మిమ్మల్ని వృశ్చికరాశి వారు విస్మరిస్తున్నారు అనే విషయం ఎలా తెలుసుకోవాలో మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మొత్తం అన్ని రాశుల్లో కెల్లా బలమైన రాశుల్లో వృశ్చికరాశి కూడా ఒకటి. వృశ్చిక రాశి వ్యక్తుల్లో ఉన్న విలక్షణతలను ' వృశ్చిక ' గుర్తే నిర్వచిస్తుంది. ఈ వ్యక్తులు ఎదుటి వ్యక్తుల యొక్క ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకొని వారి దగ్గర తమదైన ప్రత్యేకతను చూపిస్తారు.

వృశ్చికరాశి వారు కోపోద్రుక్తులైన సమయంలో వీరిని ప్రేమించేవారు అత్యంత బాధాకరమైన సమయాన్ని అనుభవించాల్సి రావొచ్చు. ఎందుకంటే వీరికి కోపం అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. ఎన్నోరకాల భావోద్వేగాలు అందులో మిళితమైన ఉంటాయి. అలాంటి సమయంలో వృశ్చికరాశి వారిని ప్రేమించే వారు, వీటిని తట్టుకోవడం కొద్దిగా కష్టతరం అవుతుంది.

How Would You Know If A Scorpio Is Ignoring You?

వృశ్చికరాశి వారు గనుక మిమ్మల్ని విస్మరిస్తే ఆ సమయంలో మీరు ఏమిచేయాలి ?

వారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేయడానికి వారికి కొన్ని అపూర్వమైన లక్షణాలు ఉన్నాయి. వృశ్చికరాశివారి యొక్క కోపాన్ని నిరోధించడం ఒక విద్యలాంటిది. చాలాకొద్దిమంది మాత్రమే వారు విస్మరించినా కూడా వీటన్నింటిని తట్టుకొని బయటపడగలరు.

వృశ్చికరాశి వారు విపరీతమైన కోపం లేదా బాధను కలిగిన స్థితులకు అనూహ్యంగా చేరుకుంటారు. మీరు ఏ తప్పు చేయడం వల్ల వారు ఈ స్థితికి చేరుకున్నారు అనే విషయం పసికట్టడం కష్టం, అది తెలుసుకోవడం అసాధ్యమనే చెప్పాలి.

అందుచేతనే వారి యొక్క లక్షణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వృశ్చికరాశి వారి యొక్క లక్షణాలు మరియు సంజ్ఞల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వీరు వ్యక్తులను విస్మరించినప్పుడు వాళ్ళు ఎలా భావిస్తారు అనే విషయం ఇప్పుడు క్షుణంగా తెలుసుకోవడం జరుగుతుంది.

వృశ్చికరాశి వారిని అర్ధం చేసుకోవడం :

వృశ్చికరాశి వారిని అర్ధం చేసుకోవడం :

వృశ్చికరాజు వారు కొన్ని సార్లు సౌమ్యంగా, మరికొన్ని సందర్బ్బాల్లో కఠినంగా వ్యవహరిస్తారు. వారు మిమ్మల్ని అయోమయంలో నెట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే, ఒకానొక సమయంలో ఎంతో బాధ్యాయుతంగా వ్యవహరిస్తూ ప్రతిస్పందిస్తుంటారు. మరికొన్ని సార్లు మీ వద్ద నుండి అదృశ్యమైపోతుంటారు. మీరు ఫోన్ చేసిన, మెసేజ్ లు చేసినా ప్రతిస్పందించారు. ఈ పరిస్థితులన్నీ మిగతా రాశులవారికి ఎబ్బెట్టుగా అనిపిస్తుండొచ్చు. కానీ వృశ్చికరాశి వారికి ఇది సర్వసాధారణం.

వారంతట వారుగా తరచూ పరిస్థితుల నుండి ఉపసంహరించుకుంటారు :

వారంతట వారుగా తరచూ పరిస్థితుల నుండి ఉపసంహరించుకుంటారు :

ఆనందంగా లేనప్పుడు లేదా సంతృప్తి లేనప్పుడు, ఒత్తిడి లేదా పని ఒత్తిడి మరీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఈ రాశివారు తమంతట తాముగా వీటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించి, తమని తాము ఆ పరిస్థితుల నుండి ఉపసంహరించుకుంటారు. ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తులు చేయవల్సిన పని ఏమిటంటే, వారి గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా వారికి తగినంత, కోరుకున్నంత వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీరు ఎప్పుడైతే మళ్ళీ సాధారణ స్థితికి వస్తారో, అటువంటి సమయంలో వారే మీ దగ్గరకు వచ్చి సంప్రదించి వివరణ కూడా ఇస్తారు.

