తులారాశికి చెందిన మే 2018 హోరోస్కోప్ ప్రెడిక్షన్స్

Subscribe to Boldsky

తులారాశికి చెందిన వారు బాలన్స్డ్ గా ఉంటారు. వీరు ఉదారస్వభావం కలిగిన వారు. అలాగే లక్షణమైన వారు. వీరు మంచి నడత కలిగిన వారు. సహజంగానే అందమైన వారు.

వీరు మృదువుగా మాట్లాడతారు. వీరు జెంటిల్ గా ఉంటారు. వీరికి సహాయపడే తత్త్వం ఎక్కువ. గొడవలు పడే మనస్తత్వం కాదు. అనవసరపు ఆర్గ్యుమెంట్స్ లో తలదూర్చరు.

అయితే, కొన్ని విషయాల గురించి వీరు కచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే, ఈ ప్రెడిక్షన్స్ అనేవి వీరికి ఎంతో ఉపయోగపడతాయి.

Libra May 2018 Horoscope Predictions

ఈ ఆర్టికల్ లో ఆస్ట్రో నిపుణులు అందించిన విషయాలను పొందుపరచాము. మే నెలకు చెందిన ప్రెడిక్షన్స్ ను ఇక్కడ వివరించాము. తులారాశివారు ఈ ప్రెడిక్షన్స్ ను చదివి తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు.

ఆరోగ్యం:

ఈ నెలలో ఆరోగ్యం సజావుగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అయితే, మీ భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యం విషయంలో మీరు మరింత శ్రద్ధ వహించాలి. మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు వహించే శ్రద్ధ ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

వృత్తి:

వృత్తిపరంగా ఈ నెల ఈ రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రయాణం చేసే సూచనలు కలవు. ప్రయాణం ద్వారా మీరు ఎంతో లబ్ది పొందుతారు. పడమటి వైపు ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తమ్మీద, ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఫీల్డ్ వర్క్ లో మీరు ఎంతో సాధిస్తారు.

Libra May 2018 Horoscope Predictions

ఆర్థిక లావాదేవీలు:

ఆర్ధికపరంగా ఈ నెల మీకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. బిజినెస్ పని మీద మీరు ప్రయాణించే సూచనలు కలవు. అయితే, మీ కష్టమంతా వృధాగా మారుతుంది. ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ బిజినెస్ లో ఉండేవారు కొంత సంయమనం పాటిస్తే మంచిది. ఈ నెల వీరికి అనుకూలంగా ఉండదు. ఈ నెలలో లోప్రొఫైల్ ను మెయింటెయిన్ చేయడం వలన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు.

Libra May 2018 Horoscope Predictions

లవ్ లైఫ్:

ఈ నెలలో మీ భాగస్వామి మీకు గ్రాండ్ సర్ప్రైజ్ ను అందిస్తారు. మూడవ తారీఖు నుండి ఆరవ తారీఖు లోపల కొత్త ఫ్యామిలీ మెంబర్ గురించి మీకు వార్త అందుతుంది. రిలేషన్ షిప్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకుని వెళ్లాలనుకునే వారికి ఈ నెలలో రెండవ వారం ఉపయోగకరంగా ఉంటుంది. మరోవైపు, ఈ నెల ఆఖరివారంలో భాగస్వామితో చిన్నపాటి గొడవలు అలాగే ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం కలదు.

Libra May 2018 Horoscope Predictions

అదృష్ట తేదీలు అలాగే రంగులు:

తులారాశికి ఈ నెలలో అదృష్ట సంఖ్యలు : 7, 20, 55, 77 మరియు 86.

అదృష్ట తేదీలు: 7, 8, 17, 18, 25, 26.

అదృష్ట రంగులు: తెలుపు, ఆకుపచ్చ మరియు నీలం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Libra May 2018 Horoscope Predictions

    The Libra sign individuals are known to be balanced. They are graceful and elegant. These individuals are well mannered and charming by nature as well. Librans are usually soft-spoken individuals who are gentle and poised in their mannerisms too. They are very helpful and never like to fight or get into any arguments. But there are certain things that these individuals need to be aware of and this is when the predictions play a vital role.
    Story first published: Tuesday, May 1, 2018, 4:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more