For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు పెళ్లికి సిద్దమవడానికి సరైన సమయం ఇదే..!

|

జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం వివాహం. మీ ఈ నిర్ణయం సరైనదే అన్న నిర్ధారణ మీకు కనీసం ఉండాలి. వివాహంపరంగా మీరు తీసుకునే నిర్ణయం, కేవలం మిమ్ములనే కాదు, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తుని, చివరికి మీరు చేసుకోబోయే భాగస్వామిని కూడా సానుకూలంగా అయినా, ప్రతికూలంగా అయినా ప్రభావితం చేస్తుంది.

మీ వివాహానికి సంబంధించిన నిర్ణయాలలో, ఆర్ధిక స్థితిగతులు, భద్రత, సాంప్రదాయాలు, మీ భావాలు వంటివి ఎలా అయితే ముఖ్యమైనవిగా ఉంటాయో, అదేవిధంగా వయసు కూడా ప్రముఖపాత్ర పోషిస్తుంది. మీరు ఇంకా సరైన జీవిత భాగస్వామిని కనుగొనలేకపోతే, కనుగొనడానికి సరైన వయస్సు అంటూ ఏదీ లేదు. అయితే, మీరు కలిగి ఉంటే మాత్రం, మీ రాశిచక్రం మీ వివాహానికి సరైన వయస్సును గుర్తించడంలో సహాయపడుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.

Perfect Age To Get Married According To Your Zodiac Sign

మీరు పెళ్లి చేసుకున్న వయస్సు, మీ పెళ్లి జీవితం ఏవిధంగా విజయవంతమయింది అని తెలుపడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మీరు మీ జీవితభాగస్వామితో గొప్ప అనుకూలతను, అభిప్రాయాలను పంచుకున్నప్పటికీ, సరైన వయస్సులో వివాహం చేసుకుంటే, మీరు ఒక మంచి జీవనశైలిని కలిగిఉండే అవకాశo ఉంది. ఇరువురి తప్పొప్పులను సర్దుబాటు చేసుకునే మనస్థితి కూడా అలవడుతుంది. మీ రాశిచక్రం గుర్తు ప్రకారం మీరు వివాహం చేసుకోవడానికి సరైన వయస్సుని నిర్దారించుకోడానికి ఈ వ్యాసం మీకు ఉపయోగపడుతుంది.

మేషం:

మేషం:

మేషరాశి వారు శారీరికంగా మరియు మానసిక దృఢత్వం కలిగి ఉన్నతమైన జీవనం గురించిన ఆలోచనలతో ఉంటారు. సత్వర నిర్ణయాలు తీసుకోవడం, ఇతరుల ప్రమేయం లేకుండా తమ ఆలోచనల ప్రకారం ముందుకు సాగడం వీరి అలవాటుగా ఉంటుంది. కాకపోతే నిరాశానిస్పృహలకు కేంద్రబిందువుగా ఉంటారు. ఎక్కువగా యుక్తికి పని చెప్పే వీరు, వాంఛనీయతను కోల్పోకుండా ఉండేలా ప్రయత్నిస్తుంటారు. మీరు వయసుతో సంబంధం లేకుండా తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా ప్రేమలో పొరపాట్లు కూడా చేయవచ్చు. కానీ భాగస్వామి గురించిన ఆలోచనలు చేయడానికి, లేదా వివాహం గురించిన సరైన నిర్ణయాలు తీస్కోవడానికి సూచించదగిన వయసు 20సంవత్సరాలుగా ఉంది.

 మిధునం:

మిధునం:

మిధునరాశికి చెందిన వ్యక్తులు వివాహం పట్ల నిర్ణయాలు తీసుకోవడం కాస్త కష్టతరంగానే ఉంటుంది. రెండు వేర్వేరు దిశల్లో నిరంతరం మీ ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి. అయితే సంబంధాలు, ప్రేమ, మరియు మీ వ్యక్తిగత ఆలోచనలు వంటి అంశాలపట్ల ఎక్కువ ఆలోచనలు చేస్తుంటారు. ఆర్ధిక స్థిరత్వం, రక్షణ వంటి అంశాలు ఒక వైపు, ప్రేమ, వ్యక్తిగత జీవితం అనే అంశాలు మరోవైపున కనిపిస్తూ ఒకరకమైన మానసిక గందరగోళంలో ఉంటారు. కావున సరైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో కొంత సమయం కూడా మీకు అవసరమై ఉంటుంది. కావున మీ వివాహానికి సరైన సమయం 30సంవత్సరాల వయసుగా ఉంది. మీరు పరిపక్వత సాధించడానికి మరియు స్థిరపడేందుకు తగిన సమయం కూడా మీకు దొరుకుతుంది.

