For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ గతించిన స్మృతుల నుండి రాశి చక్రాల ఆధారంగా తెలుసుకోవలసినవి.

  |

  ప్రేమలో ఉన్నప్పుడు మధురానుభూతులకు కొదువే ఉండదు, కానీ ఒక్కసారి సంబంధం తెగితే, ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది అనడంలో సందేహమే లేదు. కానీ ఇక్కడ కొన్ని పరిస్థితులు రాశిచక్రాల మీద కూడా ఆధారపడి ఉంటాయని మీరు గ్రహించగలరా?

  మన జ్యోతిష్యుల కథనం ప్రకారం, ప్రతి రాశిచక్రం కొన్ని సంకేతాలను ఇస్తూనే ఉంటాయి, వాటిని గ్రహించడం ద్వారా భవిష్యత్తులో సంబంధాల గురించిన సరైన ప్రణాళికను కూడా చేసుకోవచ్చని సూచిస్తుంటారు.

  ఈ సూచనలు సంబంధం వీగిపోయిన వారికి, వారి మార్గానికి చేదు జ్ఞాపకాలు అడ్డుపడకుండా ముందుకు సాగుట కొరకు సూచించబడినవి.

  మేషం మార్చి 21- ఏప్రిల్ 19

  మేషం మార్చి 21- ఏప్రిల్ 19

  వీగిపోయిన సంబంధంలోని మధురానుస్మృతులను తలచుకుని లాభంలేదు, మీరు ఆలోచించవలసిన కార్యాలు అనేకం ఉన్నాయని గ్రహించవలసిన అవసరం ఉంది. మీ ప్రేమను ఆశించేవారు కూడా ఉన్నారు, ఈ విషయాన్ని గ్రహించక మీరు పాత జ్ఞాపకాలలోనే జీవించాలి అనుకోవడం అవివేకమే అవుతుంది. మీ ప్రేమను కోల్పోవడం వారి దురదృష్టమే అవుతుంది కానీ, మీది కాదు.

  వృషభం ఏప్రిల్ 20 – మే 20

  వృషభం ఏప్రిల్ 20 – మే 20

  మీ పాత సంబంధాలనుండి ఒక గుణపాఠాన్ని నేర్చుకుని మీ జీవన మార్గం పైన దృష్టిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ సంబంధం కారణంగా మీ నిజజీవితానికి దూరమయ్యారు అన్న భావన మీలో కలుగుతుంది. మరియు ఆ సంబంధంలో ఉన్న ప్రత్యేకత ఏమిటో మీకు ఇప్పటికీ ఒక ప్రశ్నగానే ఉంటుంది. త్వరలోనే మీరు అర్ధం చేసుకుంటారు, దూరమవ్వడమే మంచిది అని.

  మిధునం మే 21- జూన్ 20

  మిధునం మే 21- జూన్ 20

  ప్రేమ అనేది నిర్భంధ ప్రక్రియ కాదన్న విషయాన్ని గ్రహిస్తారు. మీ ఆలోచనలకు సరిపడే వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందాలన్న కోరిక మీది. కానీ అలాంటి వారు అరుదుగా ఉండడమే మీ వైఫల్యాలకు కారణం. మిమ్ములను అర్ధం చేసుకునే జీవిత భాగస్వామి ఖచ్చితంగా తారసపడుతారు. ఒక్కోసారి మిమ్ములను మీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కూడా. మీరు ఎక్కువ ఆలోచనలు చేయకపోవడమే మంచిది.

  కర్కాటకం జూన్ 21- జూలై 22

  కర్కాటకం జూన్ 21- జూలై 22

  మీ పాత జ్ఞాపకాల దృష్ట్యా మరొక సంబంధంలో కొనసాగాలన్న ఆలోచనను కూడా దరికి రానివ్వని స్థితిలో ఉంటారు. కానీ మీ గురించి మీరు పూర్తిగా తెల్సుకుని, మిమ్ములను మీరు ప్రేమించుకోవలసిన అవసరమున్నది. తర్వాతనే మీరు మీ భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. లేనిచో ఒక స్తబ్ధత నెలకొంటుంది. మిమ్ములను మీరు కోల్పోకండి. ఎవ్వరినైనా సరే, పూర్తిగా మీ ప్రపంచం అనుకునే భావనలను కూడా పక్కనపెట్టాల్సి వస్తుంది. మిమ్ములను మీరు సంసిద్దపరచుకున్నాకనే మీరు ఇతరముల గురించిన ఆలోచనలు చేయండి.

  సింహం జూలై 23 – ఆగస్ట్ 23

  సింహం జూలై 23 – ఆగస్ట్ 23

  మీరు చిన్నవే కదా అని పట్టించుకోని కొన్ని విషయాలే మీ సంబంధo నాశనం అవడానికి కారణమని తెలుసుకుంటారు. తద్వారా మీరు ప్రతి అడుగులోనూ జాగ్రత్త వ్యవహరించేలా తయారవుతారు. ఇది ఒకందుకు మంచిదే. మీ భవిష్యత్ ప్రణాళికలకు మీ ఆలోచనా విధానం సరితూగేలా ఉంటుంది. కష్టసమయాల్లో మీతో లేని వ్యక్తి పట్ల హేయభావం పెరిగి, సరికొత్త ఆలోచనలకు నాంది పలుకుతుంది. మీ మానసిక పరివర్తన ద్వారా మీ మంచి చెడుల యందు మీ వెంట నడిచే భాగస్వామిని, మీ యందు అమితమైన ప్రేమను కనపరచే వారినే కోరుకుంటారు.

