చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మట్టి గంపలు మోసేవాడు.. కూలిపనులు చేసేవాడు

Written By:
Subscribe to Boldsky

చైనాలో ఇప్పుడు ఒక శక్తిమంతమైన నేతగా ఎదిగారు షీ జిన్‌పింగ్‌. వాస్తవానికి ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా ఉన్న షీ జిన్‌పింగ్‌ పదవీకాలం 2022తో ముగియనుంది. తాజా నిర్ణయం వల్ల జిన్‌పింగ్‌ చైనా అధ్యక్షుడిగా నిరవధికంగా ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఒక తీర్మానం కూడా జరిగింది.

రబ్బర్ స్టాంప్

రబ్బర్ స్టాంప్

చైనా పార్లమెంటు ఒక రబ్బర్ స్టాంప్ లాంటింది. అందుకే దాన్ని ఎలా అంటే అలా ఉపయోగిస్తున్నారు. ఇక షీ జిన్‌పింగ్ జీవితాంతం లేదా ఆయనకు నచ్చినంత కాలం దేశాధ్యక్షుడిగా కొనసాగొచ్చు. ప్రెసిడెంట్ ఫర్ లైఫ్ అనే పదం ద్వారా ఇలాంటి అవకాశం జిన్ పింగ్ కు లభించింది.

పార్టీ పగ్గాలు తీసుకున్నారు

పార్టీ పగ్గాలు తీసుకున్నారు

షీ జిన్‌పింగ్ 2012లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ పగ్గాలు తీసుకున్నారు. అప్పటి నుంచి చైనాను మొత్తం తన ఆధీనంలోకి తెచ్చకున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, పార్టీని తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడు. చైనీయుల ఆలోచనలు ఎలా ఉండాలో కూడా జిన్ పింగ్ నిర్ణయిస్తున్నాడు. ఆయన చెప్పినట్లే అక్కడి ప్రజలు కూడా మాట వింటున్నారు.

మావో జెడాంగ్‌తో సమానమైన వ్యక్తి

మావో జెడాంగ్‌తో సమానమైన వ్యక్తి

ఇక జీ జిన్‌పింగ్‌ పై చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) చూపే ప్రేమ అంతా ఇంతా కాదు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌తో జిన్ పింగ్ సమానమైన వ్యక్తి అంటూ ఎన్నో సార్లు సీపీసీలో పెద్దలంతా ప్రశంసిస్తూనే ఉన్నారు.

మంచి పేరు సంపాదించారు

మంచి పేరు సంపాదించారు

జిన్ పింగ్ మాదిరిగా సీపీసీ తొలి అధ్యక్షుడైన మావో జెడాంగ్‌, రెండో అధ్యక్షుడైన డెంగ్‌ జియావోపింగ్‌ మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత ఇప్పుడు జిన్ పింగ్ వాళ్ల అంతటి పేరును సంపాదించారు.

సాఫీగా ఏమీ లేదు

సాఫీగా ఏమీ లేదు

మరి చైనాలో ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న జిన్‌పింగ్ జీవితం అంతా సాఫీగా ఏమీ లేదు. చాలా కష్టాలు పడ్డాడు. ఐదు దశాబ్దాల క్రితం చైనాలో అనే విప్లవాలు వచ్చాయి. అప్పుడు బీజింగ్‌ లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి.

5 ఏళ్లు ఉండేవి

5 ఏళ్లు ఉండేవి

అప్పుడు షీ జిన్‌పింగ్ కు 15 ఏళ్లు ఉండేవి. ఒక చిన్న కుగ్రామంలో ఉండేవాడు. ఎన్నో కష్టాల మధ్య ఆయన పెరిగిన ఆ గ్రామం ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ విధేయులకు యాత్రాస్థలంగా మారింది.

