For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తులరాశికి చెందిన జూన్ 2018 మాసఫలాలు

|

తులారాశి వారు ఆకర్షణీయంగా ఉంటారు. విపరీతమైన వ్యక్తిత్వ ధోరణి కలిగి ఉంటారు. ఈ ఏడాదిలో ఎక్కువ శాతం మీకు అనుకూలంగానే ఉన్నా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కలవు. మీలో అంతర్గత సంఘర్షణ అధికమవుతుంది. జీవితంలోని కీలక విషయాల గురించి మీలో మీరు మథనపడతారు. అటువంటి ఘర్షణ పరిస్థితులకు దారితీసిన రూట్ కాజ్ ల గురించి మీరు తెలుసుకుంటే సమస్యలను పరిష్కరించే విధంగా ఆలోచనలు చేయవచ్చు. ఈ విధంగా మీ జీవితంలోని మీరే డైరెక్షన్ లో ప్రయాణించాలని అనుకుంటున్నారో కూడా స్పష్టమవుతుంది.

మీ సున్నిత స్వభావాన్ని అలుసుగా తీసుకునే అవకాశం ఎవరికీ అందించకండి. మిమ్మల్ని గ్రాంటెడ్ గా తీసుకోనివ్వకండి. వృత్తిని మరియు ఇంటిని మేనేజ్ చేసే బ్యాలెన్సింగ్ స్కిల్స్ మీలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, ఈ విషయంలో ఎటువంటి సమస్యలూ తలెత్తవు. చేతిలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు మీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీరు మీ లక్ష్యసాధన నుంచి దృష్టి మరల్చుకోరు.

ఈ నెల మధ్యలో ఏర్పడే సూర్యగ్రహణం వలన కెరీర్ పాత్ అనేది మార్పులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల పట్ల మీరు కచ్చితంగా ఉండాలి. కెరీర్ పరంగా ఏర్పడే మార్పులకు మీరు సంసిద్ధంగా ఉండాలి. అలాగే, ముఖ్యమైన విషయాలకు సంబంధించి మీ జీవితంలోని కీలక వ్యక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం.

ఇక్కడ, జూన్ 2018 లో మీ రాశియొక్క మాసఫలాలను పొందుబరిచాము. ఈ ప్రెడిక్షన్స్ ను చదవడం ద్వారా కెరీర్, ఫైనాన్సస్ అలాగే లవ్ లైఫ్ కి సంబంధించిన విషయాలపై ఒక అవగాహనకు రావచ్చు.

1. ఆరోగ్యం

1. ఆరోగ్యం

ఈ నెలలో మీ ఫోకస్ మొత్తం ఫిజికల్ హెల్త్ పై కంటే స్పిరిట్యువల్ హెల్త్ పై ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనల వలన రోజువారీ జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది. జీవితంలోని ముఖ్యమైన అంశాలపై మీరు ఫోకస్ ని పెట్టగలుగుతారు.

ఈ నెలలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఎదురుకాకపోయినప్పటికీ, మీ ఈటింగ్ హ్యాబిట్స్ విషయంలో మీరు మరింత శ్రద్ధ కనబరచడం ముఖ్యం. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయడం వలన కూడా ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారికి ఈ నెలలో ఉపశమనం అందుతుంది.

ఈ నెల బంగీ జంప్ లేదా స్కై డైవింగ్ వంటి శారీరక అలసటను కల్గించే హాబీస్ పై దృష్టి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది కాబట్టి ఇటువంటి యాక్టివిటీస్ పై మీరు దృష్టి పెట్టగలుగుతారు. నిజానికి, మీరు సాహసోపేతంగా కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా, నెల చివరలో మీలో ఈ ఆలోచనలు ఎక్కువవుతాయి. ఈ యాక్టివిటీస్ వలన ఏర్పడే అడ్రినల్ రష్ అనేది మానసికంగా ప్రశాంతతను అందిస్తుంది.

2. కెరీర్

2. కెరీర్

ఈ నెలలో అటు వ్యాపారపరంగా ఇటు ఉద్యోగపరంగా అభివృద్ధిగలదు. ఈ నెలలో వ్యాపార పరంగా గొప్ప అభివృద్ధిని గమనిస్తారు. ఉద్యోగ మార్పుల కోసం చూసే వారికి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఎదురవుతాయి. అయితే, నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి. లేదంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

మనసు చెప్పేది పాటించడం వలన ప్రశాంతత లభిస్తుంది.

మెదడు చెప్పేది పాటించడం వలన మనోబలం లభిస్తుంది.

