For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిగిలిన రాశి చక్రాల వారితో సన్నిహితంగా ఎలా మెలగాలి?

|

మీరు ప్రేమ వైఫల్యాన్ని అనుభవిస్తున్నారా, లేక మీరు ఇష్టపడే వ్యక్తులతో సన్నిహితంగా మెలగలేక పోతున్నారా? లేక, ఇలా దైనందిక జీవితంలో ఉండే వ్యక్తుల పట్ల కూడా సన్నిహితంగా మెలగలేకపోతున్నామని భాద పడుతున్నారా ?

రాశి చక్రాలు ఆడే ఆటలో మీరు ఒక పావులుగా మారుతున్నామని భావిస్తుంటే, మీకోసమే ఈ చిట్కాలు. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తులతో స్నేహ సంబంధాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

స్నేహితులను తక్షణమే ఏర్పరచుకోగలిగిన నైపుణ్యం గల రాశిచక్రాలు ఉన్నప్పటికీ, వారి మొత్తం జీవితాలను స్నేహానికే అర్పించేవాళ్ళూ లేకపోలేదు.

ఇక్కడ, ఈ ఆర్టికల్లో, మేము ప్రతి రాశిచక్రం గురించి వివరాలను పొందుపరుస్తునాము , తద్వారా మీరు వారితో స్నేహాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకునే వీలుంటుంది.

మేష రాశి : మార్చి 21- ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21- ఏప్రిల్ 19

మేష రాశి వ్యక్తుల పట్ల "మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పని, వీరికి అండగా వెన్నుదన్నుగా ఉండడమే" మీరు ఈ వ్యక్తులపట్ల స్నేహపూర్వకంగా ఉండాలి అని భావిస్తే, మీరు కాస్త కష్టపడక తప్పదు. మరొక వైపు, మీరు ఒక గర్విష్టిగా, స్వార్ధ చింతన కలిగి ఉండకూడదు. ఏమాత్రం ప్రదర్శించినా, వీరు కఠినంగా వ్యవహరిస్తుంటారు.

వృషభ రాశి : ఏప్రిల్ 20 – మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 – మే 20

మీ స్నేహితులు వృషభ రాశికి చెందిన వారైతే “ఎంత వీలయితే అంత నిజాయితీగా ఉండాలి”. వీరు వ్యక్తులను ఎంతగా ప్రేమిస్తారో అంతే ప్రేమను తిరిగి పొందాలన్న ఆలోచన చేస్తుంటారు. మీ సమగ్రత, నిజాయితీని ఎక్కువగా ప్రదర్శించవలసి వస్తుంది. ఎటువంటి మోసాన్నైనా వెంటనే గుర్తించే తత్వం కలిగిన వీరి పట్ల మీరు జాగ్రత్తగా లేని పక్షంలో, సంబంధాలు విచ్చిన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు. కుటుంబం పట్ల అధిక ప్రేమను కలిగిన వీరు, తమ ప్రతి ఆలోచనలలోనూ కుటుంబమే ప్రధానంగా ఉండేలా ఉంటుంటారు. వీరికి కానీ, వీరి కుటుంబానికి కానీ వ్యతిరేక ఆలోచనలు చేసేవారిని తమ చాయలకు కూడా రానివ్వరు.

మిధున రాశి : మే 21 – జూన్ 20

మిధున రాశి : మే 21 – జూన్ 20

"మీరు ఈ మేధావి స్నేహాన్ని పొందాలి అంటే, వారి మనస్సును ఉల్లాస పరుస్తూ ఉండాలి!". ఇది కాస్త కష్టతరమే అయినా తప్పదు. వీరి పట్ల నిరుత్సాహాన్ని ప్రదర్శించినా, ఏకాగ్రతను కలిగి లేకున్నా, మీ వలన వీరు అసహనాన్ని కలిగినా సంబంధాలు నాశనం దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ వీరి మనసును రంజింప చేస్తూ ఉండాల్సిందే. కానీ వీరు మీ పట్ల ప్రేమను కలిగి ఉన్నారు అంటే మీ అదృష్టమనే చెప్పాలి. వీరి ప్రేమ అనంతం.

