2018 మే నెల మీనరాశి జ్యోతిష్య ఫలితాలు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీనరాశికి చెందిన వ్యక్తులు అన్నిరాశులనూ కలిపిన లక్షణాలు కలిగివుంటారు.ఈ రాశికి చెందినవారు చాలా దయాస్వభావం కలిగివుండి, ఇతరులను బాధపెట్టకుండా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు.

దయతో ఉంటారు, నమ్మకస్తులు, స్నేహస్వభావం, మంచి ప్రవర్తన, ఇతరులను అర్థం చేసుకునే మనస్సు కలిగివుంటారు. తమచుట్టూ ఉన్నవారి ఫీలింగ్స్ కి సున్నితంగా స్పందిస్తారు.

వీరికి కొంచెం సాహస స్వభావం ఉంటుంది, ఆశయాలు కలిగివుంటారు, దీనివలన వారు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, ఉత్సాహంగా, అలసట లేకుండా ఉంటారు.

మరోవైపు, కొత్త ఆలోచనలకి ఎప్పుడూ సానుకూలంగా ఉంటారు, తెలివిగా అర్థం చేసుకోగలరు. ఇవన్నీకాక,ఇతరులతో కలిసిపోయి,సాంఘికంగా చాలా పాపులర్ అవుతారు. ఈ గుణాలన్నీ కాక, మే 2018లో వీరికి కాలం,అదృష్టం ఎలా ఉండబోతోందో మా జ్యోతిష్య నిపుణులు ఈరోజు ఇక్కడ తెలుపుతారు. చదవండి.

Monthly Predictions For Pisces Zodiac For May 2018

ఆరోగ్యం

మా జ్యోతిష్య నిపుణులు మీ ఆరోగ్యం ఈ నెల 21వ తేదీ వరకు అద్భుతంగా ఉండబోతోందని చెప్తున్నారు. తర్వాత మీకు అనారోగ్యం వచ్చే అవకాశాలు తరచుగా ఉండవచ్చు. ఆ సమయంలో మీకు విశ్రాంతి చాలా అవసరం. మీరు ప్రశాంతంగా ఉండటం కోసం ధ్యానం, ఆధ్యాత్మిక విషయాలు ప్రయత్నించవచ్చు.

వృత్తి గురించి

ఈ నెలలో మీ పని చాలా పెరుగుతుంది, పని మాత్రమే కాదు ఆలోచనలు, చింతలు కూడా పెరుగుతాయి. పనిచేసే చోట ఏ రకమైన రాజకీయాల్లో ఇరుక్కోకుండా చూసుకోండి. మీ పై ఇతరుల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఈ నెల ఆర్థిక సంగతులు

ఈ నెల చాలా లాభదాయకమైన సమయం, మంచి అవకాశాలు వచ్చే సమయం, అందుకే మీరు పూర్తిగా ఈ కాలాన్ని వినియోగించుకోవాలి. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్నవారికి ఈ నెలలో చాలా లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారాలు తెరవటానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి, వ్యాపారరంగం వారికి కూడా ఈ సమయం అదృష్టాలను తెచ్చిపెడుతుంది. ఇలా ఈ రంగాలవారు అందరికీ ఈ నెల చాలా లాభకరమైనది.

ప్రేమ జీవితం గురించి

ఈ నెలలో మీ భాగస్వామితో మీ బంధం గురించి ఏకాగ్రతతో శ్రద్ధతీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల సాంఘికంగా మీ మాయ చాలా శక్తివంతంగా ఉండవచ్చు. అందుకని ఇదివరకే ఉన్న బంధం వెనక్కి తగ్గుతుంది. మరోవైపు మీ ప్రేమ నెమ్మదిగా చిగురించటానికి సమయం ఇవ్వండి. మీరు లేదా మీ భాగస్వామి తెలియనివారితో కలిసి సమయం గడుపుతారు, తర్వాత దాని గురించి బాధపడవచ్చు.

అదృష్టసంఖ్యలు, రంగులు

ఈ నెలలో మీ రాశికి కలిసొచ్చే అదృష్టసంఖ్యలు - 17,40,46,61 మరియు 76

అదృష్ట తేదీలు ; 6,7,8,17,18,25,26

అదృష్ట రంగులు ఆకుపచ్చ, పల్చటి పసుపు

English summary

Monthly Predictions For Pisces Zodiac For May 2018

Pisces May 2018 prediction forecasts that professional growth, along with personal desires, will be as important as home and family. May is the month when their need for emotional strength will be vital. A lot more predictions about the zodiac sign helps them to stay healthy and careful in things that they do.
Story first published: Wednesday, May 2, 2018, 11:51 [IST]