ఎందుకు వారు మిమల్ని విస్మరిస్తారు :

ఎందుకు వారు మిమల్ని విస్మరిస్తారు :

మొదట్లో ఈ రాశి వారు విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తారు. అది మిమ్మల్ని బాధపెట్టవచ్చు మరియు అంతేకాకుండా వారు మిమ్మల్ని విస్మరిస్తారు. వీరు ఎప్పుడైతే బాధపడుతుంటారో మరియు ఆందోళనగా ఉంటారో, ఆ సందర్భాన్ని ఎదుటి వ్యక్తులు అర్ధం చేసుకునే విధంగా వీరు ప్రవర్తిస్తారు. ఈ రాశి వ్యక్తులు ఎంతో భావోద్వేగంతో వ్యవహరిస్తారు, నమ్మకస్తులుగా ఉంటారు మరియు మంచి అభిరుచి కూడా ఉంటుంది. కానీ ఈ విషయాన్ని ఎవ్వరికి తెలియనివ్వరు. అందుచేతనే వీరు ఎక్కువగా వ్యక్తిగత స్వేచ్చని కోరుకుంటారు. అంతేకాకుండా, వీరు మళ్ళీ సాధారణ స్థితికి చేరేవరకు ఏకాంతంగానే గడపటానికి ఇష్టపడతారు.

వీరు ఎక్కువగా స్వాధీనతతో వ్యవహరిస్తారు:

వీరు ఎక్కువగా స్వాధీనతతో వ్యవహరిస్తారు:

వీరు మిమ్మల్ని విస్మరించినప్పటికీ కూడా, వారిలో ఉన్న స్వాధీనత తత్వం మిమ్మల్ని వదిలేలా చేయదు. మీరు ఎప్పుడైతే ఈ రాశివారిని విస్మరిస్తారో, అప్పుడు వీరు ఎంతో త్వరగా వ్యవహరించి ఒకవేళ మీరు గనుక వారిని వదిలేస్తే ఏమవుతుంది అనే ఆలోచనలో పడతారు. ఇది వారిలో ఉండే సహజ ప్రవర్తన. కానీ, ఈ విషయాన్ని వారు ఎప్పుడు ఒప్పుకోరు.

వారు మిమ్మల్ని ఎప్పుడు విస్మరిస్తారు :

వారు మిమ్మల్ని ఎప్పుడు విస్మరిస్తారు :

ఒత్తిడి పెరిగిపోయినప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, పని ఒత్తిడి పెరిగిపోయినప్పుడు మరియు ఇతర సమస్యలు వారిని వేదించినప్పుడు వారు ఎక్కువ వ్యక్తిగత సమయాన్ని, స్వేచ్ఛను కోరుకుంటారు. కలిసి ఉన్న సమయంలో వారు గనుక ఎక్కువగా విసుగుచెందితే అటువంటి సమయంలో మిమ్మల్ని విస్మరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ద్వంద ప్రమాణాలు :

ద్వంద ప్రమాణాలు :

వృశ్చికరాశిలో ఉండే ఈ ఒక్క లక్షణం విన్న ఎవరికైనా ఏంటి ఇది అని అనిపించకమానదు. కానీ, ఎప్పుడైతే ఈ రాశివారు మిమ్మల్ని విస్మరిస్తారో, అప్పుడు కొన్ని గంటలు, రోజులపాటు కనపడకుండా పోతారు. కానీ, ఎప్పుడైతే వారు మళ్ళీ తిరిగి రావాలనుకుంటారో, అటువంటి సమయంలో మీరు అక్కడే వారికి తోడుగా ఉండాలని భావిస్తారు.

ఎలా వీరు ఒంటరితనం అనే స్థితికి ప్రవేశిస్తారో అర్ధం చేసుకోవాలి :

ఎలా వీరు ఒంటరితనం అనే స్థితికి ప్రవేశిస్తారో అర్ధం చేసుకోవాలి :

వృశ్చికరాశి వారిలో ఉండే అతిసాధారణ విలక్షణత ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు లేదా ఎదుటి వ్యక్తులను పూర్తిగా విస్మరిస్తారు. మీతో సాధారణంగా మాట్లాడటానికి ఇష్టపడరు మరియు వారిలో ఉన్న భావాలను, భావోద్వేగాలను మీతో సహా అస్సలు ఎవరితో పంచుకోరు. మీరు గనుక వారు ఉండే గదిలో ఉన్నా లేదా వారి చుట్టుపక్కల ఉన్నా సరే విపరీతమైన విసుగుచెందే అవకాశం ఉంది.