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

“స్నేహంలో విధేయతను ఆశించే కర్కాటక రాశి వారు, చపలచిత్తం కలిగి ఉండడాన్ని సహించలేరు.”. కుటుంబం పట్ల అధిక ప్రేమను కలిగి ఉన్న వారిని, గాసిప్స్ లో కాకుండా నిజజీవితంలో బ్రతికేవాడిని, ఇతరుల పట్ల సముచిత ఆలోచనలు చేసే వారిని, తమను తాము గౌరవించుకునే వారిని, వృత్తి పట్ల, నిబద్దత, క్రమశిక్షణ కలిగిన వారిని వీరు ఎక్కువగా ఇష్టపడుతారు.

సింహ రాశి : జూలై 23 – ఆగస్ట్ 23

సింహ రాశి : జూలై 23 – ఆగస్ట్ 23

“ వీరికి మీరు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేవారిలా ఉండాలి” . వీరికి తమ పట్ల ఎక్కువ ప్రేమను ప్రదర్శించే వారన్నా, తమను అందరిలో ఉన్నతంగా చూసేవారన్నా ఎక్కువ మక్కువను ప్రదర్శిస్తుంటారు. వీరు పోటీతత్వాన్ని ఇష్టపడరు, ఎల్లప్పుడూ ఏకైక వ్యక్తిగా ఉండాలన్న ఆలోచనలు చేస్తుంటారు. వీరి పట్ల అధిక చనువును ప్రదర్శిస్తే, నిట్టనిలువునా పక్కన పెట్టేస్తారు. కావున కాస్త జాగ్రత్త తప్పదు మరి.

కన్యా రాశి : ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

కన్యా రాశి : ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

“వీరెప్పుడూ తమని తాము మొదటగా గౌరవించుకునే వారిలా ఉంటారు, మరియు అటువంటి వ్యక్తిత్వం ఉన్నవారినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇది నిజంగా ఉన్నతమైన లక్షణం”. ఆరోగ్యం పట్ల, ప్రత్యేక శ్రద్ధను కలిగిన వారిగా, జీవితంలో ప్రతి విషయం పట్ల ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒకవేళ వీరి పట్ల మీరు స్నేహాన్ని కలిగి ఉండాలని భావిస్తే, మీరు కొన్ని పద్ధతులకు అలవాటు పడక తప్పదు. వీరి ప్రణాళికా బద్దమైన జీవితం మొదట్లో కాస్త విసుగు తెప్పించినా, వీరి ఆలోచనల విధానం అర్ధమయ్యాక వీరి స్నేహం ఎంత విలువైనదో తెలుస్తుంది. కన్యా రాశి వారు భాద్యతలను ఎక్కువగా తీసుకొనుటకు ఇష్టపడుతుంటారు. కుటుంబం పట్ల, తమ ప్రియమైన వారి పట్ల అధిక ప్రేమను కలిగి ఉండే ఇలాంటి వారి స్నేహం అందరికీ దొరకదు.

తులా రాశి : సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

తులా రాశి : సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

“సంతోషంగా, ఫ్రెండ్లీగా , ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వారినే వీరు ఎక్కువ ఇష్టపడుతారు”. వీరితో స్నేహం చాలా స్వచ్చంగా ఉంటుంది. వీరు మీ నుండి పెద్దగా ఏమీ ఆశించరు. ఒక చిరునవ్వుని తప్ప. మీరు ఎంత నిజాయితీని ప్రదర్శిస్తారో, వారు మీ పట్ల అంత అంకిత భావాన్ని కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ సంతోషంగా బ్రతకాలని కోరుకునే వీరికి,భావోద్వేగాలు కూడా కాస్త ఎక్కువే. ప్రతి చిన్న విషయాన్ని కూడా తీవ్రంగా ఆలోచించే వీరు, కుటుంబం, స్నేహం పట్ల కూడా అంతే నిబద్దతను ప్రదర్శిస్తుంటారు.

