For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  జూన్ నెలకి చెందిన వృశ్చిక రాశి మాసఫలాలు

  |

  జూన్ 2018 అనేది వృశ్చిక రాశివారికి కొంత అనుకూలంగా ఉండే సూచనలు కలవు. కొన్ని చిన్నపాటి అవాంతరాలు అలాగే సమస్యలు మీ దారిలో ఎదురవవచ్చు. అయితే, వీటిని మీరు సునాయాసంగా ఎదుర్కొనగలుగుతారు. కాబట్టి, ఎటువంటి చింతా పెట్టుకోకండి. మరొక మంచి విషయం ఏంటంటే ఈ నెలలో మీ ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అందువలన, జీవితం యొక్క అర్థం మీకు అవగాహనకు వస్తుంది. మీరు ఎంత విశాల హృదయం కలిగిన వారో మీకు అర్థమవుతూ వస్తుంది. పెర్సనల్ లైఫ్ లో అలాగే ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదురయ్యే కొన్ని సంక్లిష్ట పరిస్థితులను మీరు సునాయాసంగా దాటగలుగుతారు.

  మీ భావవ్యక్తీకరణ కూడా మెరుగవుతుంది. అందువలన, కొన్ని పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దాంతో మీ స్టేటస్ మరింత ఎలివేట్ అవుతుంది. ఆఫీస్ పనులలో మీరు మీ సబార్డినేట్స్ తో అలాగే సుపీరియర్స్ తో స్మూత్ రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తారు. మీ టాలెంట్ తో పాటు మీ కృషి మీకు సరైన గుర్తింపును అందించేందుకు తోడ్పడుతుంది. ఈ నెలలో ఉత్సాహంగా ఉండే వ్యక్తుల స్నేహం మీకు దొరికే సూచనలు కలవు. సామాజిక పరంగా మీకు కొన్ని గౌరవాలు దక్కుతాయి. దాంతో, మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.

  ఈ నెలలో మీ కెరీర్, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు అలాగే లవ్ లైఫ్ గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకోండి.

  ఆరోగ్యం:

  ఆరోగ్యం:

  ఈ నెలలో మీ కెరీర్ తో పాటు లవ్ లైఫ్ అనేది కొంత ముందుకు సాగే విధంగా ఉంటే ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కలవు. చిన్న చిన్న రుగ్మతలు పీడిస్తాయి. మీ భాగస్వామికి అలాగే పిల్లలకు రెగ్యులర్ చెకప్స్ అవసరమవుతాయి. శారీరక విశ్రాంతికి ప్రాముఖ్యతను ఇవ్వండి. ముఖ్యంగా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నప్పుడు, ఏదైనా ముఖ్యమైన మీటింగ్ ను ఎటెండ్ అవవలసిన అవసరం ఉన్నప్పుడు అలాగే లాంగ్ ట్రావెల్స్ చేయవలసి వచ్చినప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.

  దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి కాస్తంత ఉపశమనం దక్కుతుందని కార్డ్స్ చెప్తున్నాయి. విపరీతంగా శ్రమ పడిపోవడం తగ్గించండి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోండి. విశ్రాంతి తీసుకోకపోతే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. మీరు చేయవలసిందల్లా మీ గురించి ఒక రొటీన్ ను ప్లాన్ చేసుకోవడం. వర్క్ లైఫ్ లో గానీ పెర్సనల్ లైఫ్ లో గానీ రొటీన్ ను ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే, అప్పుడే ఎటువంటి శారీరక అలాగే మానసికఒత్తిడి లేకుండా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మీ ఆరోగ్యంపై మీరు దృష్టి పెడితే ఈ నెలలో మీకు చికాకులు కాస్తంత తగ్గుతాయి.

  కెరీర్:

  కెరీర్:

  ఈ నెలలో మీ కోసం గొప్ప గొప్ప అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే, ఈ నెలలో ప్రొఫెషనల్ లైఫ్ ఏ మాత్రం ఎంకరేజింగ్ గా ఉండనప్పటికీ, వర్క్ ప్లేస్ లో మీ గ్రోత్ మరియు ఇంప్రూవ్మెంట్ కై అనేక అవకాశాలు మీకు తారసపడతాయి. ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఆఫీస్ టాస్క్ లు మీకు బర్డెన్ ని పెంచేటంత ఉండవు. వర్క్ లోడ్ ఎక్కువగా ఉండదు. అయితే, ఒక పనిని పూర్తి చేయడానికి మీరు పడే శ్రమ మాత్రం మీకు ఆశించిన ఫలితాన్నిఅందించకపోవచ్చు.

