ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 15 నుండి 22 వరకు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ప్రతి వారం, తన ముగింపును ఎలా ఇస్తుంది అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలాంటి ప్రశ్నల నివృత్తికై మా జ్యోతిష్య శాస్త్ర పండితులు మీకు పూర్తి వివరాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు.

మా జ్యోతిష్య శాస్త్ర పండితుల వివరాల ప్రకారం, మీ రాశిచక్రాలు ఈ వారం ఎటువంటి ఫలితాలను ఇవ్వనున్నాయో క్రింద పొందుపరచబడ్డాయి. తద్వారా మీరు ఏమైనా ప్రతికూల ప్రభావిత పరిస్థితులు ఎదురైన సందర్భాలలో మిమ్ములను మీరు సిద్దపరచుకునేలా తయారవ్వగలరు. ఈ రాశిఫలాలు ఏప్రిల్ 15 నుండి 22 వరకు మాత్రమే.

Weekly Predictions For Each Zodiac Sign 15th-22nd April

గుర్తుంచుకోండి: ఈ రాశి ఫలాలు సూర్య మాన సిద్దాంత ప్రకారం ఉంటుంది.

మేషం : మార్చి 21 – ఏప్రిల్ 19

మేషం : మార్చి 21 – ఏప్రిల్ 19

మీ అంతరాత్మ మీకు కొన్ని విషయాలను గురించి ముందుగానే చెప్తుంతుంది. అవి మీ కలల రూపంలో కానీ, లేదా మీ ఆలోచనల రూపంలో కానీ ఉంటాయి. ఈ సమాధానాలు మీ సమస్యలకు పరిష్కారాలుగా కూడా మారగలవు. ఒక్కోసారి ఇతరుల మాటలకన్నా మీ అంతరాత్మ చెప్పినట్లు నడుచుకోవడమే అన్నిటా మేలు. కలలను కూడా తేలికగా తీసుకోరాదు. నిద్ర లేచిన వెంటనే వాటిని ఒక పుస్తకంలో రాసుకునే అలవాటు చేసుకోండి. ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు ఆ పుస్తకమే మీకు పరిష్కారంగా గోచరిస్తుంది అనడం లో ఆశ్చర్యం లేదు.

వృషభం : ఏప్రిల్ 20 – మే 20

వృషభం : ఏప్రిల్ 20 – మే 20

మీలో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఉంది. ఈ వారంలో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, తద్వారా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కొన్ని చేదు అనుభవాలను కూడా మిగులుస్తుంటాయి. కావున ప్రతి అడుగులోనూ జాగ్రత్త తప్పనిసరి. ముఖ్యం గా మీ ఆరోగ్యం పరoగా జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. మరో పక్క మీ కుటుంబ సభ్యులలో మీ పట్ల ప్రేమ వాత్సల్యాన్ని చూడగలుగుతారు. ఇది మీకు చాలా సంతోషాన్నిచ్చే అంశంగా ఉంటుంది.

మిధునం: మే 21 – జూన్ 20

మిధునం: మే 21 – జూన్ 20

మీకు ఈ వారం కాస్త ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయనే చెప్పవచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న మీప్రియమైన వారివల్లనే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కావున ఈ వారం మీరు కొంచం అసౌకర్యంగా భావిస్తారు. మరోపక్క మీ ప్రణాళికా బద్దమైన నిర్ణయాల వలన, మీ లక్ష్యసాధనలో ఎటువంటి సమస్యలు ఎదురుకావు.

కర్కాటకం: జూన్ 21- జూలై 22

కర్కాటకం: జూన్ 21- జూలై 22

ఈ వారం మీ భావోద్వేగాలను నియంత్రించుకోవలసిన అవసరం ఉంది. అనేక విషయాలలో మీరు ప్రణాళికా బద్దంగా వ్యవహరించే తీరు మిమ్ములను సంఘంలో గౌరవ ప్రదమైన స్థానంలో నిలిచేలా చేస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. కానీ మీచుట్టూ ఉన్న వారి ప్రతికూల ప్రభావిత అంశాల వలన మీరు కోపోద్రిక్తులై ప్రవర్తించే అవకాశాలు లేకపోలేదు. తద్వారా మీ స్థాన భంగం కలుగవచ్చు. కావున మీ భావోద్వేగాలను నియంత్రించుకుని దృష్ట్యా అడుగులు వేయవలసి ఉంటుంది. మీ భాగస్వామి ప్రవర్తన మిమ్ములను భాధపట్టే విధంగా ఉండవచ్చు. కావున ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది.

సింహం : జూలై 23 – ఆగస్ట్ 23

సింహం : జూలై 23 – ఆగస్ట్ 23

ఈ వారం మీకు ఆర్ధిక పరిస్థితులు కొంచం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కావున జాగురూతులై వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఈ వారం మీరు ఏర్పర్చుకున్న లక్ష్య సాధనలో అవాంతరాలు ఎదురుకావొచ్చు. నిరాశ పడకండి. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులే కొన్ని పాఠాలను నేర్పగలవు అని గ్రహించండి. సర్ధుబాటు తనం తప్పనిసరి.