కర్కాటకం:

కర్కాటకం:

మీ ఆలోచనలు ఎల్లప్పుడూ కుటుంబ సంక్షేమం, ప్రేమ, సంబంధాలు అన్న అంశాల మీదనే ఉంటాయి. క్రమంగా వివాహం కారణంగా కుటుంబంలో ఊహించని మార్పులు రాకూడదన్న ఆలోచనలో ఉంటారు. మీరు ఎక్కువగా భద్రతకు ప్రాముఖ్యతను ఇస్తుంటారు. మీరు త్వరగానే ప్రేమలోపడే సూచనలు ఉంటాయి, మరియు మీకు సురక్షిత భావనను కలుగజేసే వ్యక్తులను దూరం చేసుకోడానికి ఎన్నటికీ సిద్దంగా ఉండరు. మీరు మీ గురించి మీరు ఎంతగా ఆలోచిస్తారో, మీ భాగస్వామి శ్రేయస్సు గురించి కూడా అదే విధమైన ఆలోచనలను కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక స్పష్టమైన సమాధానం ఉంటుంది. మరియు మీకే తెలుస్తుంది వివాహానికి మీరు అర్హులో కాదో అని. క్రమంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.

సింహం:

సింహం:

మీరు మీకంటూ ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటారు, మరియు ఒక రాజు లేదా రాణిలా జీవితాంతం ఉండాలని కోరుకుంటారు. ఏదేమైనా, మీరు మోసం మరియు వెన్నుపోటు వంటి లక్షణాలను సహించలేరు. జీవితంలో అటువంటివి ఎదుర్కోడానికి సిద్దంగా ఉండలేక, మరియు మీ జీవితంలోకి కొత్త మనుషులను ఆహ్వానించలేక ఆలోచనానుసారం నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఒక ఆర్ధిక మరియు సామాజిక స్థిరత్వం వచ్చిన తర్వాతనే వివాహానికి అర్హత సంపాదించాం అన్న భావన మీది. మరియు మీ ఆలోచనలకు తగ్గట్లు, సరైన వ్యక్తిని కనుగొనడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది, మరియు మీ స్వభావం కారణంగా, ఇంకాస్త ఎక్కువ సమయమే పడుతుంది. అయితే ఇది నిందించాల్సిన అంశం కాదు. మీకు జీవితంపరంగా ఉన్న దృష్టికోణాలే మీ ఈస్వభావానికి కారణం.

కన్య:

కన్య:

కన్యారాశి వారికి, వారికంటూ కొన్ని లక్ష్యాలు విధివిధానాలు మరియు బలమైన పని నియమాలను కలిగి ఉంటారు. అయితే, ఇది మీ వృత్తిపరంగా మాత్రమే కాకుండా మీ సంబంధాలకు కూడా వర్తిస్తుంది. మీకు మీలక్ష్యాలను ఎలా చేరుకోవాలో ఒక ఆలోచన ఉంటుంది. మరియు మీ భావాలకు తగ్గట్లుగానే భాగస్వామి కూడా ఉండాలన్న ఆలోచన మీది. మీరు ఎంచుకునే వ్యక్తి గురించిన పూర్తి అవగాహన ఉండాలన్న ఆలోచనతో, వివాహం విషయంలో అధిక సమయాన్నే తీసుకుంటారు. ఒక్కోసారి మీ ఆర్ధిక, మరియు వృత్తిపరమైన జీవితం కూడా మీ నిర్ణయాలకు సమయాన్ని కేటాయిస్తుంది.

తుల:

తుల:

మీ నిర్ణయాత్మక ధోరణి ఆచరణాత్మకంగా మీ వివాహ సమయాన్ని సూచిస్తుంది! మీరు తక్కువ కాలంలోనే వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా, తక్కువ సమయంలోనే సరైన నిర్ణయాలు తీసుకోవడం మీ లక్షణంగా ఉంటుంది. కానీ కొన్ని నిర్ణయాలు మీ అంచనాలకు విరుద్దంగా ఉండి జీవితాన్ని ఒక అస్తవ్యస్త మార్గంలో నడిపించే అవకాశాలు ఉన్నాయి, తద్వారా ఎక్కువ శాతం విడాకులని ఆశ్రయించడం జరుగుతుంటుంది. దేనికైనా సమయం, ఓపిక కూడా అవసరమే. అనివార్యమైన మరియు తప్పనిసరి పరిస్థితులలో తప్ప తొందరపాటు నిర్ణయాలు తగదు. అవి మీ జీవితంలో ఒక ప్రభావాన్ని కలిగి ఉంటాయని మాత్రం మరవకండి.

