For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశి చక్రం ప్రకారం మీరు గర్వపడే అంశాల గురించి తెలుసుకోండి

|

ప్రతి రాశిచక్రం తనకంటూ ప్రత్యేకించబడిన కొన్ని స్వభావాలను కలిగి ఉంటుంది. అందులో కొన్ని సానుకూలంగా కనిపిస్తే కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. కానీ ప్రతికూల లక్షణాలను చూసి బాధపడేకన్నా, ఉత్తమమైన లక్షణాలను వెతికి వెలికి తీయడం ద్వారా సానుకూల దృక్పథం అలవడుతుంది. ఇక్కడ ప్రతి రాశిచక్రం గర్వపడే ఉత్తమ లక్షణాల గురించిన వివరాలను తెలియజేసే క్రమంలో ఈ వ్యాసం దోహదపడుతుంది.

మేష రాశి :

మేష రాశి :

వృత్తిపరమైన విషయాలలో కృషి, పట్టుదల , నిబద్ధత, నేర్పు మొదలైన అంశాల మేలుకలయికతో ఉండే మేషరాశి వారు, తమకు ఇచ్చిన పనిని పూర్తిచేసే క్రమంలో చివరి రక్తపు బొట్టు వరకు శ్రమను ధారపోస్తారు. ఓడిపోవడం కన్నా ప్రయత్న హీనులుగా మిగిలిపోవడం మేష రాశి వారికి నచ్చని పనిగా ఉంటుంది. మరియు కఠినమైన పని నియమాలను సైతం కలిగి ఉంటారు.

వృషభ రాశి :

వృషభ రాశి :

స్థిరమైన వ్యక్తిత్వానికి నమ్మకమైన స్వభావానికి మారుపేరుగా వృషభరాశి వారు ఉంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తమకు ఉన్న దానితో సంతృప్తి చెందుతూ, కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలతో సంసారాన్ని నడపగలిగిన అనుభవజ్ఞులుగా వుంటారు. దూరాలోచనలు చేయగలిగిన నేర్పు కలిగివుంటారు. వీరి ప్రతి చిన్న నిర్ణయం వెనుక కుటుంబ సభ్యుల ప్రోత్సాహకం‌ ఉండాలని భావిస్తుంటారు.

మిధున రాశి :

మిధున రాశి :

మిధున రాశి వారు గొప్ప సంభాషణ వేత్తలుగా, చమత్కార నైపుణ్యాలు కలిగి ప్రజలను తమవైపు ఆకర్షించగలిగే సామర్ధ్యాలను కలిగి ఉంటారు. క్రమముగా ఇతర రాశిచక్రాల వారు సైతం మిధునరాశి వారి ముందు ప్రతి విషయమును గురించి చర్చించుటకు సుముఖత చూపుతుంటారు.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారు అధికమైన భావోద్వేగాలను కలిగి, సున్నిత మనస్కులుగా ఉంటారు. లాభాపేక్షలేని స్నేహ పూరిత సంబంధాలకు, ప్రేమలకు, కుటుంబ బాందవ్యాలకు, సన్నిహితుల ఆదరాభిమానాలకు అత్యంత విలువనిచ్చే వీరు, తాము ప్రేమించిన వ్యక్తుల పట్ల అధిక నిబద్ధతను ప్రదర్శిస్తుంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో అయినా ప్రేమను సమాధానముగా కలిగి పరిస్థితులను చక్కబెట్టే సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు

సింహ రాశి :

సింహ రాశి :

సింహరాశి వారు ఎక్కడ ఉన్నా తమ ఉనికిని చాటుకోగల సిద్ధహస్తులుగా పేరెన్నిక గలవారు. ఇతరుల దృష్టిని తమవైపుకు మరల్చుకోగలిగేలా విధానాలను ఆచరించే సింహరాశి వారు, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటారు. జీవితంలో ఏ అంశాన్ని కూడా తేలికగా తీసుకోకుండా, తమ శక్తియుక్తులను ఉపయోగించి ఉత్తమమైన ఫలితాలను తీసుకొని వచ్చేలా ప్రణాళికలు చేస్తుంటారు. అంతేకాకుండా కుటుంబపరంగా ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలని ఆలోచనలు చేస్తుంటారు.

