For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీనరాశికి చెందిన జూన్ 2018 మాసఫలాలు

  |

  మీనరాశికి చెందిన వ్యక్తులు స్నేహపూర్వకమైనవారు. వీరు ప్రశాంతంగా ఉంటారు. వీరిలో ఉదారస్వభావాన్ని మీరు గుర్తించగలుగుతారు. అలాగే స్నేహపూర్వక స్వభావంతో ఎక్కువ మందిని ఆకట్టుకుంటారు. అందువలన, వీరి చుట్టూ ఉండే వారు వీరితో మనసువిప్పి మాట్లాడేందుకు ఇష్టపడతారు. వీరి సలహాలను కోరతారు. దారిలో ఎదురయ్యే అడ్డంకుల్ని చాలా సులభంగా ఎదుర్కొంటారు. వీరి మనసు వెన్నవంటిది. వీరిలో క్షమాగుణం కూడా ఎక్కువే. మీనరాశికి చెందిన వ్యక్తులు తమ భావోద్వేగాలను ప్రదర్శించడానికి ఇష్టపడతారు. ప్రేమను పంచుతారు. ఈ లక్షణాల వలన వీరు మరింత ప్రత్యేకంగా మారతారు.

  మీనరాశికి చెందిన వారు జూన్ 2018లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. అల్లకల్లోలాలను మీరు ఎంతో నేర్పుతో ఎదుర్కోవాలి. ఇందుకు మీరు పరిస్థితులను బాగా విశ్లేషించగలగాలి. దాదాపు 60 శాతం గ్రహాలన్నీ ఈ నెలలో గ్రాండ్ స్క్వేర్ ప్యాటర్న్ లో ఉన్నాయి. అందువలన, అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. మీనరాశికి చెందిన వారు ఈ నెలలో నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తిపరంగా, కుటుంబపరంగా, భావోద్వేగాల పరంగా, అలాగే లవ్ లైఫ్ మరియు సోషల్ లైఫ్ లో ఎన్నో కాంఫ్లిక్ట్స్ ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ కాంఫ్లిక్ట్స్ ని మీరు సహనంతో అలాగే నేర్పుతో ఎదుర్కోవలసిన సమయం ఇది.

  ఈ నెలలో మీరు వృత్తిపరంగా, కెరీర్ పరంగా అలాగే ఆర్ధిక స్థితిగతులలో అలాగే లవ్ లైఫ్ లో ఎటువంటి ఫలితాలను ఆశించవచ్చో ఇక్కడ తెలుసుకోవచ్చు.

  ఆరోగ్యపరంగా:

  ఆరోగ్యపరంగా:

  ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ ప్రకారం ఈనెలలో మీనరాశి వారు కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే సూచనలు కలవు. గతనెలలో కంటే కూడా వీరి ఆరోగ్యం మరింత ఇబ్బందులకు గురవుతుంది. హెల్త్ ఫార్చ్యూన్ వీరికి అనుకూలంగా లేదు. కాబట్టి విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఉత్తమం. ఈ నెల 21 వరకు ఈ విధంగానే కొనసాగుతుంది. అలాగే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఫిజికల్ ఫిట్నెస్ ను మెయింటెయిన్ చేయడం కూడా ముఖ్యం. ఈ జాగ్రత్తలని పాటించడ ద్వారా ఆరోగ్యంగా ఉంటారు.

  ఈ నెలలో మీరు అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బందిపడతారని కాదు. కొన్ని కొన్ని రుగ్మతలు వేధిస్తాయని తెలుస్తోంది. అయితే, మీ అంతర్గత బలంతో అలాగే పాజిటివ్ దృక్పథంతో మీరు అనుకోని సంఘటనలు ఎదురైనా మెచ్యూర్డ్ వే లో వాటిని డీల్ చేస్తారు. అయితే, కొన్ని జాగ్రత్తలను మీరు తీసుకోక తప్పదు. ఎక్కువగా స్ట్రెస్ కు గురికాకండి. దాని వలన ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. మీ ఈటింగ్ హ్యాబిట్స్ ను ట్రాక్ చేయండి. ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోకండి. మొత్తమ్మీద, ఈ నెల చివరికి వచ్చేసరికి మీ అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కలవు.

