Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
అంకుల్ తను ప్రెగ్నెంట్, మా ఇద్దరినీ విడదీసి ఆ పాపం మూటకట్టుకోకు #mystory359
"అంకుల్ మేమిద్దరం మేజర్లం. మేము చట్టప్రకారమే పెళ్లి చేసుకున్నాం. నా కులం వేరనో లేదంటే నీకు చెప్పకుండా చేసుకున్నామనో.. మరో కారణంతోనో నువ్వు నా నుంచి నీ కూతుర్ని విడదీయాలనుకుంటున్నావ్.
తను నాకంటే చిన్నోడు, కానీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, గర్భిణీని అయ్యాక నాన్న అలా చేశాడు #mystory358 (ఇక్కడ క్లిక్ చేసి చదవండి) స్టోరీకి ఇది కంటిన్యూ కథ.
వైశాల్ ను నాన్న, మా బంధువులు కొట్టడంతో అతన్ని వాళ్ల అమ్మనాన్న హాస్పిటల్ లో జాయిన్ చేశారు. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి.. నాకోసం చావుకు కూడా భయపడలేదు అతను. నన్ను నాన్న బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి ఒక రూమ్ లో బంధించాడు.

నరకం అనుభవించా
రెండ్రోజుల పాటు నాకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేశాడు. నరకం అనుభవించాను. వైశాల్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా ఇంటికొచ్చాడు. తన మాటలు గదిలో ఉన్న నాకు వినపడ్డాయి. మా నాన్న తనని తిడుతూ ఉన్నాడు. కానీ వైశాల్ చాలా సేపు ఒక్క మాట కూడా అనలేదు.

మీ ఇంట్లోనే చంపేసి
"అంకుల్ నన్ను మీ ఇంట్లోనే చంపేసి మీ కూతురికి మరో పెళ్లి చేయండి. ఎందుకంటే నేను బతికుండగా తనకు పెళ్లి చేస్తే నేను తట్టుకోలేను. తను ఇప్పుడు మామూలు మనిషి కూడా కాదు.. తను ప్రెగ్నెంట్. తన ఎక్కడుందో చెప్పండి" అంటూ మా నాన్నను వైశాల్ వేడుకున్నాడు.

మౌనంగా మావైపే చూస్తూ
అయినా నాన్న మనస్సు కరగలేదు. పక్క గదిలో ఉన్న నేను ఏమండీ అనగానే వైశాల్ అక్కడే ఉన్న సుత్తెతో తాళం పగలగొట్టి రూమ్ లోకి వచ్చాడు. అప్పుడు నాన్న మౌనంగా మావైపే చూస్తూ ఉన్నాడు.

మేమిద్దరం మేజర్లం
"అంకుల్ మేమిద్దరం మేజర్లం. మేము చట్టప్రకారమే పెళ్లి చేసుకున్నాం. నా కులం వేరనో లేదంటే నీకు చెప్పకుండా చేసుకున్నామనో.. మరో కారణంతోనో నువ్వు నా నుంచి నీ కూతుర్ని విడదీయాలనుకుంటున్నావ్.

ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తే
కానీ నీ కూతుర్ని నాకంటే బాగా ఇంకెవ్వరూ చూసుకోలేరు అంకుల్. మా ఇద్దరి ప్రొఫెషన్స్ ఒక్కటే. మా ఇద్దరి మనసత్వాలు ఒక్కటే. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం మాకుంది. అలాంటి మమ్మల్ని వీడదీసి తనను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తే తను ఏం హ్యాపీగా ఉంటుంది అంకుల్. తన హ్యాపీనెస్ నే కోరుకుంటే తనని నాతోనే ఉండనివ్వు.

వైశాల్ చెప్పిన మాటలకు..
నేను నా సమస్యను పోలీసుల వరకు కోర్టు వరకు తీసుకెళ్లకూడదనుకుంటున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. అని వైశాల్ చెప్పిన మాటలకు నాన్న మనస్సు కూడా కరిగినట్లుంది. ఆయన కూడా ఒక్క మాట కూడా అనలేదు.

ఇంకెవ్వరికో ఇచ్చి పెళ్లి చేసి ఉంటే
తర్వాత మేమిద్దరం మళ్లీ ముంబై వెళ్లిపోయాం. ఇప్పుడు మాకొక బాబు. అప్పుడప్పుడు మా నాన్న అమ్మ మా దగ్గరకు వస్తుంటారు. ఆ మధ్య మా నాన్నకు హెల్త్ బాగాలేకుంటే మా ఆయనే ముంబైలో సర్జరీ చేయించారు. మా నాన్న ఆ రోజు మమ్మల్ని విడదీసి నన్ను ఇంకెవ్వరికో ఇచ్చి పెళ్లి చేసి ఉంటే నా లైఫ్ ఎంత దారుణంగా మారేదేమో.



Click it and Unblock the Notifications