కన్యా రాశి :

కన్యా రాశి :

ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు చేసే కన్యారాశి వారు, కుటుంబం మరియు వృత్తిపరమైన అంశాలలో ఖచ్చితత్వంతో వ్యవహరిస్తుంటారు. తమకు అనువుగానిచోట ఉనికి లేదని భావించే కన్యారాశి వారు, తమ కుటుంబ సభ్యుల నుండి కూడా సహకారాన్ని కలిగి ఉండాలన్న ఆలోచనలు చేస్తుంటారు. వీరి ప్రతి ఆలోచన వెనక తమ ప్రియమైన వారి సంక్షేమం ఉంటుంది. తమ విధివిధానాలను అమలుపరిచే క్రమంలో కనికరములేని భావజాలాలను ప్రదర్శిస్తూ, ఉత్తమమైన ఫలితాలను రాబట్టే ప్రయత్నం చేస్తుంటారు. మోసం, వెన్నుపోటుతనం వంటి లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులను తమ జీవన మార్గంలో ఎన్నటికీ అంగీకరించలేరు.

తులా రాశి :

తులా రాశి :

మనోహరమైన వ్యక్తిత్వానికి, ఆకర్షణీయమైన విధానాలకు తులారాశి వారు ప్రత్యేకించబడి ఉంటారు. అధికమైన భావోద్వేగాలను మనసులో దాచుకుని ఉండే వీరు తమ ప్రియమైన వారిపట్ల అధికమైన నిబద్ధతను కలిగి ఉంటారు. విశ్వాసం అంకితభావంతో కూడిన ఆలోచనలతో ప్రతి ఒక్కరికీ ‌నమ్మకస్తులై ఉంటారు.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి వారు ప్రజల యొక్క అంతర్ముఖమును చూడగలిగిన నేర్పును కలిగి ఉంటారు. క్రమముగా ఇతరుల మాటలకు అంత తేలికగా ప్రభావితం కాని వారిగా, తెలివిని ప్రదర్శిస్తుంటారు. మరియు ప్రతి ఒక్క విషయంలో నిజానిజాలను తెలుసుకొని నిర్ణయం తీసుకోగలిగిన తెలివితేటల కారణంగా, సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి :

ఉత్తమమైన తెలివితేటలకు, నేర్పరితనానికి తార్కాణంగా ఉన్న ధనుస్సురాశి వారు, కొత్త విషయాలను తెలుసుకొనే క్రమంలో ఉత్సుకతను ప్రదర్శిస్తుంటారు. వీరి ఆలోచనా విధానాల కారణముగా, ఇతరుల మాటలకు ప్రలోభపడే వ్యక్తులుగా ఉండకుండా తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు. నిజనిర్ధారణలో సామర్ధ్యాల కారణముగా సంఘంలో మంచి గుర్తింపును కలిగి ఉంటారు.

మకర రాశి :

మకర రాశి :

ధైర్యం మరియు తెగింపు ఆభరణాలుగా కలిగిన మకరరాశి వ్యక్తులు, లక్ష్యసాధనలో వెనుదిరగని, అలుపెరుగని పోరాటం చేస్తూ ఉత్తమ ఫలితాలను సాధించే క్రమంలో ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తుంటారు.

కుంభ రాశి :

కుంభ రాశి :

వైవిద్యమైన ఆలోచనలు కలిగి ఉండే వీరు, సృజనాత్మక ధోరణులతో ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటారు. మరియు ప్రతి విషయమును విభిన్న కోణాలలో ఆలోచించగలిగే సామర్థ్యం కలిగిన కుంభరాశి వారు, ఆర్థికపర నిర్ణయాల నందు అత్యుత్తమ ప్రణాళికలు చేయగలిగే వారిగా ఉంటూ, కుటుంబంలో మంచిపేరును కలిగి ఉంటారు.

మీన రాశి :

మీన రాశి :

ప్రపంచంతో ఆధ్యాత్మిక సంబంధాలను ఏర్పరుచుకో గలిగిన మీనరాశి వారు, విభిన్న దృక్కోణాలతో భిన్న మనస్కులను అంచనా వేయగలిగిన సామర్ధ్యాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వీరు తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్య గొలిపే విధంగా ఉంటాయి.

English summary

Know what you are proud of according to your Zodiac Sign

every zodiac sign is quite unique in itself. All of the natives of different zodiacs in the house possess certain qualities, both negative and positive. However, rather than delving into the negativity let us delve into the positive traits and understand what is each astrological sign proud of!
Story first published: Friday, August 10, 2018, 16:26 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more