వారి యొక్క అజ్ఞానాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి :

వారి యొక్క అజ్ఞానాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి :

వృశ్చికరాశి వారు ఎప్పుడైతే అజ్ఞానంతో వ్యవహరిస్తారో, అటువంటి సమయంలో మీరు కలత చెందనవసరం లేదు. వారు ఏకాంతంగా ఉండాలనుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే, వీరు వీరియొక్క భావోద్వేగాలన్నింటిని ఒక దగ్గరకు చేర్చుకుంటారు మరియు వాటిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు గనుక మిమ్మల్ని విస్మరిస్తే, తిరిగి వారిని మీరు విస్మరించడం చేయకండి. కొద్దిగా ఓపికతో వ్యవహరించండి. కొద్దిసేపు వారిని ఏకాంతంగా వదిలేయండి. వీరు మళ్ళీ మామూలు స్థితి కి చేరుకొని ఎప్పటిలాగానే మీ వద్దకు తిరిగి వస్తారు.

వారి యొక్క స్థితిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి :

వారి యొక్క స్థితిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి :

వృచ్చికరాశి వారికి ఏ రోజు అయితే అంత బాగా అనిపించదో, ఆ రోజు ఎదుటివారితో ఆహ్లదకరంగా, ఆనందదాయకంగా మాట్లాడటానికి ఇష్టపడరు. మిమ్మల్ని ఆరోజు ఆనందపరచారు. వీరు ఎప్పుడైతే ఒక గదిలోకి ప్రవేశిస్తారో, ఆ సమయంలో అన్ని వైపులా నుండి శక్తి వస్తుందనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. విపరీతమైన పని వల్ల వారు కొద్దిగా కలత చెందవచ్చు. ఎదో ఒక విధంగా ఇతరుల పై నిందలు వేయవచ్చు. అందుచేత వృశ్చికరాసి వారు సరైన స్థితిలో లేనప్పుడు, వారిని దూరంగా ఉంచడం ఉత్తమమైన పని.

మీ తప్పు గనుక ఉంటే క్షమించమని అడగండి :

మీ తప్పు గనుక ఉంటే క్షమించమని అడగండి :

వారికి వచ్చిన కోపం మీ వల్లే అయితే ఆ కారణాన్ని తెలుసుకొని క్షమించమని అడగండి. అంతేకాని నన్ను పూర్తిగా మన్నించండి అని అడగకండి. ఎందుకంటే, అది మరింత పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉంది. కావాల్సినంత వ్యక్తిగత సమయాన్ని వారికి వదిలేయండి. వారి మనస్సుకు ఆలోచించే సమయాన్ని ఇవ్వండి. వృశ్చికరాశి వారు ఎక్కువగా పగలు, పట్టింపులకు పోతుంటారు. కావున మీరు క్షమించమని అడగడం ద్వారా వారి కోపం సహజంగానే తగ్గే అవకాశం ఉంది.

ప్రశాంతంగా ఉండండి :

ప్రశాంతంగా ఉండండి :

ఎప్పుడైతే ఈ రాశివారు కోపంగా ఉంటారో, అటువంటి సమయంలో విపరీతంగా వ్యవహరిస్తారు. అటువంటి సమయంలోనే వీరు గొడవపడటం ఇష్టంలేక, ఎదుటివారిని విస్మరించడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. మీరు గనుక గతంలో వీరిని గాయపరచి ఉంటే, ఆ విషయాలన్నింటిని మీ ముందుకు తీసుకు వచ్చి, వాటిల్లో మీరు చేసే తప్పులను ఏకరువు పెడతారు. అందుచేత మిమ్మల్ని వారు విస్మరించిన సమయంలో మీరు వారిని అలా వదిలేయడం చాలా ఉత్తమమైన పని. వారే సరైన సమయంలో మిమ్మల్ని వచ్చి కలుస్తారు. అంతవరకు మీరు వేచి ఉండటమే ఉత్తమమైన మార్గం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How Would You Know If A Scorpio Is Ignoring You?

    Hence, understanding their characteristics is important. Here are some of the characteristics and signs of Scorpions and also know how it would feel when being ignored by them.
    Story first published: Sunday, January 28, 2018, 12:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more