For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సింహరాశి వారి జూన్ 2018 మాసఫలాలు

  |

  సింహ రాశి వారికి ఈ నెలలో మీ జీవితంలోని దాదాపు అన్ని అంశాలలో మెరుగుదల ఉంటుంది. ఈ నెల మీకు అత్యంత అనుకూలమైన నెలగా ఉండనుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు రోజు రోజుకూ మిమ్ములను మరింత బలపరుస్తాయి. మీరు చాలా సమయాల్లో మీకు అనుకూలంగా ఫలితాలు వచ్చేలా ఈ నైపుణ్యాలే వీలు కల్పిస్తాయి. మీరు చేసే ప్రతి పని యందు ప్రతి అడుగులోనూ ఆత్మ విశ్వాసంతో ముందుకు కదులుతారు. మీలోని ప్రతిభను వెలికి తీయాలన్న ఆలోచన మీది. తద్వారా మీ భాగస్వామి లేదా మీరు కోరుకున్న వ్యక్తులు మీ పట్ల ఆకర్షితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కూడా. కానీ ఆరోగ్యం పరంగా మాత్రం కాస్త జాగరూతులై వ్యవహరించవలసి ఉంటుంది.

  మీ రాశిచక్రంలోని సూర్యుడు మీపట్ల మంచి సానుకూల శక్తిని కలిగి ఉన్నాడు, సింహ రాశికి సూర్యుడు అనుకూలమైన గ్రహంగా కూడా ఉంది. అవసరమైనప్పుడు అనుకూలమైన మార్పులను చేయమని మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. మీరు మీ సాధారణ పనిని మాత్రమే కాకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆలోచనలు చేస్తుంటారు. ఈ ఆలోచన మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా తెచ్చిపెడుతుంది. పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది.

  మీ కుటుంబ సభ్యులను సైతం విస్మరించేలా మీ ప్రణాళికలు ఉంటాయి. ఇది మీ పని యందు ప్రతికూల ప్రభావాలను తీసుకుని వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇతరులకు గర్విష్ఠులుగా మీరు కనిపిస్తుంటారు, మీలోని పోటీతత్వ స్వభావం అన్నివేళలా పనికిరాదని గుర్తుంచుకోండి. మీరు ఇతరులతో కలుసుకుని, కొత్త పరిచయాలను ఏర్పరుచుకోవాలనుకుంటే, ఈ నెల మీకు అనుకూలంగా ఉండనుంది. వ్యాయామం లేదా ఏరోబిక్స్ వంటి అంశాలతో కూడిన రొటీన్ మేకింగ్ మీ ఫిట్నెస్ గోల్స్ సాధించడంలో మీకు సహాయపడుతుంది .

  ఆరోగ్యo, కెరీర్, ప్రేమ జీవితం, ఆర్ధిక వ్యవహారాలు, అదృష్ట రంగులు, అదృష్ట సంఖ్యలు, రత్నాలు మొదలైన మీ జీవితంలోని ప్రధాన అంశాల వివరణాత్మక విషయాలనందు మీ రాశిచక్ర ప్రభావాలను తెలుసుకునేందుకు ఈ వ్యాసం మీకు సహాయం చేస్తుంది.

  1. ఆరోగ్యం

  1. ఆరోగ్యం

  ఈ నెల, మీరు అనారోగ్యం కారణంగా అదనపు వైద్య ఖర్చులు భరించవలసి ఉంటుంది, దీనికి మూల కారణం అదనపు ఒత్తిడి మరియు భౌతిక శ్రమ వంటి ప్రధాన అంశాలు. మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని మీరు గుర్తించలేకపోవచ్చు. మీరు ఫిట్నెస్ క్లాసులకు కూడా వెళ్ళాలన్న ఆలోచనలు చేయవచ్చు. అలాగే, మీ మెదడు మెరుగ్గా పనిచేయడానికి మీ శరీరానికి తగిన వ్యాయామాన్ని కూడా ఇవ్వాలని మీరు తెలుసుకోవలసి ఉంటుంది.

  జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి బయట ఆహారాన్ని దూరంగా ఉంచడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. కొన్ని సమయాల్లో వాటి మీదకు మనసు వెళ్తున్నా, వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం అన్నిటికన్నా మేలు. ప్యాకేజీలో ఉన్న నిల్వ ఆహారాలు మీ అలెర్జీలను మరింతగా పెంచే అవకాశాలు ఉన్నాయి,కావున వీటికి దూరంగా ఉండడమే మేలు.

  సాధారణంగా, ఈ నెల మీ ఆరోగ్య సమస్యల కారణంగా మీరు మానసిక అనారోగ్యానికి కూడా గురవుతారు. మీరు మందుల మీద మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్యం దృష్ట్యా కూడా దృష్టి సారించవలసి ఉంటుంది.

  2. ఉద్యోగం, వ్యాపారం

  2. ఉద్యోగం, వ్యాపారం

  మీ పనియందు నిబద్దత మీ యజమానిని ఆకట్టుకునేలా చేయగలదు. వాస్తవానికి, మీ సహోద్యోగులు అసూయపడేలా మీ పట్ల యజమాని ఎక్కువ శ్రద్ధను కనపరుస్తారు. ఈ పరిస్థితి మీకు ఒక్కోసారి అనుకూలంగా ఉన్నా కూడా ఒక్కోసారి వ్యతిరేకంగా కూడా ఉంటుంది. మీరు మీ కస్టమర్లతో సహా ప్రతి ఒక్కరితోనూ మీ సంబంధాలను సరైన రీతిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. యజమాని మీ పట్ల అధిక శ్రద్ద చూపారని గర్వం ప్రదర్శించడం మీకు సరైనది కాదని గుర్తుంచుకోండి. ఈ పద్దతి మిమ్ములను సహోద్యోగుల నుండి దూరం చేస్తుంది. మరియు మీ వలన కార్యాలయంలో ఒక అస్థిరత నెలకొనే అవకాశo ఉంది.