వర్క్ ప్లేస్ లో కమ్యూనికేషన్ ఛానల్స్ దృఢంగా ఉండవు. అందువలన, మీకు మీ సహోద్యోగులకు మధ్య విబేధాలు తలెత్తవచ్చు. అటువంటి పరిస్థితులను నేర్పుతో ఎదుర్కోవడం మంచిది.

మెచ్యూర్డ్ గా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వర్క్ లోడ్ ఎక్కువగా ఉండకపోవచ్చు. అయినా, ముఖ్యమైన ప్రాజెక్ట్స్ కు మీరు మరింత సమయం కేటాయించడం వలన ఉపయోగం ఉంటుంది. మీ కొలీగ్స్ కు సహాయాన్నందిస్తూ ఉంటే మీ గుడ్ విల్ వర్క్ ప్లేస్ లో మరింత పెరుగుతుంది.

3. ఆర్థికపరంగా

3. ఆర్థికపరంగా

ఆర్థికపరంగా అభివృద్ధిని పొందేందుకు మీరు కొన్ని నియమాలను ఉల్లంఘించే ప్రమాదం ఉంది. అటువంటి షార్ట్ కట్ పద్దతుల వల్ల మీరు ప్రమాదంలో పడవచ్చు. కాబట్టి, అటువంటి పద్ధతులకు స్వస్తి పలకండి. వివిధ సోర్సెస్ నుంచి మీకు భారీ ఆదాయం లభిస్తుంది. అనవసర ఖర్చుల నుంచి దూరంగా ఉండండి.

నమ్మదగిన మ్యూచ్యువల్ ఫండ్స్ లోని పెట్టుబడులు మీ డబ్బును సురక్షితంగా ఉంచడంతో పాటు భారీ లాభాలను ఆర్జించవచ్చు. అప్పు ఇవ్వడం వలన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. స్నేహితులు కూడా అప్పును తిరిగి చెల్లించకపోవచ్చు. కాబట్టి, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి.

డబ్బును ఎందులోనైనా పెట్టుబడి పెట్టేముందు వాటికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ను మీరు క్షుణ్ణంగా చదవాలి. అప్పుడే, మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. ఆర్థికపరంగా మీకు ఈ నెల సానుకూలంగా ఉంటుంది. ఈ నెల 22 తరువాత మరింత సానుకూలంగా మారుతుంది.

4. లవ్ లైఫ్

4. లవ్ లైఫ్

లవ్ లైఫ్ లో ఒడిదుడుకులు తప్పవు. మీ పార్ట్నర్ తో విబేధాలు తలెత్తే సూచనలు కలవు. మీ ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. అలాగే అన్యోన్యత కూడా పెరుగుతుంది. వాటితో పాటు కొన్ని విబేధాలు కూడా ఏర్పడతాయి. రిలేషన్ షిప్ లో ఏర్పడే సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయి. ఎందుకంటే, మీరు ఒకరిని విడిచి ఒకరు జీవించలేరు.

ఎక్లిప్స్ కారణంగా అవివాహితులకు భాగస్వామి దొరకడంతో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే, ఎక్లిప్స్ తరువాత సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ ఫలించే అవకాశం ఉంది.

తులా రాశి వారు తమ భాగస్వామిని విపరీతంగా అభిమానిస్తారు. ప్రేమను గౌరవిస్తారు. అందుకే, వీరిని ప్యాషనేట్ లవర్స్ గా పేర్కొంటారు. అదే విధమైన ప్యాషన్ ను వీరు తమ భాగస్వామి నుంచి ఆశిస్తారు. అటువంటి స్పందన రాకపోతే వీరు నిరాశకు గురవుతారు.

వివాహితులు ఈ సమయంలో గుడ్ న్యూస్ ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీ కుటుంబంలోకి చిన్నారి ప్రవేశించవచ్చు. ఈ న్యూస్ వలన దంపతుల మధ్యనున్న విబేధాలు తొలగిపోతాయి.

5. అదృష్టాలు

5. అదృష్టాలు

అదృష్ట రంగులు- పింక్ మరియు గ్రీన్

అదృష్ట సంఖ్యలు - 4, 6, 13 మరియు 15

గమనిక: ఇవన్నీ సాధారణ ప్రెడిక్షన్స్ మాత్రమే. వ్యక్తిగత జాతకఫలితాల కోసం అనుభవజ్ఞుడైన జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించండి.

English summary

June 2018 Horoscope Predictions For Libra

Librans are known for their charming and extreme personality. Though most of this year is predicted to be positive for you, there may be some not-so-pleasant instances as well. You will be troubled with a lot of conflict between you and your inner self with regards to all major aspects of life.
Story first published: Friday, June 1, 2018, 12:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more