వృశ్చిక రాశి : అక్టోబర్ 24 – నవంబర్ 22

వృశ్చిక రాశి : అక్టోబర్ 24 – నవంబర్ 22

“ మీరు ఇతరులు అమాయకత్వాన్ని కలిగి ఉండడాన్ని ఇష్టపడుతారు ” . తద్వారా అతి తెలివిని ప్రదర్శించడానికి అంగీకరించరు. ఎవరైనా హేళన చేసినా , వ్యతిరేక భావాలను ప్రదర్శించినా అస్సలు క్షమించలేని తత్వం వీరిది. వీరి పట్ల చేసే ఒక్క చిన్ని పొరపాటు, జీవితకాల విరోధిగా మార్చే అవకాశాలు ఉన్నాయి. కావున జాగ్రత్త తప్పదు మరి.

ధనుస్సు రాశి : నవంబర్ 23 – డిసెంబర్ 22

ధనుస్సు రాశి : నవంబర్ 23 – డిసెంబర్ 22

“ నాటకీయత ధోరణి కలిగి ఉండడాన్ని ఇష్టపడరు, సంతోషం వీరి ప్రధమ సూత్రం” . వెన్నుపోటు దారులను, క్రూరత్వం కలిగిన చూపులకు కాస్త దూరంగా ఉండాలన్న ఆలోచన వీరిది. జీవితంలో ఎన్ని కష్టాలున్నా, స్నేహం ద్వారా స్వాంతన పొందగలం. అటువంటి స్నేహమే కల్తీ అయితే అస్సలు తట్టుకోలేరు. కావున ఎంచుకునే స్నేహితుల విషయంలో కూడా అత్యంత జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు కూడా.

కుంభ రాశి : జనవరి 21 – ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 21 – ఫిబ్రవరి 18

ఫ్రెండ్లీగా ఉండండి, కానీ ఫ్రెండ్షిప్ కోసం బలవంతం చేయకండి. వీరు ఎప్పటికీ అయిష్టంగా స్నేహాన్ని కలిగి ఉండలేరు. ఎల్లప్పుడూ స్నేహంలో నిజాయితీ ఉండాలని ఆలోచిస్తుంటారు. మరియు వీరి మనసుకు నచ్చిన వారితోనే స్నేహం చేసే అలవాటు మెండుగా ఉన్న వీరు, నచ్చని వారితో బలవంతపు స్నేహాలను ఎన్నటికీ అంగీకరించలేరు. వీరి పట్ల జాగ్రత్తగా మెలుగకపోతే శాశ్వత దూరాలకు కారణభూతమవుతారు . వీరి పట్ల ఎప్పుడూ మంచిమాటలను చెప్తూ వెన్నుతట్టే వారిగా ఉన్నప్పుడే వీరి మనసుకు చేరువవుతారు,

 మీన రాశి : ఫిబ్రవరి 19 – మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 – మార్చి 20

“ తమ తప్పులను కూడా అంగీకరించగలిగేవారే స్నేహితులు”. ప్రతి మనిషిలోనూ తప్పులూ, ఒప్పులూ సహజం. కానీ అందరూ ఒప్పులు చెప్పినంతగా తప్పులు చెప్పడానికి సిద్దంగా ఉండరు. అలాంటి అలవాట్లు వీరికి నచ్చవు.వీరు స్నేహం పట్ల, ప్రేమ పట్ల, సంబంధాల పట్ల, భాగస్వామి పట్ల అత్యధిక విశేయతను కలిగి ఉండాలన్న ఆలోచన చేస్తుంటారు. తద్వారా తమ తప్పులను కూడా నిర్భయంగా చెప్పే అలవాట్లు కలిగిన వీరు, తమ తప్పులని మనస్పూర్తిగా అంగీకరించిన వారినే తమ వారిగా గుర్తిస్తుంటారు. ఏ మాత్రం నిజాయితీని కలిగి లేకపోయినా, వీరి స్నేహానికి అర్హులు కానట్లే.

English summary

Zodiac Signs Which You Can Befriend Instantly

There is a science which helps in cultivating friends and this is something that is based on enchanting people with your star qualities. Each of the zodiac signs are believed to have their own share of qualities on how they make friends and these qualities define them from one and another.Easy Tricks To Win Over Different Zodiac
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more