  వృత్తిపరంగా:

  వృత్తిపరంగా:

  మీరు పడే కృషి మీకు చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. ఈ నెలలో మీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. ఆఫీస్ లో మీ శ్రమను గుర్తించడం ప్రారంభిస్తారు. హైయర్ లెవల్ మేనేజ్మెంట్ నుంచి అభినందనలు అందుతాయి. అంతేకాదు, ఆఫీస్ లో మీ గౌరవం మరింత పెరుగుతుంది. మంచి గుర్తింపు పొందుతారు. మొత్తానికి, ఈ నెలంతా వృత్తిపరంగా మీకు అనుకూలంగా ఉంది.

  ప్రమోషన్ కోసం వేచి చూస్తున్నట్టయితే, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయి. ప్రమోషన్ ను మీరు పొందే సూచనలు కలవు. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా అని మీరు పని ఒత్తిడిని మరింత పెంచుకుని ఆరోగ్యంపై అశ్రద్ధ వహించకూడదు. ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి.

  ఆర్థికపరంగా:

  ఆర్థికపరంగా:

  ఈ నెల కొత్త వెంచర్స్ పై అలాగే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పై దృష్టి పెట్టేందుకు అనుకూల సమయం. ఆర్థికపరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంది. ఈ నెలలో భారీ లాభాలను మీరు ఆశించవచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ కి సంబంధించిన డీలింగ్స్ కి అలాగే ఏదైనా కొత్త వెంచర్ ని స్టార్ట్ చేయడానికి ఇది అత్యంత అనుకూల సమయం.

  అయితే, ఆర్థికపరంగా అనుకూలమైన సమయం అయినప్పటికీ మీరు ఆర్థికపరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాస్తంత తెలివిగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఫ్రెండ్ షిప్ లోని ఆర్థికపరంగా సమస్యలు తలెత్తవచ్చు.

  లవ్ లైఫ్:

  లవ్ లైఫ్:

  మీ కెరీర్ లైఫ్ అనుకూలంగా ఉన్నట్టుగా ఈ నెలలో మీ లవ్ లైఫ్ అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ జీవితంలో ముఖ్యమైన వారితో మీకు స్పర్థలు ఏర్పడవచ్చు. మీకు ఈ నెలలో రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువవుతాయి. అయితే, మీ పార్ట్నర్ నుంచి మీరు ఊహించినంత రెస్పాన్స్ రాకపోవడం మిమ్మల్ని బాధకు గురిచేస్తుంది. ఇందువలన రిలేషన్ షిప్ లో వెనకడుగు వేయడానికి మీరు ప్రయత్నించవచ్చు. మీ రొమాంటిక్ ఫీలింగ్స్ ని మీరు మీ భాగస్వామితో పంచుకునేందుకు సంశయిస్తారు. అయితే, మీరు ఈ పరిస్థితికి నిరాశ చెందవద్దు. సహనం పాటించండి. పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

  మీరు వివాహితులైతే, మీ భాగస్వామితో మీరు లవ్ రిలేషన్షిప్ ను డీల్ చేసే విధానంలో కొత్త కోణాన్ని ప్రదర్శిస్తారు. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నట్టయితే, జాగ్రత్తలు తీసుకోండి. ఈ నెలలో కొన్ని ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ ఎదురయ్యే సూచనలు కలవు. అయితే, మీ ప్రియమైన వారితో మీకున్న కొన్ని పెండింగ్ సమస్యలు ఈ నెలలో పరిష్కారమవుతాయి.

  అదృష్ట రంగులు అలాగే సంఖ్యలు

  అదృష్ట రంగులు అలాగే సంఖ్యలు

  అదృష్ట సంఖ్యలు : 3, 9, 12, 15, 18 మరియు 24

  అదృష్ట రంగులు : లీలాక్, పర్పుల్, వయొలెట్ మరియు సి గ్రీన్

  గమనిక: వ్యక్తిగత జాతకఫలితాల కోసం అనుభవజ్ఞుడైన జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించండి.

  English summary

  Monthy Prediction - June Pisces

  Monthy Prediction - June Pisces.Pisces are among the friendliest and calmest people you will come across. They have a kind and friendly nature, which encourages people around them to open up to them and seek their advice. They handle patches of roughness that come their way with ease. They also have a soft corner which makes them the ultimate forgivers. People belonging to the sun sign Pisces never abstain from showing their emotions and love. These characteristics make them very transparent people.
  Story first published: Friday, June 1, 2018, 10:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more