యువకులను ఉత్తేజపరిచేవారు

యువకులను ఉత్తేజపరిచేవారు

అప్పట్లో సీపీసీ అధ్యక్షుడు మావో చైనాలోని యువకులను ఉత్తేజపరిచేవారు. ఆయన స్పీచ్ లు విని చాలా మంది యువకులు దేశ అభ్యున్నతికి నడుం బిగించారు. అందులో జిన్ పింగ్ కూడా ఒకరు.

లక్ష్యం వైపు అడుగులు

లక్ష్యం వైపు అడుగులు

కొన్నాళ్లు జిన్ పింగ్ ఒక గుహలో కాలం వెళ్లదీశారు. ఇరవై ఏళ్లు దాటాక జిన్ పింగ్ తన ఊరుని వదిలి లక్ష్యం వైపు అడుగులు వేశాడు. ఇక జిన్ పింగ్ తండ్రి కూడా విప్లవంలో ముందుండేవారు. తండ్రి భావాలు జిన్ పింగ్ నరనరాల్లో ఉన్నాయి.

చాలా కష్టాలు

చాలా కష్టాలు

జిన్‌పింగ్ తన యుక్త వయస్సులో చాలా కష్టాలు అనుభవించారు. ఎరువుల గంపలు, మట్టి గంపలు నెత్తిన పెట్టుకుని మోశాడు జిన్ పింగ్. చాలా రకాల పనులు చేశాడు. పార చేత పట్టి పలు డ్యామ్‌ల నిర్మాణాల సమయంలో కూలి పనులు కూడా చేశాడు జిన్ పింగ్.

సరైన తిండి లేదు

సరైన తిండి లేదు

జిన్ పింగ్ కు సరైన తిండి కూడా ఉండేది కాదు. చదువుకునేందుకు సరైన సౌకర్యాలు కూడా ఉండేవి కావు. రాత్రిపూట ఒక కిరోసిన్ దీపం వెలుగులో చదువుకునేవాడు.

కసిని పెంచాయి

కసిని పెంచాయి

ఈ కష్టాలన్నీ జిన్‌పింగ్ లో కసిని పెంచాయి. తనకంటూ ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. దాన్ని సాధించే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు.

పీఎల్‌ఏ (సైన్యం) ఆఫీసర్

పీఎల్‌ఏ (సైన్యం) ఆఫీసర్

జిన్ పింగ్ మొదట పీఎల్‌ఏ (సైన్యం) ఆఫీసర్ అయ్యాడు. తర్వాత వివిధ ప్రొవిన్షియల్స్‌ నాయకుడిగా పని చేశాడు. తర్వాత పెద్ద పెద్ద హోదాలు పొందాడు. ఆయన ఆలోచన తీరు ఎప్పుడూ తన లక్ష్యంపైనే ఉండేది. అందుకే తాను అనుకున్న లక్ష్యాలను సాధించాడు.

ఆడంబరాలకు దూరం

ఆడంబరాలకు దూరం

జిన్ పింగ్ ఆడంబరాలకు దూరంగా ఉంటాడు. తన తోటి వారితో కలిసిమెలిసి ఉంటాడు. వాళ్లు ఏది తింటే అదే తింటాడు. ఎప్పుడూ అహం చూపించడు.

స్లోగన్స్

స్లోగన్స్

ప్రస్తుతం చైనా సంస్కృతి గురించి, సోషలిస్టు పంథాల గురించి జిన్‌పింగ్ అభిప్రాయాలు రోడ్ల పక్కన, టీవీల్లో, ఆన్‌లైన్‌లో, మొబైల్ యాప్స్‌ లలో స్లోగన్స్ రూపంలో ఉంటాయి.

ప్రత్యేక పేరు

ప్రత్యేక పేరు

ఒక పేద కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ఇలా చైనాలో మావో తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక పేరును తెచ్చుకున్నాడు జిన్ పింగ్. అతను ఎదిగిన తీరు మాత్రం ప్రపంచంలోని యువతకు ఆదర్శం.

Image Credit

English summary

unknown facts about president of peoples republic of china xi jinping

unknown facts about president of peoples republic of china xi jinping
Story first published: Wednesday, March 21, 2018, 11:30 [IST]