మకరరాశి మే 2018 హోరోస్కోప్ ప్రెడిక్షన్స్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మాసఫలాలను తెలుసుకోవడం ద్వారా ఆ నెలలో మీరు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించవచ్చు. తద్వారా, ప్రతికూల పరిస్థితులకు దూరంగా ఉండవచ్చు. సానుకూల సమయంలో కొంచెం ప్రశాంతంగా ఉండవచ్చు. ఈ నెలలో మీ రాశిఫలాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

ఈ రాశికి చెందిన వారు సాంప్రదాయ విలువలకు కట్టుబడి ఉంటారు. బాధ్యతకలిగిన పౌరులుగా వ్యవహరిస్తారు. సహజంగానే గంభీరత్వం కలిగి ఉంటారు. వీరు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు.

వీరు ఇటు పెర్సనల్ గా అలాగే ప్రొఫెషనల్ గా గణనీయమైన అభివృద్ధిని సాధిస్తారు.

వీరు స్వీయనియంత్రణ కలిగి ఉంటారు. వీరి వద్ద పనిచేసే ఎంతో మందిని వీరు మేనేజ్ చేయగలుగుతారు.

Monthly Predictions For Capricorn Zodiac For May 2018

ఈ రాశిలో జన్మించిన వారు తమ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వాటిలో ఎదురైన తప్పులను పరిగణలోకి తీసుకుని సరైన ప్రణాలికను రచించడంలో సిద్ధహస్తులు.

మారోవైపు, ఇతరుల నుంచి వ్యతిరేక అభిప్రాయాలను స్వీకరించడంలో వీరు ఇబ్బందిపడతారు.

మకరరాశికి చెందిన మంత్లీ ప్రెడిక్షన్స్ ను ఇక్కడ వివరించాము. వీటిని చదివి మకరరాశికి చెందిన మాసఫలాలను తెలుసుకోండి.

ఈ రాశికి చెందిన వారు కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టాలి. అలాగే ఈ నెలలో ప్రొఫెషనల్ టార్గెట్స్ అలాగే పెర్సనల్ యాంబిషన్స్ కంటే మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది.

ఆరోగ్యం:

గత నెల కంటే ఈ నెల మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శరీరం చురుగ్గా ఉంటుంది. మరోవైపు, డిటాక్సిఫికేషన్ తో పాటు మసాజ్ లు మీ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి తోడ్పడతాయి. సరైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి.

వృత్తిపరంగా:

ఈ నెలలో వర్క్ లో మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తగలవు. మీ పనిలో మీరు మరింత శ్రద్ధను కనబరచడం ద్వారా అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని నిర్థారించుకోవచ్చు. అంతేకాక, ఇలా చేయడం వలన ముందుగానే రాబోయే ఇబ్బందులను మీరు గ్రహించే అవకాశం ఉంటుంది. తద్వారా తీసుకోవలసిన తదుపరి చర్యలు మీరు దృష్టి పెట్టగలిగే అవకాశం ఉంటుంది. కేవలం, మీ కృషి మరియి సామర్థ్యంపైనే మీరు ఆధారపడాలి.

ఆర్థికపరంగా:

నిపుణుల ప్రకారం ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి మీకు సానుకూలంగా ఉండదు. గవర్నమెంట్ సెక్టార్స్ లో పనిచేస్తున్న వారికి ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. కొన్ని నష్టాలను భరించవలసి వస్తుంది. ఆశించిన లాభాలను పొందలేకపోతారు. అందువలన, ఈ నెలలో లోప్రొఫైల్ ను పాటించడం మంచిది.

లవ్ లైఫ్:

ఈ నెల మీ ప్రేమానుబంధాలు బలపడడానికి అనుకూల సమయం. మొదటి వారంలో మీ పార్ట్నర్ స్పెషల్ గా ఫీల్ అయ్యే చిన్ని చిన్ని అంశాలపై మీరు దృష్టి పెట్టాలి. వర్క్ కమిట్మెంట్స్ లో మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏర్పడితే మీ పార్ట్నర్ ను కూడా మీతో తీసుకెళ్లడం ఉత్తమం. నిపుణుల అంచనా ప్రకారం ఈ నెలలో అంటే 21 తేదీ వరకు మీరు ప్రేమానుబంధంలో ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. అలాగే, ఫన్, అమ్యూజ్మెంట్ మరియు గాసిప్స్ కూడా తోడవుతాయి.

అదృష్ట తేదీ మరియు రంగులు

ఈ నెలలో ఈ రాశికి సంబంధించిన అదృష్ట సంఖ్యలు - 3, 21, 66, 83, మరియు 84.

అదృష్ట తేదీలు: 4, 5, 6, 14, 15, 23, 24, 31.

అదృష్ట రంగులు: బ్లూ, పైన్ మరియు గ్రీన్.

English summary

Monthly Predictions For Capricorn Zodiac For May 2018

With monthly horoscope, you can start your month in a well-planned way. This is something that will help you stay away from the negative circumstances and it can also help you to pace-up during the best of the predicted days. Learning about your zodiac sign's monthly predictions gets important as it helps us realise about the oncoming events for the month.
Story first published: Thursday, May 3, 2018, 7:00 [IST]