  అందరితోనూ సరైన సంబంధాలను కొనసాగిస్తేనే మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. గర్వం అనేది మొదటికే మోసం తెస్తుంది. సింహ రాశి వారి ప్రధాన లక్షణం, అందరి ద్యాసను తమవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించడం. కానీ ఆ పద్దతి మిమ్ములను ఈ నెలలో కిందకు దిగజారుస్తుంది. ముఖ్యంగా మీ ఆఫీసు వ్యవహారాల నందు. పని యొక్క అసాధారణ పద్ధతులకు మీరు ఆకర్షించబడవచ్చు. కానీ ఈ పద్దతులు సంఘానికి వ్యతిరేకంగా ఉండవచ్చు. మీ హృదయాన్ని అనుసరించండి, కానీ మీ తెలివికి పదును పెట్టండి.

  3. ఆర్ధిక వ్యవహారాలు

  3. ఆర్ధిక వ్యవహారాలు

  ముందు నెలలతో పోల్చి చూస్తే ఆర్ధికంగా ఈ నెల ఉత్తమంగా ఉంది. ముందు నెలల గుణపాఠాలు, మరియు అనుభవాలతో ఈ నెల ఉత్తమంగా సాగుతుంది. ఈ నెల దీర్ఘకాలిక పధకాలలో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం. ఆర్ధికపరంగా ఉత్సాహభరితంగా ఉన్నప్పటికీ, మీ విశ్రాంతి కార్యకలాపాలకు మరియు ఎంటర్టైన్మెంట్ ఖర్చులు మీకు అదనపు భారాన్ని తీసుకుని రావొచ్చు. తద్వారా మీ ఆర్ధిక పరిస్థితిపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కూడా ఈ నెలలో అధికంగా ఉంటాయి.

  మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడి సంపాదించడానికి గ్రహాలూ మీకు అనుకూలతను సూచిస్తున్నాయి. కానీ గ్రహాల అనుకూలతను మీరు దుర్వినియోగం చేయకూడదు. అత్యాశ మొదటికే మోసాన్ని తీసుకుని రాగలదు. మీ కుటుంబ సభ్యుల నిర్ణయాల ప్రకారం మీ ఇంటిని పునరుద్ధరించే ప్రణాళికలు చేయవలసి ఉంటుంది. మీ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా కూడిన స్వావలంబనతో మీ కుటుంబ సభ్యులను ఏదైనా దూరప్రాంతాలకు తీసుకుని వెళ్ళగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహాన్ని, ఆర్ధిక పరమైన అంశాలని విడివిడిగానే చూస్తారు. తద్వారా స్నేహ సంబంధాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. వీటిని మళ్ళీ చక్కదిద్దుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది.

  4. ప్రేమ, వివాహ జీవితం

  4. ప్రేమ, వివాహ జీవితం

  గొప్ప సామాజిక సంబంధాలు మరియు ఆలోచనా ధోరణి ఈ నెల సులభంగా ఒక భాగస్వామిని కనుగొనేందుకు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ప్రేమ లేదా పెళ్ళితో ముడిపడిఉన్న వ్యక్తులైతే కొన్ని అసంబద్ద విషయాలలో వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ భాగస్వామితో మీరు విశ్వసనీయంగా ఉండాలని నిర్ధారించుకోండి. అలాగే, మూడవ వ్యక్తి యొక్క జోక్యం మీ అపార్ధాలకు కారణభూతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ భాగస్వామిపై మీకున్న అచంచల విశ్వాసమే మీ సంబంధాన్ని నిలబెట్టగలదు.

  పెళ్లైన వ్యక్తులకు, మీ భాగస్వామితో ఆహ్లాదకరమైన కార్యకలాపాలలో పాల్గొనడానికి సరైన సమయం కావచ్చు. వారు మీకు త్వరలోనే కొన్ని శుభవార్తలను ఇవ్వవచ్చు లేదా మీకేదైనా సర్ప్రైజ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు విమర్శలకు తావివ్వకుండా వారిలో ఉన్న ప్రేమను చూడండి.

  5. అదృష్ట రంగులు, సంఖ్యలు

  5. అదృష్ట రంగులు, సంఖ్యలు

  ఈ నెలలో సింహ రాశి వారికి సూచిoచదగిన రంగులుగా ఆకుపచ్చ మరియు నీలం రంగులు ఉన్నాయి. మరియు అదృష్ట సంఖ్యలుగా 2 మరియు 6 ఉన్నాయి. అదృష్ట రత్నంగా రూబీ (కెంపు) సూచించబడింది. కానీ అదృష్ట రత్నం విషయంలో మాత్రం జ్యోతిష్యుని సంప్రదించి, గ్రహాల స్థితిగతుల ఆధారంగా నిర్ణయించుకుని ధరించవలసినదిగా సూచించడమైనది.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి రాశి చక్రాలు, మరియు అనేకములైన ఆద్యాత్మిక వివరాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి

  English summary

  June 2018 Horoscope Predictions For Leo

  The Sun in your zodiac house will bless you with abundant positive energy and will help compel you to make positive changes wherever necessary. You will plan to indulge in many extracurricular activities apart from your usual work, which will fill you up with renewed energy.At work, most of your efforts will be appreciated. You may tend to ignore family matters.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more