  కెరీర్ పాత్ నుంచి మీరు పక్కకి మరలే సూచనలు కలవు. మీ నైపుణ్యానికి సంబంధం లేని ఏరియాస్ లో మీరు కొత్త వెంచర్స్ ని తీసుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ నెలలో స్టార్స్ మీకు అనుకూలంగా లేవు. అందువలన, అటువంటి ఆలోచనలు మానుకోండి. ఈ నెలలోని రెండవ భాగంలో మీ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి, ఊహించని పరిణామాలని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండండి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసే ముందు అందులో ఎదురయ్యే లాభనష్టాలను బేరీజు వేసుకోండి. మీ నైపుణ్యానికి చెందిన విషయంలో కూడా ఇదే కాన్సెప్ట్ వర్తిస్తుంది. ఏదైనా పనిని ప్రారంభించే ముందు సీనియర్స్ నుంచి సలహాలను స్వీకరించండి.

  ఆర్థికస్థితిగతులు

  ఆర్థికస్థితిగతులు

  ఆర్థికపరంగా ఈ నెల మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే, ఇంతకు ముందు నెలలతో పోలిస్తే ఈ నెల కాస్త బాగానే ఉంటుందని భావించవచ్చు. మీరు ఇంతకు ముందు ప్లాన్ చేసుకున్న ఆర్థిక ప్రణాళికల నుంచి మీరు కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ విషయంలో ప్రయాణం చేసే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రయాణం మీకు ఏ విధంగా కూడా కలిసిరాకపోవచ్చు. విదేశాలతో వ్యవహారాలను అవాయిడ్ చేయండి. ముఖ్యంగా మీరు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కు చెందినవారైతే అటువంటి డీలింగ్స్ తో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

  ఈ నెలలో మీకు అతిగా ఖర్చు చేయాలని అనిపిస్తుంది. అయితే, ఖర్చులను మీరు ట్రాక్ చేసుకోవడం మంచిది. ఖర్చును అదుపులో పెడితే మరీ మంచిది. మానిటర్ కమిట్మెంట్స్ కి సంబంధించిన విషయాలలో ఆచితూచి నిర్ణయాలను తీసుకోవడం మంచిది. ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ అఫర్ చేస్తున్న సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రాధాన్యతనివ్వడం అనుకూలంగా ఉండవచ్చు. ఈ నెలలో మీరు అనుకోని విధంగా లాభాలను పొందుతారు. అందువలన, మీరు రుణాలను తీర్చేయగలుగుతారు.

  లవ్ లైఫ్:

  లవ్ లైఫ్:

  లవ్ లైఫ్ ఈ నెలలో మీరు ఆశించిన విధంగా ఉండదు. కాస్తంత నిరాశ మిమ్మల్ని వేధిస్తుంది. మీ భాగస్వామి ప్రవర్తన వలన మీరు నిరాశ చెందే అవకాశాలు కలవు. మీ ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తే ప్రమాదం ఉంది. మీ ప్రవర్తన వలన కూడా మీ ఇద్దరి మధ్య విబేధాలు మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆచితూచి వ్యవహరించండి. అప్పుడే, రిలేషన్ షిప్ ను మీరు నిలుపుకోగలుగుతారు.

  అదృష్టవశాత్తూ, ఈ నెలలో మీరు లవ్ లైఫ్ లో ఎదురయ్యే సమస్యలను మీరు ఎంతో సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు. పరిస్థితులు చేజారక ముందే మీరు మీ నేర్పుతో పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంటారు. మీ ఎమోషన్స్ ను కంట్రోల్ లో ఉంచుకోండి. మీ భాగస్వామితో డీల్ చేసేటప్పుడు ఆమె/అతడు కోణం నుంచి కూడా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామిని రెచ్చగొట్టి పరిస్థితి చేజారేలా ప్రవర్తించకండి. వాదనలను వదిలేయండి. సంయమనం పాటించండి. అంతా సర్దుకుంటుంది.

  అదృష్ట రంగులు అలాగే సంఖ్యలు:

  అదృష్ట సంఖ్యలు: 9, 10 మరియు 11.

  అదృష్ట రంగులు: ఎరుపు మరియు సింధూరం

  English summary

  Monthy Prediction - June Scorpion

  The month of June, 2018 looks to be somewhat favorable for you if you are a Scorpio. While there may be a few minor glitches and issues that will come your way, you will overcome them with ease, so don’t worry too much about this. Another positive outcome from this month would be that your concentration will improve significantly and this will help you in understanding the inner meaning of life.
  Story first published: Friday, June 1, 2018, 9:50 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more