వృశ్చికం:

వృశ్చికం:

మీరు ఉద్వేగభరితమైన ఆలోచనలను కలిగి ఉండి, భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. వృత్తిపరంగా కానీ, కుటుంబ మరియు వివాహ విషయాలలో మీరు త్వరితగతిన తీసుకునే నిర్ణయాలు, ఒక్కోసారి మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఇది మీ అభద్రతాభావాలు, విశ్వసనీయత మరియు పరిత్యాగ సమస్యల కారణంగా కావచ్చు. మీరు మీ అభద్రతలను దూరం చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, లేదా మీ ప్రియమైన వారితో చర్చలు జరపడం ద్వారా తీసుకున్న నిర్ణయాలే మీకు ఎక్కువగా సహాయపడగలవు. ఏ వయసులో అయినా సరే మీరు వివాహానికి సిద్దపడే ముందు పై విషయాలను దృష్టిలో ఉంచుకోవడం మంచిది.

ధనుస్సు:

ధనుస్సు:

మీరు ఎక్కువగా స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యాలకు ఎక్కువ విలువనిస్తుంటారు. మరియు ప్రయత్నించు-సాధించు అన్న ధోరణిలోనే ఉంటారు. దీని కారణంగా, ఎక్కువగా కుటుంబ బాధ్యతలతో సతమతమవుతూ ఉంటారు. మీరు ఆ స్వేచ్ఛను అనుమతించే ఎవరైనా మీ జీవితంలోకి వస్తున్నట్లు కనుగొంటే, వదులుకోడానికి సిద్దంగా ఉండరు. మీరు మొదటగా స్థిరపడటాన్ని చూడడం చాలా అరుదు. మీకు మీ కలలను సాధించే క్రమంలో, మరియు మీతో కలిసి ప్రపంచాన్ని చూడడానికి సిద్దంగా ఉన్న వ్యక్తిని మీ జీవితంలో భాగంగా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి, మీ ఆలోచనలకు తగ్గట్లు, ఒక స్థిరమైన వయసుకు వచ్చాకనే వివాహం చేసుకోవలసి ఉంటుంది. మీ లక్ష్యాలు నెరవేరినప్పుడు, మీరు మీపై పూర్తిగా దృష్టిసారించగలరు.

మకరం:

మకరం:

మీరు కెరీర్, మరియు బాధ్యతల గురించిన ఆలోచనలను అధికంగా కలిగి ఉంటారు. ఎక్కువగా మీరు మీ ప్రియమైన వారి నుండి ఆప్యాయత, ప్రేమను కోరుకుంటూ ఉంటారు. వివాహ ఆలోచనలు మీకు కష్టమైనవి కాకపోయినా, నిర్ణయాల ప్రకారం తీవ్రమైన ఆలోచనలు చేస్తుంటారు. వివాహాన్ని జీవితంలో ఒక పునాదిరాయిగా భావించే స్వభావం మీది. మిమ్మల్ని మరియు మీ లక్ష్యాలను మరింతగా ముందుకు తీసుకెళ్లగలిగేదిగా మీ వివాహ జీవితం ఉండలాని కోరుకుంటారు. 20వ దశకంలోనే వివాహం చేసుకోవాలన్న ఆలోచన ప్రారంభం కావొచ్చు. మరియు మీరు మీ విశ్వసనీయత మరియు అంకితభావం వంటి లక్షణాల కారణంగా మీ భాగస్వామితో సంతోషంగా, దీర్ఘ-కాల సంబంధంలో ఉంటారు.

కుంభం:

కుంభం:

ధనుస్సురాశి వ్యక్తుల వలె, మీరు కూడా ఎక్కువ స్వేచ్ఛకు ప్రాధాన్యతని ఇస్తుంటారు, మరియు మీరు వీలైనంత కాలం అదే భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ స్వేచ్చా స్వాతంత్ర్యాలన్న ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడంలో మీ వివాహ జీవితాన్ని కాస్త ఆలస్యం చేయవచ్చు కూడా. కావున ఇటువంటి సందర్భంలో మీ ప్రియమైన వారి సలహా తీసుకుంటూ అంతరాత్మతో చర్చలు జరిపి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. లేనిచో వివాహం విషయంలో కొన్ని ప్రతికూల సమస్యలు తప్పవు.

మీనం:

మీనం:

మీరు ఎక్కువగా ఊహాజనిత ప్రపంచంలో మనుగడని సాగించేవారిగా ఉంటారు, మరియు మీరు మీ లోతైన, కాల్పనిక, ప్రపంచంలో మనుగడ సాగించడం కారణంగా వాస్తవిక ప్రపంచాన్ని కోల్పోతుంటారు. వాస్తవిక ప్రపంచంలో మీకు అనుగుణంగా నడచుకోగలిగిన వ్యక్తి తారసపడినప్పుడు, వయసు పెద్ద ప్రామాణికం కాకపోవచ్చు. 20వ దశకం మీ వివాహానికి సరైన సమయంగా చెప్పబడింది.

English summary

Perfect Age To Get Married According To Your Zodiac Sign

The age at which you get married plays an essential role in how successful your married life is. Even if you share great compatibility with your life partner, getting married at the right age helps both of you adjust to each other's lifestyle. Zodiac predictions help you understand what the best age for you to get married is.
Story first published: Thursday, July 5, 2018, 10:08 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more