  కన్య ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

  కన్య ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

  మీ పాత సంబంధాల దృష్ట్యా, మరే ఇతర సంబంధాలను కలిగి ఉండుటకు ఇష్టపడరు. ఒక్కొక్కసారి ప్రేమ మీదనే అసహ్యాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇది మంచి పద్దతి కాదు. మీరు ఎక్కువగా, వారు మీ పట్ల చేసిన ప్రతికూల అంశాలను గుర్తు తెచ్చుకుని భాధపడుతూ ఉంటారు. కానీ మీ రాశి ప్రకారం మిమ్ములను అధికంగా ప్రేమించేవారు మీకు తెలీకుండా మీ చుట్టూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి అంతరాత్మతో చర్చ జరిపి , మానసిక ప్రతికూల అంశాలను పక్కన పెట్టి సానుకూల దృక్ఫధంతో ముందుకు నడవాల్సిన అవసరం ఎంతో ఉంది.

  తుల సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

  తుల సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

  మీరు మీ పాత సంబంధాల దృష్ట్యా, ఇతరులతో సున్నితంగా ఉండకూడదు అన్న నిర్ణయానికి వస్తారు. డిప్రెషన్ స్థాయిలను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి సమయంలోనే మీ కుటుంబసభ్యులకు మీ పై ఉన్న ప్రేమను గ్రహిస్తారు. క్రమoగా మిమ్ములను మీరు మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఆ చేదు జ్ఞాపకాలను కూకటి వేళ్ళతో పెకలించి నూతన జీవనానికి నాంది పలికేలా తయారవుతారు. మీలో కోపం పెరుగుతుందే కానీ ఇతరుల పట్ల మీ దయాగుణం , సానుభూతి మీ మనసు పొరల్లో ఎప్పటికీ ఉంటుంది.

  వృశ్చికం అక్టోబర్ 24 – నవంబర్ 22

  వృశ్చికం అక్టోబర్ 24 – నవంబర్ 22

  మీ పాత జ్ఞాపకాలు మీలో అభద్రతా భావాన్ని పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి, ఆ ప్రతికూల అంశాలను పూర్తిగా పక్కన పెట్టి మీ మానసిక స్థైర్యo పెంచుకునే దిశలో అడుగులు వేయవలసి ఉంటుంది. మీ గతించిపోయిన జీవితంలోని కొందరు ప్రతికూల ప్రభావిత వ్యక్తులు మీ భవిష్యత్తులో ఎటువంటి ప్రభావాలను చూపలేరు.

  ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

  ధనుస్సు నవంబర్ 23 – డిసెంబర్ 22

  మీ గతించిపోయిన సంబంధం దృష్ట్యా , ఎంతకాలం వారితో గడిపాము అన్నది కాదు, చివరికి ఏం మిగిలింది అన్న ఆలోచన చేస్తారు. తద్వారా ఒకరిపైఒకరి ఆలోచనలని అంచనా వేస్తారు. జీవితాంతం కొనసాగే సంబంధాల మీద దృష్టిని కేంద్రీకరిస్తారు. మీకు మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అండ ఎప్పుడూ ఉంటుంది. మీరు అసౌకర్యంగా భావించే వ్యక్తులే మీ పట్ల చూపించే ప్రేమ , మీకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. క్రమంగా ఏది నిజం ఏది అబద్దం అన్న ఆలోచనల దృష్ట్యా మీ ప్రణాళికలు ఏర్పరచుకుంటారు.

  కుంభం జనవరి 21 – ఫిబ్రవరి 18

  కుంభం జనవరి 21 – ఫిబ్రవరి 18

  మీ గతించిన జ్ఞాపకాల దృష్ట్యా ఆర్ధికపరంగా, మానసికంగా మీరు నష్టపోయిన అంశాల గురించిన ఆలోచనలు చేస్తుంటారు. క్రమంగా మానసిక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. మీరు తర్వాతి సంబంధాల మీద నమ్మకంలేని వారిగా తయారవుతారు. కొన్ని జ్ఞాపకాలను తుడిచి పెట్టి మీకై ఎదురుచూస్తున్న వారిని గుర్తించి వారితో మీ జీవనం కొనసాగేలా ప్రణాళికలు చేసుకోవడం అన్నివేళలా ఉత్తమం. జీవితం అక్కడితో ఆగిపోకూడదు అన్నీ నిర్ణయానికి వస్తారు.

  మీనం ఫిబ్రవరి 19 – మార్చి 20

  మీనం ఫిబ్రవరి 19 – మార్చి 20

  మీ గతించిన జ్ఞాపకాలు మీలో ఉన్న మానసిక బలాన్ని వెలికితీస్తాయి. మీ ఊహకు కూడా అందనంతగా. ఆ చేదు జ్ఞాపకాలనుండి త్వరగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. మిమ్ములను ప్రేమించి మీతో జీవనం గడుపుటకు ఇష్టపడేవారి గురించిన ఆలోచన చేస్తారు. మా పాతజ్ఞాపకాలు మీ భవిష్యత్తుకు ఎటువంటి సమస్యలను కలగజేయవు.

  English summary

  Things To Learn From Your Past Relationship Based On Your Zodiac Sign

  When relationships end, there are many lessons that we learn. Understanding these lessons based on your zodiac signs helps you to take better care when you get into a new relationship. Foe example, Virgo individuals seem to realise that second chances are not always earned or even that promises are not always kept from their past relationships.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more