For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నెలవారీ రాశి ఫలాలు: ధనుస్సు రాశి – జూన్

  |

  ధనుస్సు రాశి చక్రం గుర్తు విల్లు బాణాల యొక్క చిహ్నంగా ఉంటుంది మరియు 22 నవంబరు మరియు 21 డిసెంబరు మధ్య జన్మించిన ప్రజలు ఈ సమూహానికి చెందుతారు. ధనుస్సు రాశి చక్రానికి చెందిన ప్రజలు చాలా స్వతంత్రమైన, నిజాయితీ కూడిన , బలమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. వారు భావ వ్యక్తీకరణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటారు మరియు ఈ కారణం చేతనే కొన్నిసార్లు వారి సంబంధాలలో విభేదాలు కూడా ఏర్పడతాయి. మీరు ఒక ధనుస్సు రాశికి చెందిన వారు అయితే, జూన్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉండబోనున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఈ వ్యాసం చదవండి.

  ఆరోగ్యం, ఆర్థిక మరియు వృత్తి పరమైన విషయాలనందు ఈ నెల మీకు పెద్దగా అనుకూలమైనదిగా కనిపించడం లేదు, మీరు కొన్ని అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా ఈ పరిస్థితి నుండి కాస్త గట్టెక్కవచ్చు. అలాగని ఎక్కువ ప్రభావితమవుతారని కాదు, కానీ కొంచం మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. మీ ప్రేమ జీవితం మరింత ఫలవంతమైనదిగా ఉంటుంది. మరియు జూన్ నెలలో మీ జీవితంలోని ప్రేమను మీరు వ్యక్తపరచకపోయినా, మిమ్మల్ని మీరు నిలదొక్కుకుని మీకెలాంటి భాగస్వామి కావాలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మాత్రం ప్రస్ఫుటంగా ఉన్నాయి.

  ఆరోగ్యం :

  ఆరోగ్యం :

  ఆందోళన చెందేoతటి ప్రధాన సమస్యలు లేనప్పటికీ, సాధారణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఈ నెల 21 వరకు ఆరోగ్యం కాస్త మిశ్రమంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుందని నక్షత్రాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, మీరు బాధపడుతున్న చిన్న అనారోగ్యాలకు అదనపు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది, ఎందుకంటే అవి ఎప్పటికైనా ఒక సమస్యగానే మిగలవచ్చు. మీరు మీ వైద్యుడిని సంప్రదించి, పరీక్షించి, చికిత్సను ప్రారంభించడం మంచిది. సమస్య తేలికగా ఉన్నా జఠిలంగా ఉన్నా, వైద్యులు సూచించిన మందులను మాత్రం విస్మరించకూడదని నిర్ధారించుకోండి.

  మీరు మీ ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ తీసుకోవలసిన సమయమిది, వ్యాయామం చేయడం, ఆహార ప్రణాళికలలో మార్పులు చేయడం, సరైన సమయానికి మందులు వేస్కోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళడం, ప్రియమైన వారితో సమయాన్ని వెచ్చించడం వంటి చర్యల ద్వారా మీరు ఆరోగ్యాన్ని మరియు మనసును జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది. మరియు అవసరానికి తగినట్లు శరీరం డస్సిపోకుండా ఎక్కువ విశ్రాంతిని ఇవ్వడం మంచిది. అంతా సహేతుకంగా పూర్తి చేయాలి. కుటుంబ సభ్యులతో సమయo వెచ్చించేలా ప్రణాళికలు చేసుకోండి. పని వేళల నందు ఆలస్యం చేయడం, ఓవర్ టైం చేయడం వంటివి ఈ సమయంలో మీకు సౌకర్యంగా ఉండకపోవచ్చు. అలాగే కుటుంబ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆ సమస్యల పరిష్కారం దృష్ట్యా మీరు నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అసౌకర్యం మరియు సుదీర్ఘమైన సమస్యల కారణంగా దీర్ఘకాలిక అనారోగ్యం ఏర్పడవచ్చు లేదా సంభవించవచ్చు.