కన్య: ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

కన్య: ఆగస్ట్ 24 – సెప్టెంబర్ 23

మీ పని ఒక యుద్ధ భూమిని తలపించేదిలా ఉంటుంది. ఒత్తిడులతో, సవాళ్ళతో ఈ వారం నడుస్తూ మీకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాద్వారా శారీరిక, మానసిక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయాల్లోనే మీ అంతరాత్మ చెప్పినట్లు నడుచుకోవలసిన అవసరం ఉన్నది. తద్వారా సమస్యలను క్రోడీకరించి తగిన నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేయగలరు. కొన్ని సమస్యలు కాస్త ఇబ్బందిని కలిగించినా అవి శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోండి.

తుల: సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

తుల: సెప్టెంబర్ 24 – అక్టోబర్ 23

మీ విశాల దృక్పధం, మీ వ్యక్తిత్వం ఇతరులలో చర్చను తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్న ఒక వ్యక్తి గురించిన కొన్ని నిజాలు మీకు తెలుస్తాయి. ఆ నిర్లక్ష్యం చేసిన వ్యక్తి పట్ల కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. తద్వారా జీవితంలో కొన్ని మార్పులు కూడా చోటుచేసుకుంటాయి.

వృశ్చికం: అక్టోబర్ 24 – నవంబర్ 22

వృశ్చికం: అక్టోబర్ 24 – నవంబర్ 22

ఈ వారంలో మీకు శ్రమ అధికంగా ఉంటుంది. తద్వారా అలసట, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కంటి మీద కునుకులేక పోయినా కూడా లక్ష్య సాధనలో మాత్రం ఈ వారం మీకు విజయమే సిద్దిస్తుంది. మరియు భవిష్యత్ ప్రణాళికల మీద ఒక అంచనాకు కూడా వస్తారు.

ధనుస్సు : నవంబర్ 23 – డిసెంబర్ 22

ధనుస్సు : నవంబర్ 23 – డిసెంబర్ 22

ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ఆఫీసు కార్యక్రమాలలో, ప్రణాళికలలో జరిగే మార్పులు మీకు కాస్త అసౌకర్యాన్ని ఇస్తుంటాయి. ఒక్కోసారి మీరే భాద్యతను తీసుకోవలసిన అవసరం ఉంటుంది. కావున వేసే ప్రతి అడుగులోనూ జాగరూతులై వ్యవహరించడం మంచిది. మరియు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఉంది. ఏ నిర్ణయానికైనా ముందు మీ ప్రియమైనవారితో లేదా అంతరాత్మతో చర్చలు జరపడం మంచిది. మీ శత్రుమూకలు మీకు ప్రతికూల పరిస్థితులను కలిగించే దిశగా అడుగులు వేస్తుంటారు. కానీ అవి మిమ్ములను ఏమీ చేయలేవు, మీ దృఢ సంకల్పం ముందు అవన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకరం : డిసెంబర్ 23 – జనవరి 20

మకరం : డిసెంబర్ 23 – జనవరి 20

మీకు ఈ వారం ఉత్తమ ఫలితాలను ఇచ్చే దిశగా కనిపిస్తుంది. మీ ఆలోచనలకు తగ్గట్లే ఈ వారం ఉండబోనుంది . తద్వారా ఏది నిజం ఏది అబద్దమో తెలుసుకోగలిగి కొన్ని ప్రణాళికలను ఏర్పరచుకోవడానికి అడుగులు వేస్తారు. చీకటిలో ఉన్న నిజాలు సైతం మీ మనసుకు కనిపిస్తాయి. ప్రయత్నలోపం లేకుండా లక్ష్యసాధన దృష్ట్యా అడుగులు వేస్తారు. నలుగురికీ ఆదర్శంగా కనపడి, తద్వారా మీ గురించిన చర్చలు కూడా జరుగుతాయి .

కుంభం : జనవరి 21 – ఫిబ్రవరి 18

కుంభం : జనవరి 21 – ఫిబ్రవరి 18

మీ చుట్టూ జరుగున్న అనేక ప్రతికూల పరిస్థితులపైన మీకొక అవగాహన వస్తుంది. మీకు బాగా తెలిసినవారే వీటన్నిటికీ కారణం అని తెలుస్తుంది. తద్వారా మీరు కొన్ని నిర్ణయాత్మక ఆలోచనలు తీసుకుని విజయం దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతికూల ప్రభావిత పరిస్థితులు మీ మార్గం నందు నిస్తేజమే. కొన్ని ఆలోచనలను పక్కన పెట్టి మీ అంతరాత్మ చెప్పినట్లుగా నడచుకోవడమే మీకు అన్నివిధాలా మంచిది.

మీనం : ఫిబ్రవరి 19 – మార్చి 20

మీనం : ఫిబ్రవరి 19 – మార్చి 20

మీ ఆలోచనలకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. మీ ఆలోచనా తత్వం వలన అనేక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వారం మీకు ఆశించిన ఫలితాలు కనపడకపోవచ్చు. తద్వారా రాబోవు పరిస్థితులను ఎదుర్కొనడానికి సంసిద్దులై ఉండవలసిన అవసరం ఉంది. మరో పక్క మీరు మీ భాగస్వామితో సంతోషంగా గడపడానికి తగిన స్వేచ్చ మీకు లభిస్తుంది.

English summary

Weekly Predictions For Each Zodiac Sign 15th-22nd April

Weekly predictions are as famous as the daily predictions, as most of us check them before we start our week. Weekly predictions reveal about the zodiac signs' luck for the entire week. It tells the pros and cons of the decisions that we take during the week and it also reveals about the best time to start a new venture.