్టిన దుర్యోదన, దుశ్శాసన, కర్ణాదులచే సంహరించబడతాడు. అభిమన్యుని మరణసమయంలో అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉంటుంది. వీరికి పుట్టిన వాడే పరీక్షిత్తు.

All Images Source :https://www.speakingtree.in

English summary

interesting facts about abhimanyu uttara

interesting facts about abhimanyu uttara
Subscribe Newsletter