  ఉద్యోగం :

  ఉద్యోగం :

  మీ ఆరోగ్యంలా కాకుండా, మీ ఉద్యోగ మరియు వృత్తి పరమైన జీవితం విషయoలో జూన్ నెలలో, నక్షత్రాలు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉన్నాయనే చెప్పవచ్చు. మీ పని వద్ద మరియు మీ కార్యాలయ వాతావరణంలో మరింత సంతృప్తికరమైన మరియు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు. మీరు వృత్తి పరంగా ఎటువంటి సమస్యలూ లేకపోయినా కూడా, సంతోషంగా ఉండలేకపోవచ్చు. దీనికి ఆరోగ్య మరియు కుటుంబ సబంధిత వ్యవహారాల ఒత్తిడులు ప్రధాన కారణంగా ఉండవచ్చు. ఈ రాశి ప్రకారం మీకు ఈ నెలలో ప్రయాణాలను కూడా సూచిస్తూ ఉంది. మీరు దక్షిణ దిక్కున ప్రయాణం చేస్తే అది ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త పరిచయాల ద్వారా మీ పనిని మెరుగుపరచడం మరియు మీ నెట్వర్క్ విస్తరించడం కూడా జరుగుతుంది.

  పని వద్ద కొన్ని అడ్డంకులు ఉండవచ్చు కానీ నిష్ఫలంగా పొందడానికి మాత్రం ఏమీ లేదు. కార్యక్రమాలలో మీరు ఎటువంటి ప్రతికూల ప్రభావాలకు లోను కాకూడదన్న ఉద్దేశంతో నిశ్శబ్దాన్ని అనుసరిస్తుంటారు. 17వ తేదీ వరకు బుధ గ్రహం అనుకూలంగా లేని కారణంగా కొన్ని మానసిక ఒత్తిడులకు లోనుకావొచ్చు. కానీ 17 మీదట మీకు సానుకూల ఫలితాలు కలుగుతాయని చెప్పబడినది. ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూసేవారికి.

  ఆర్ధిక వ్యవహారములు:

  ఆర్ధిక వ్యవహారములు:

  ఆర్దిక విషయాల పరంగా ఈ జూన్ మాసంలో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ఆర్ధిక లక్ష్యాలను నెరవేర్చలేని స్థితిలో ఉంటారు. అవసరానికి డబ్బు అందుతున్నా, అనుకున్నంత ఫలితాలను పొందలేక పోవడం కారణంగా ఒక అసంతృప్తి మాత్రం వెoటాడుతూ ఉంటుంది.

  మీ ఆర్ధిక వ్యవహారాలలో ఉన్న లోటుపాట్ల కారణంగా, అనేక ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కావున ఆర్ధిక వ్యవహారాలపట్ల దృష్టి సారించడం ఉత్తమమైన మార్గంగా సూచించబడినది. తద్వారా తప్పు ఎక్కడ జరుగుతుందో క్రోడీకరించుకోవడానికి మీకు అనువుగా ఉంటుంది. ఆదాయ వనరుల పట్ల జాగ్రత్తలు తీసుకోని ఎడల నెల చివరిలో తీవ్ర సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు సృజనాత్మక కళలతో సంబంధం కలిగివుంటే, జూన్ మాసo ద్రవ్య లావాదేవీలకు సరైన మాసంగా ఉండకపోవచ్చు. ఏదైనా కొత్త పెట్టుబడులకు లేదా వెంచర్ గురించిన ఆలోచనలను చేస్తూ ఉంటే, ఇది మీ ప్రణాళికలను పునరాలోచించడానికి మరియు మొదటి నుండి పర్యవేక్షించుకోవడానికి మంచి సమయం కావచ్చు.

