For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కర్ణుడు ద్రౌపదితో ఆ సుఖాన్ని చూద్దామనుకున్నాడా!

By Bharath
|

కర్ణుడికి మహాభారతంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. వసుషేణుడనేదే అతని పేరు. కర్ణుడు కుంతి కుమారుడైనా ఆమె, పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు. పాండు రాజంటే బుద్ధీ విచక్షణను,దివ్యశక్తుల్ని పిలవగలిగే కుంతి శక్తికి విచక్షణ ఇంకా తోడుకాక ముందే పుట్టాడు కనుకనే ఇతనికి వివేకమబ్బలేదు. దూర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా అవుపిస్తూన్న సూర్యుణ్నే ఆహ్వానించింది కుంతి.

అతని కర్మను పట్టించుకోలేదు

అతని కర్మను పట్టించుకోలేదు

కొడుకు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టినా, భయంకొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి, నీళ్లల్లో విడిచిపెట్టింది. ఆమె అలా చేయడాన్ని చాలా మంది తప్పు పట్టారు గానీ కర్ణుడి పుట్టుకకు కారణమైన అతని కర్మను వాళ్లు పట్టించుకోలేదు.

దుర్యోధనుడి వైపే నిలబడ్డాడు

దుర్యోధనుడి వైపే నిలబడ్డాడు

కర్ణుడికి తల్లే స్వయంగా నువ్వు కౌంతేయుడివే అని చెప్పినా, శ్రీకృష్ణుడు చెప్పినా, కురు వృద్ధుడైన భీష్ముడు చెప్పినా కూడా, అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడానికే అతను ప్రయత్నించాడు. అధర్మమని తెలిసినా, కౌంతేయుడనని ఇప్పుడు వెళ్లిపోతే చెడ్డ పేరు వస్తుందని దుర్యోధనుడి వైపే నిలబడ్డాడు.

దానికోసమే అధర్మం వైపు కొమ్ము కాశాడు

దానికోసమే అధర్మం వైపు కొమ్ము కాశాడు

అర్జునుణ్ని ఆరునూరైనా నూరు ఆరైనా జయించాలి. దానికోసం అధర్మం కొమ్ము కాయడానికి ఒప్పుకోవడమూ అది సరి అయినదా కాదా అని కొద్దిగా కూడా ఆలోచించకుండా దుర్యోధనుడితో మాటలో మాట కలపడమూ తన కోరిక ఎలాగైనా తీరాలనే యావ కొద్దీ జరిగాయి.

ద్రౌపది వేశ్య.. ఆమెను ఏమైనా చేయొచ్చు

ద్రౌపది వేశ్య.. ఆమెను ఏమైనా చేయొచ్చు

వికర్ణుడు, ద్రౌపది దాసి కాదని తేల్చి నప్పుడు దుర్యోధనుడి మెప్పుకోసం కర్ణుడు అతన్ని మూర్ఖుడిగా మార్చాడు. ఏకవస్త్రను సభలోకి తీసుకొని రావడమూ తప్పు గాదు. స్త్రీకి ఒకే భర్త ఉండడం రివాజు. కానీ ఈవిడకు చాలామంది భర్తలున్నారు. అంటే, ఈవిడ ఒక వేశ్య. వేశ్యను ఏక వస్త్రగా ఉన్నా అసలు బట్టలు లేకుండా ఉన్నా సభకు తీసుకొని రావొచ్చు అని కర్ణుడు అన్నాడు. దీనికి కారణం, స్వయంవర సమయంలో కర్ణుణ్ని చూసి ద్రౌపది సూతుణ్ని పెళ్లి చేసుకోను అనడమే.

విఫల ప్రేమ

విఫల ప్రేమ

మరి ద్రౌపదిని ఇంతగా అవమానించిన కర్ణుడికి కూడా ద్రౌపదితో ఒక లవ్ స్టోరీ ఉంది. ఆమెను ఎంతోగానూ ప్రేమించిన కర్ణుడికి చివరకు నిరాశే ఎదురైంది. వేరేవాళ్లతో వివాహం అయ్యింది. ఆ బాధను ఆయన గుండెల్లోనూ ఉంచుకున్నాడు. తన విఫల ప్రేమను కర్ణుడు జీవితాంతం మరిచిపోలేకపోయాడు.

కర్ణుడిని ద్రౌపది ఇష్టపడింది

కర్ణుడిని ద్రౌపది ఇష్టపడింది

ద్రౌపది స్వయంవరంలో కర్ణుడి ప్రేమకథ మొదలైంది. ద్రౌపది కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలన్నీ కర్ణుడిలో ఉన్నాయి. దీంతో తొలిచూపులో కర్ణుడిని ద్రౌపది ఇష్టపడింది. అయితే స్వయంవరంలో అతడిని తిరస్కరించి అర్జునుడిని వరించాల్సి వచ్చింది. ఎందుకంటే రాధేయుడు రాజు కాదు కాబట్టి స్వయంవరంలో పాల్గొనే అర్హత లేదని కృష్ణుడు అంటాడు. దీంతో కర్ణుడు పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది. అయితే కొన్ని చోట్ల ద్రౌపది కూడా కర్ణుడిని తిరస్కరించినట్లు ఉంది.

రెండు వివాహాలు చేసుకున్నా

రెండు వివాహాలు చేసుకున్నా

కర్ణుడు రాజు కాకపోవడమే ఇక్కడ ప్రధాన విషయం కాదు. ద్రౌపదిని వివాహం చేసుకోడానికి పాండవులు మాత్రమే అర్హులని కృష్ణుడి అభిప్రాయం. తాను అనుకున్నట్లుగానే అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్నాడు. దీంతో కర్ణుడు అవమాన భారంతో కుమిలిపోయాడు. ఈ భగ్నప్రేమికుడు రెండు వివాహాలు చేసుకున్నా తన ప్రేమను మాత్రం మరచిపోలేకపోయాడు.

వృషాలితో పెళ్లి

వృషాలితో పెళ్లి

ద్రౌపది స్వయంవరంలో జరిగిన అవమానం నుంచి కర్ణుడు బయటపడడానికి అతన్ని పెంచుకున్న తండ్రి అధిరథుడు పెళ్లి చేశాడు. మొదట వృషాలితో పెళ్లి నిశ్చయించాడు. ఆమెను పెళ్లాడాడు కర్ణుడు. అయితే ఆమెతో అంతగా సుఖంగా లేకపోయాడు.

సుప్రియను కూడా

సుప్రియను కూడా

తర్వాత కర్ణుడు ఆమెతోపాటు దుర్యోధనుడి భార్య భానుమతి స్నేహితురాలు సుప్రియను కూడా పెళ్లాడాడు. కానీ ద్రౌపదిని మాత్రం కర్ణుడు మరిచిపోలేకపోయాడు. వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేకపోయాడు. వృషాలి, సుప్రియలకు పుట్టిన పిల్లలు కూడా తండ్రి మనసులోని బాధను దూరం చేయలేకపోయారు. కర్ణుడు ద్రౌపదిని పెళ్లి చేసుకుని ఆమెతోనే జీవితాంతం ఉండదలిచాడు. ఆమె అతని నుంచి దూరం అయి.. ఇతర మహిళలు అతని జీవితంలోకి వచ్చినా అతనికి మాత్రం అంతగా సంతృప్తి అనిపించలేదు.

ద్రౌపదికి కర్ణుడు అంటే అస్సలు ప్రేమ లేదంట

ద్రౌపదికి కర్ణుడు అంటే అస్సలు ప్రేమ లేదంట

కానీ ద్రౌపదికి కర్ణుడు అంటే అస్సలు ప్రేమ లేదంట. ఆమెకు కర్ణుడి మీద ఆ దృష్టి ఎంతమాత్రమూ లేదనేందుకు తిరుగులేని ఆధారం స్వర్గారోహణపర్వంలో ఉంది. పాండవులు రాజ్యం వారసులకు అప్పగించి ద్రౌపదీసమేతంగా హిమాలయాల్లో పడి పోతున్నప్పుడు ముందుగా ద్రౌపది నేలకూలుతుంది. అయినా అర్జునుడితో సహా నలుగురు పాండవులు తిరిగైనా చూడకుండా స్వర్గం వైపు వెళ్తుంటే భీముడు ఆమె చనిపోయినందుకు విలపిస్తూ 'ఎందుకిలా జరిగింది?' అని అడిగితే యుధిష్టిరుడు ఇలా అంటాడు: "ఆమెకు మిగిలిన తన భర్తలకంటే అర్జునుడి మీదే ప్రేమ ఎక్కువ. (అదే ఆమె చేసిన పాపం. అందుకే ఆమె చచ్చిపోయింది)".

అర్జునుడొక్కణినే అట

అర్జునుడొక్కణినే అట

అసలు ద్రౌపది ప్రేమించిందీ, పెళ్ళాడాలనుకున్నదీ అర్జునుడొక్కణ్ణే. అప్పటివరకూ బ్రతికాడో చచ్చాడో తెలియని అర్జునుడు కట్టెదుట కనిపించేసరికి ఆనందపరవశురాలైన అయిన ఆమె 'అతణ్ణి పెళ్ళాడాలంటే మమ్మల్నందరినీ కూడా పెళ్ళాడకతప్పదు' అని యుధిష్టిరుడు పెట్టిన నిబంధనకు తలొగ్గింది. 'ఇదెక్కడి అన్యాయం?' అని అప్పుడే నిలదీయకుండా పరిస్థితులతో రాజీపడింది. అలాంటామె తన ప్రేమను జీవితాంతం ఐదుగురు భర్తలకు "సమానంగా" పంచి ఇవ్వడం ఎలా సాధ్యమౌతుంది? అలా ఉండాలనుకోవడం ఘోరమైన అన్యాయం కదా? ఆమె కర్ణుణ్ణి కోరుకున్నమాటే నిజమైతే ఇక్కడ యుధిష్టిరుడి సమాధానమెలా ఉండేదో మీరే ఊహించవచ్చు. ఒక పరపురుషుణ్ని కోరుకున్న పాపానికి అసలు ఆమెను స్వర్గలోక ఛాయలకైనా రానిచ్చి ఉండేవారు కాదు.

Image Source : https://www.speakingtree.in/

English summary

unknown facts about draupadi and karna

unknown facts about draupadi and karna
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more