  నక్షత్రాల, గ్రహాల స్థితి గతులు సవ్యంగా లేని కారణంగా పెద్ద పెద్ద పెట్టుబడులకు పూనుకోకుండా, ఆర్ధిక వ్యవహారాల నందు ఆచి తూచి వ్యవహరించావలసినదిగా సూచించడమైనది. తద్వారా మీరు తీసుకున్న జాగ్రత్తలు, ఈ ఆర్థిక సంక్షోభం నుండి మిమ్మల్ని బయట పడవేయగలదు మరియు మరింత ఆర్ధిక స్థిరంగా ఉండగలరు.

  ప్రేమ జీవితం:

  ప్రేమ జీవితం:

  ఈ నెల మీ ప్రేమ జీవితం మీరు ఊహించిన దాని కన్నా కొద్దిగా భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆత్మ పరిశీలనా ప్రయాణంలో మీ అంతరాత్మతోనే ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. మీరు మీ జీవిత భాగస్వామిలో కోరుకుంటున్న లక్షణాలను గుర్తించే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి, తద్వారా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మీరు ప్రేమని ఆశిస్తున్న ఎడల ఎటువంటి చర్చలలోనైనా మానసిక పరివర్తనతోనే చర్చలను కొనసాగించండి, లేనిచో కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి రావొచ్చు. జాగ్రత్తలు తప్పని సరి. మీరు ఇదివరకే ప్రేమలో ఉన్న ఎడల, మీ బంధం మరింత గట్టిపడ్తుంది.

  మీరు వివాహం అయిన వారైతే, ఈ నెల ఆర్ధికపరమైన సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది, ఖర్చులు కూడా అసహజంగా పెరగడం గమనిస్తారు. సమయానుసారం ప్రణాళికాబద్దమైన నిర్ణయాలు, ముందు జాగ్రత్త ఈ నెలలో మీకు సహాయకారిగా ఉంటుంది. రెండు విషయాలను ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోండి సహనం మరియు నిగ్రహం. తద్వారా అనేక సమస్యలు దూరమవుతాయి.

  మీ అదృష్ట రంగులు , అంకెలు మరియు రత్నాలు :

  మీ అదృష్ట రంగులు , అంకెలు మరియు రత్నాలు :

  జూన్ 2018 లో మీ అదృష్ట సంఖ్యలు 4, 6 మరియు 15 గా చెప్పబడినవి , మరియు మీ అదృష్ట రంగులు పింక్, ఎరుపు, ఊదా, మరియు వైలెట్. ఇక రత్నాల విషయానికి వస్తే నీలంగా చెప్పబడినది. ఏది ఏమైనా మీ జాతకoలో గ్రహాల స్థితి గతులను పరిశీలించి, జ్యోతిష్య నిపుణుల సూచనల మేరకు రత్నాన్ని ధరించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఒక్కోసారి గ్రహాలతో పొంతనలేకుండా తీసుకున్న ఎడల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా తలెత్తవచ్చు. ఈ నెలలో మీకు మకర రాశి , మేష రాశి వారు అనుకూలంగా ఉండే రాశులుగా చెప్పబడినవి.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. రాశి చక్రాల గురించి మరిన్ని వివరాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శిస్తూ ఉండండి. మీరు ఈ రాశికి చెందినవారైతే, మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

  English summary

  Monthy Prediction - June- Sagittarius

  The zodiac sign Sagittarius is characterized by the sign of the Archer and people born between 22nd November and 21st December belong to this group. People belonging to the Sagittarius zodiac sign are very independent, brutally honest, and have strong opinions. They are also firm believers in personal freedom of expression and that sometimes causes conflicts in their interaction and relationships. If you are a Sagittarius and what to know what’s in store for you for the month of June, 2018, read on. While health, finances and your career don’t look too favorable this month, you can take a few necessary steps to help you tide through this difficult times.
  Story first published: Friday, June 1, 2018, 11:10 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more